పోలీసుల కారుగా మారనున్న ప్రజల కారు!!

Police Nano
చిల్లర దొంగలు, జేబు దొంగలు, గజ దొంగలు, ముఠా దొంగలు, అందరు దొంగల్లారా పారాహుషార్..!! టాటా నానో కారు వచ్చేస్తోంది. టాటా నానో కారు వస్తే మాకేం భయం అనుకుంటున్నారా.. అయితే, మీరు ఊచలు లెక్కబెట్టటం ఖాయం. ఇకపై 'ప్రజల కారు' కాస్తా 'పోలీసుల కారు'గా మారనుంది. అసలు విషయం ఏంటంటే.. ముంబై పోలీసులు ఓ టాటా నానో కారును తమ పెట్రోలింగ్ కోసం ఉపయోగిస్తున్నారు.

ప్రస్తుతం ఇది ప్రయోగ దశలో ఉంది. ఇది గనుక విజయవంతమైతే, త్వరలోనే ప్రజల కారు కాస్తా పోలీసుల కారుగా మారిపోనుంది. సాధారణంగా ముంబై నగర వీధుల్లో పెట్రోలింగ్ చేయడానికి టూ-వీలర్‌కు బదులు టాటా నానో కారును వాడినట్లయితే చాలానే ప్రయోజనాలున్నాయి. మోటార్‌సైకిల్‌పై అయితే, ఒక్కరు లేదా ఇద్దరు పోలీసు అధికారులు మాత్రమే ప్రయాణించే వీలుంది.

కానీ అదే టాటా నానో కారులో అయితే, నలుగురు పోలీసుల వరకూ పెట్రోలింగ్‌లో పాల్గొనే ఆస్కారం ఉంటుంది. ఈ కారులో సుమారు గంటకు వందకు పైగా కి.మీ. వేగంతో ప్రయాణించవచ్చు. పైపెచ్చు ఎటువంటి వాతావరణ పరిస్థితుల్లోనైనా ఈ కారులో పోలీసు అధికారుల నగర సంచారం చేస్తూ, నగరానికి మరియు నగర ప్రజలకు మెరుగైన భద్రత కల్పించడానికి వీలుంటుంది.

More from DriveSpark

Article Published On: Thursday, September 15, 2011, 9:00 [IST]
English summary
We are finally able to write some kind of good news about the Tata Nano after the recent incidents of the Indian small car catching fire. According to reports, the Mumbai police is considering to use the Tata Nano as a patrol vehicle in the crowded by lanes of the city. The police use motorcycles to patrol some area. They have already procured one Nano and are evaluating the performance.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+