హ్యుందాయ్ చిన్న కారు ఇయాన్ ఫీచర్స్

Hyundai Eon
హ్యుందాయ్ ఇయాన్ కారు ముందువైపు డిజైన్‌ను గమనిస్తే.. ఇదొక చిన్న సైజు ఫ్లూయిడిక్ వెర్నా మాదిరి కనిపిస్తుంది. ఇయాన్ 3495 మి.మీ. పొడవును, 1625 మి.మీ. వెడల్పును మరియు 1535 మి.మీ. ఎత్తును కలిగి ఉండనుంది. ఇందులో ఉపయోగించిన 3-సిలిండర్, 800సీసీ ఇంజన్ 54 బిహెచ్‌పిల శక్తిని, 76.5 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. దీని బూట్ స్పేస్ 215 లీటర్లు.

ఈ సెగ్మెంట్లోనే అత్యంత విశాలమైన వీల్‌బేస్‌ను కలిగి ఉంటిది. ఇక కారు లోపలి భాగానికి వస్తే.. ఇందులో సిల్వర్ ఎసెంట్ బ్లాక్ అండ్ బీగీ కాంబినేషన్‌లో రూపొందించిన డ్యాష్‌బోర్డ్, సౌకర్యవంతమైన సీట్లు, మంచి హెడ్‌రూమ్ మరియు విశాయలమైన ఫ్రంట్ లెగ్‌రూమ్‌లు ఈ కారు సొంతం. అయితే, వెనుక సీట్ లెగ్‌రూమ్ మాత్రం కాస్తంత ఇరుకుగా ఉన్నట్లు తెలుస్తోంది.

ఇకపోతే ఇంకా ఇందులో బాటిల్ హోల్డర్స్, స్టోరేజ్ ట్రేస్, యూఎస్‌బి, ఆక్స్‌ను సపోర్ట్ చేసే మ్యూజిక్ స్టీరియో సిస్టమ్, పవర్ స్టీరింగ్, ఫ్రంట్ పవర్ విండోస్, డ్రైవర్ ఎయిర్‌బ్యాగ్ కూడా ఉండనున్నాయి. ఏబిస్ (యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్) మాత్రం ఆప్షనల్ ఫీచర్‌గా లభించనుంది. ఏఆర్ఏఐ సర్టిఫై చేసిన దాని ప్రకారం, హ్యుందాయ్ ఇయాన్ లీటరుకు 21.1 కి.మీ. మైలేజీని ఇవ్వనుంది. మారతి సుజుకి ఆల్టో మైలేజ్ (లీటరుకు 20.2 కి.మీ.) కన్నా ఇది అధికం. అంటే ఈ దీపావళి పండుగను మరింత ఆనందంగా జరుపుకునేందుకు హ్యుందాయ్ ఈ బుజ్జి కారును తీసుకురానుందన్నమాట.

More from DriveSpark

Article Published On: Friday, September 30, 2011, 12:47 [IST]
English summary
Hyundai's small car Eon looks like the smaller Fluidic Verna from the front side. It has best interiors and exteriors compared to Maruti Suzuki Alto.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+