పెట్రోలింగ్ కోసం టాటా నానో కారును పరిశీలిస్తున్న పోలీసులు

Nano Fire
ఈ అవకాశాలన్నింటినీ పరిశీలించిన మహారాష్ట్ర పోలీసులు అధికారులు ప్రస్తుతం ఓ టాటా నానో కారును కొనుగోలు చేసి పెట్రోలింగ్ వాహనంగా ట్రైల్ రన్ నిర్వహిస్తున్నారు. ఈ ప్రయోగంలో టాటా నానో పాస్ అయ్యి, ముంబై పోలీసుల అవసరాలను తీర్చడంలో వారిని సంతృప్తి పరచగలిగినట్లయితే, వారు అధిక సంఖ్యలో టాటా నానో కార్లను ఆర్డర్ ఇచ్చే అవకాశం ఉంది.

ప్రస్తుతం టాటా నానోకు ఈ పరీక్ష ఎంతో కీలకమైనదనే చెప్పాలి. అసలే మందగించిన అమ్మకాలతో టాటా నానో సతమతమవుతుంటే, మరోవైపు వరుస అగ్ని ప్రమాద సంఘటనలతో నానో కార్ల అమ్మకాలు మరింత దిగజారిపోయాయి. ఈ నేపథ్యంలో టాటా నానోకు ఈ ఆర్డర్ ఎంతో అవసరం. ఒకవేళ ముంబైలో ఇది విజయవంతమైతే దీన్ని ఆదర్శంగా దేశంలోని ఇతర రాష్ట్రాలు కూడా తమ పోలీసులకు పెట్రోలింగ్ వాహనంగా టాటా నానో కారును సమకూర్చే అవకాశాలు కూడా లేకపోలేదు.

మరి టాటా నానో కారు దొంగలను క్యాచ్ చేయగలదానే ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్న. ఇదే గనుక జరిగితే టాటా నానో భారత పోలీసుల యొక్క అధికారిక కారుగా మారినా కూడా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. అయితే, విదేశాల్లో మాత్రం దొంగలు చాలా ఫాస్ట్ కాబట్టి అక్కడి పోలీసులు వాడే కార్లు కూడా అంతకన్నా ఫాస్ట్‌గా వెళ్లేవే ఉంటాయి.

ఇటాలియన్ పోలీసులు లాంబోర్గినీ గల్లార్డో కారును, బ్రిటీష్ పోలీసులు రేంజ్ రోవర్‌ను, అమెరికన్ పోలీసులు ఫోర్డ్ ఇన్స్‌పెక్టర్‌ను, జర్మనీ పోలీసులు బిఎమ్‌డబ్ల్యూలను, జపాన్ పోలీసులు నిస్సాన్ 350జెడ్, సుబరు ఇంప్రెజా వంటి సూపర్ కార్లను ఉపయోగిస్తున్నారు. అయితే, మనదేశంలో మాత్రం ప్రపంచంలోనే అత్యంత చౌవకైన టాటా నానో కారును వాడేందుకు పోలీసులు సన్నాహాలు చేస్తున్నారన్నమాట. ఈ పరీక్షలో టాటా నానో నెగ్గాలని మనం కూడా కోరుకుంటా నానో కారుకు నో.. నో.. అని కాకుండా.. ఆల్ ది బెస్ట్ చెబుదాం..!!

More from DriveSpark

Article Published On: Thursday, September 15, 2011, 8:58 [IST]
English summary
Mumbai police might place a large order for the small car if they are impressed by its performance. We wonder what will be the requirements of the Mumbai police that the Tata Nano has to satisfy. Is its size, which can wiggle through Mumbai's narrow lanes? Or is its top speed of the Nano which is around 100kmph? Or is it the Nano's capacity to carry four people which a normal patrol bike cannot handle.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+