సెప్టెంబర్ 20న మార్కెట్లోకి రానున్న నిస్సాన్ సన్నీ

మార్కెట్ వర్గాల సమాచారం ప్రకారం, సన్నీ కారు ధరను రూ.6 లక్షల నుండి రూ.9 లక్షల మధ్యలో నిర్ణయించే ఆస్కారం ఉన్నట్లు తెలుస్తోంది. ఇదే గనుక నిజమైతే సన్నీ సెడాన్ రాకతో హోండా సిటీ కారు చిన్నబోనుంది. సన్నీ సెడాన్ కారులో కొత్తగా అభివృద్ధి చేసిన 1.5 లీటర్ ఎమ్ఎఫ్ఐ పెట్రోల్ ఇంజన్‌ను ఉపయోగించింది. ఇది లీటరుకు సుమారు 17 కి.మీ. మైలేజీని ఇవ్వొచ్చని అంచనా.
అంటే, ఇది ప్రస్తుతం చైనా, అమెరికా అందుబాటులో ఉన్న 1.6 లీటర్ వెర్షన్ కన్నా 22 శాతం అధికం. అలాగే ప్రస్తుతం, భారత మార్కెట్లో కొనుగోలుదారులు డీజిల్ కార్లపై ఎక్కువ శ్రద్ధ చూపుతున్న నేపథ్యంలో సన్నీ సెడాన్‌లో పెట్రోల్ వేరియంట్‌ను విడుదల చేసిన అనంతరం ఇందులో డీజిల్ వేరియంట్‌ను కూడా విడుదల చేయాలని కంపెనీ భావిస్తోంది.
అయితే, ఇది వచ్చే ఏడాది తొలి త్రైమాసికంలో విడుదల కావచ్చు. ఇందులో ప్రస్తుతం మైక్రాలో ఉపయోగిస్తున్న 1.5 లీటర్ డీజిల్ ఇంజన్‌ను ఉపయోగించవచ్చని అంచనా.


Click it and Unblock the Notifications