మారుతి మానేసర్‌ ప్లాంట్‌లో మరోసారి సమ్మె సైరన్..

Maruti Suzuki New Swift
అయితే, అప్పుడు ఆ రాష్ట్ర సర్కారు మధ్యవర్తిత్వంతో సదరు యూనియన్ గొడవ తాత్కాలికంగా సద్దుమణిగింది. కానీ, తాజాగా కార్మికులకు హర్యానా ప్రభుత్వం భారీ ఝలక్ ఇచ్చింది. కొత్త యూనియన్ కోసం మానేసర్ కార్మికులు ధరఖాస్తు చేసుకున్న పిటిషన్ ప్రభుత్వం తిరస్కరించింది. కార్మికుల వాదన ప్రకారం.. గడచిన జూన్‌లో నిర్వహించిన సమ్మెకు ప్రతీకారంగా యాజమాన్యం ఈ చర్యలకు పాల్పడిందని అంటున్నారు.

కానీ యాజమాన్యం వాదన మాత్రం ఇలా ఉంది. కార్మికులు కావాలనే కంపెనీకు చెడ్డపేరు తెచ్చేందుకు నిర్లక్ష్యంతో ఉత్పత్తి కార్యకలాపాను నిర్వహిస్తున్నారని, గడచిన ఆగస్టు 24న మొత్తం 1,230 కార్లను ఉత్పత్తి చేయాల్సి ఉంటే కేవలం 437 కార్లు మాత్రమే అసెంబ్లింగ్‌ చేశారని, వీటిలో కేవలం 96 కార్లు మాత్రమే నాణ్యత పరీక్ష (క్వాలిటీ టెస్ట్)లో పాస్ అయ్యాయని, మొత్తం ఉత్పత్తిలో 20 శాతమే నాణ్యత ప్రమాణాలకు అనుగుణంగా ఉన్నాయని కంపెనీ వర్గాలు అంటున్నాయి.

ఏదేమైనప్పటికీ, మానేసర్ ప్లాంటులో తాజాగా తలెత్తిన పరిణామాలు కంపెనీ ఇటీవలే మార్కెట్లోకి విడుదల చేసిన కొత్త స్విఫ్ట్‌పై తీవ్ర ప్రభావాన్ని చూపే ఆస్కారం కనబడుతోంది. ఇప్పటికే కొత్త మార్కెట్లో విడుదలకు ముందు ఏ మోడల్‌కు రానంత స్థాయిలో అశేష ఆదరణ లభించి రికార్డు స్థాయిలో బుకింగ్‌లను నమోదు చేసుకున్న 2011 మారుతి సుజుకి స్విఫ్ట్ మానేసర్ ప్లాంటులోనే తయారవుతుంది.

కొత్త స్విఫ్ట్‌కు ఇప్పటికే బుకింగ్‌లు భారీగా పెరిగి వెయిటింగ్ పీరియడ్ అంతకంతా పెరుగుతున్న తరుణంలో మానేసర్ ప్లాంటులో తాజాగా తలెత్తిన సమ్మె కారణంగా వెయిటింగ్ పీరియడ్ మరింత పెరిగే అవకాశం ఉంది. ఇంకా ఈ ప్లాంటులో కొత్త స్విఫ్ట్‌తో పాటుగా ఇందులో సెడాన్ వెర్షన్ అయిన స్విఫ్ట్ డిజైర్ మరియు ఎస్ఎక్స్4 కార్లు కూడా ఉత్పత్తి అవుతాయి. ఈ ప్లాంటులో మొత్తం 2,500 మంది కార్మికులు పనిచేస్తుండగా, వారిలో 950 మంది మాత్రమే రెగ్యులర్ ఉద్యోగులు ఉన్నారు.

More from DriveSpark

Article Published On: Tuesday, August 30, 2011, 10:29 [IST]
English summary
Manesar plant produces the recently launched new Swift hatchback which has a huge demand. If there is a flare up and a strike at Manesar, the waiting period of the new car will definitely cross the current period of four months.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+