రూ.4.70 లక్షలకే కాంపాక్ట్ ఎస్‌యూవీ: ప్రిమీయర్ రియో

అధిక టాక్స్ బెడద నుండి తప్పించుకునేందుకు ఈ కాంపాక్ట్ ఎస్‌యూవీ పొడవును నాలుగు మీటర్ల కన్నా తక్కువగా ఉండేలా డిజైన్ చేశారు. మరి దీని ధర ఎంతో తెలుసా కేవలం రూ.4.70 లక్షలు మాత్రమే. ఐదుగురు ప్రయాణికులు సౌకర్యంగా, విలాసంగా ప్రయాణించ గలిగి ఈ రియో ఎస్‌యూవీ నాలుగు వేరియంట్లలో డీజిల్, పెట్రోల్ ఇంజన్ ఆప్షన్లతో లభిస్తుంది. డీజిల్ వేరియంట్ రియో ధర రూ.5.29 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా ఉంది.
ప్రిమీయర్ రియో ఎస్‌యూవీకు సంబంధించిన మరిన్న ఆసక్తికర విషయాలు తెలుసుందామా...:
ప్రిమీయర్ రియో ఎస్‌యూవీ పవర్ స్టీరింగ్, అవసరం లేదనుకున్నప్పుడు విడగొట్టి, మడతపెట్టుకుని ఆ స్థలాన్ని లగేజ్ స్పేస్ కోసం వాడుకునేందుకు వీలుగా డిజైన్ చేసిన వెనుక సీట్, ఏబిఎస్ (యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్)తో కూడిన 15 ఇంచ్ అల్లాయ్ వీల్స్, మనదేశపు రోడ్లు ధీటుగా ఉండేలా రూపొందించిన అధిక గ్రౌండ్ క్లియెరెన్స్, కారు వెనుకవైపు అద్దానికి అమర్చిన వైపర్, పవర్ విండోస్, ఎలక్ట్రానిక్ సైడ్ మిర్రర్స్ మరియు రిమోట్ కంట్రోల్ లాకింగ్ సిస్టమ్ వంటి ఎన్నో ఆకర్షనీయమైన ఫీచర్లు రియో సొంతం.
ప్రిమీయర్ రియో ఎస్‌యూవీ ఇంటీరియర్స్ మరియు ఎక్స్టీరియర్స్ ఫీచర్లలకు సంబంధించిన మరిన్ని వివరాల కోసం నెక్స్ట్ (NEXT) పై క్లిక్ చేయండి.


Click it and Unblock the Notifications








