బీట్ డీజిల్ సేఫ్టీ ఫీచర్స్

కారు బాడీని దాదాపు 60 శాతం అధిక దృఢత్వం కలిగిన స్టీల్‌తో నిర్మించారు. దీని వల్ల ప్రమాదం జరిగినప్పుడు కారు బాడీలోని కొన్ని కీలక భాగాలు దృఢంగా ఉండి ప్రయాణికులను రక్షిస్తాయి.
యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్ (ఏబిఎస్)
హఠాత్తుగా బ్రేక్ వేయాల్సి వచ్చినప్పుడు కారు చక్రాలు లాక్ కావడాన్ని యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్ (ఏబిఎస్) నిరోధిస్తుంది. సాధారణ బ్రేకింగ్ సిస్టమ్‌లో హఠాత్తుగా బ్రేక్ వేసినప్పుడు చక్రాలు తిరగడం ఆగిపోయి కారు జారిపోయే (స్కిడ్) ఆస్కారం ఉంది. అయితే, ఏబిస్ ఉండే కార్లలో మాత్రం ఇలా జరగదు. కాబట్టి ఇందులో ఉండే ఏబిఎస్ వ్యవస్థ అత్యవసర సమయాల్లో చక్కగా పనిచేసి పూర్తి రక్షణ ఇస్తుంది.
డ్యూయెల్ ఎయిర్ బ్యాగ్స్
ఏదైనా ప్రమాదం సంభవిస్తే తక్షణమే కారులో ముందవైపు ఉండే డ్యూయెల్ ఎయిర్ బ్యాగులు ఆన్ అయ్యి డ్రైవర్‌కు మరియు డ్రైవర్ పక్కన ఉన్న ప్యాసింజర్‌కు రక్షణ కల్పిస్తాయి. (డ్రైవింగ్‌లో సీట్ బెల్టులను ధరించండి)
అడ్వాన్స్‌డ్ లో రోలింగ్ రెసిస్టెన్స్ సిలికా టైర్స్
ఈ కారుకు ఉపయోగించిన సిలికా టైర్స్ అత్యత్తుమ రోడ్ గ్రిప్‌ను కలిగి ఉండి మైలేజ్‌ను పెంచేందుకు ఉపయోగపడుతాయి.
చెవర్లే బీట్ కరల్స్ కోసం


Click it and Unblock the Notifications








