సిటీ, జాజ్‌ల ధరలు తగ్గినా, అవి ప్రీమియం కార్లే: హోండా

ఇందుకు ఉదాహరణగా కంపెనీ తాజాగా విడుదల చేసిన కొత్త జాజ్‌ను చూపిస్తోంది. పాత వెర్షన్ హోండా జాజ్ కన్నా కొత్త వెర్షన్ హోండా జాజ్‌ను అన్ని ప్రామాణికాల పరంగా ఎంతో ఆకర్షణీయంగా తీర్చిదిద్దింది. అధిక ధర కలిగిన పాత జాజ్‌లో ఉన్న అన్ని ఫీచర్లను కొత్త వెర్షన్ జాజ్‌కు జోడించడమే కాకుండా మరికొన్ని అదనపు ఫీచర్లను కూడా అందించింది.
హోండా తన ఉత్పత్తులపై భారీగా ధరలు తగ్గించడానికి, తన వద్ద డీజిల్ వేరియంట్ కార్లు లేకపోవడమే ప్రధాన కారణం. డీజిల్ కారును భారత్‌కు తీసుకురావాలంటే హోండాకు కనీసం మూడేళ్ల సమయం అయినా పడుతుంది. ఈ నేపథ్యంలో పడిపోతున్న అమ్మకాలను నిలబెట్టుకోవాలంటే ఉత్పత్తుల ధరలు తగ్గించడమే ఏకైక మార్గం.


Click it and Unblock the Notifications








