ఎస్-క్లాస్ ఆర్ట్ ఎడిషన్‌ను ఆవిష్కరించిన మెర్సిడెస్ బెంజ్

శాఫ్రాన్ఆర్ట్ సంస్థతో ఓ ఏడాది పాటు సాగనున్న తమ టై-అప్‌లో భాగంగా.. ఆ సంస్థ అందిస్తున్న స్పోర్టీ, లగ్జరీ మరియు లైఫ్‌స్టైల్ అంశాలను హైలైట్ చేసే దిశగా మెర్సిడెస్ బెంజ్ ఇండియా ఈ సరికొత్త ఎస్-క్లాస్ ఆర్ట్ ఎడిషన్ కారును విడుదల చేసింది. మరి దీని విలువ ఎంతో తెలుసా.. జస్ట్ రూ.1.14 కోట్లు మాత్రమే. ప్రస్తుతం ఎస్-క్లాస్‌లో అందుబాటులో ఉన్న టాప్-ఎండ్ వేరియంట్ ఎస్500 కారు కన్నా ఇది దాదాపు రూ.19 లక్షలు అధికం. ఇది పూర్తిగా జర్మనీలో తయారై భారత్‌కు వచ్చింది.


Click it and Unblock the Notifications








