వన్ ఇండియా పాఠకుల కోసం డీజిల్ బీట్ కారు గురించిన పూర్తి సమాచారం

దేశీయ మార్కెట్లో ఒకప్పుడు పెట్రోల్ వేరియంట్లదే హవా. అధిక శాతం పెట్రోల్‌తో నడిచే వాహనాలే అమ్ముడయ్యేవి. అయితే, పెట్రోల్ ధరలపై నియంత్రణ ఎత్తివేయడంతో చమురు కంపెనీలు తమ ఇష్టానుసారంగా ధరలను పెంచేస్తున్నాయి. దీంతో కొనుగోలుదారులు డీజిల్ వేరియంట్లపై అధిక ఆసక్తిని కనబరుస్తున్నారు. సరే ఇదలా ఉంచితే.. డీజిల్ బీట్ ప్రత్యేకతలేంటో ఒక్కసారి పరిశీలిద్దాం...!
అమెరికా ఆటో దిగ్గజం జనరల్ మోటార్స్ భారత మార్కెట్లో చెవర్లే బ్రాండ్‌లో అందిస్తున్న తొలి డీజిల్ కారు బీట్ కావడం విశేషం. అంతేకాదు.. డీజిల్ బీట్ భారత్‌లోనే అత్యంత చవకైన డీజిల్ కారు. మైలేజ్ గురించి ఆలోచించే వారికి మరియు పెట్రోల్ ధరల పట్ల ఆందోళన చెందే వారికి డీజిల్ బీట్ చక్కని పరిష్కారం. ఇది లీటరు డీజిల్‌కు 24 కిలోమీటర్ల మైలేజ్‌ను ఇస్తుంది. లో-రన్నింగ్ కాస్ట్‌తో పాటుగా తక్కువ ధరకే డీజిల్ కారును కొనుక్కోవాలనుకునే వారికి ఇది బెస్ట్ ఆప్షన్ అని చెప్పవచ్చు.
బీట్ గురించిన మరింత సమాచారం కోసం నెక్స్ట్ (Next)ను క్లిక్ చేయండి.


Click it and Unblock the Notifications








