కౌంటర్‌కు ప్రతికౌంటర్: కొత్త విస్టాకు కొత్త స్విఫ్ట్ చురక

Swift Advertisement
గతంలో టాటా మోటార్స్ తమ కొత్త ఇండికా కారును మారుతి సుజుకి కొత్త స్విఫ్ట్‌తో పోల్చుతూ తమ కొత్త విస్టానే అన్ని విధాల బెస్ట్ అనే ప్రయత్నం చేసింది. ఓపెన్ ఛాలెంజ్ అంటూ కొత్త స్విఫ్ట్‌తో తమ కొత్త విస్టాను పోల్చుతూ ప్రకటనలు జారీ చేసింది. అయితే, ఇప్పుడు మారుతి సుజుకి టైమ్ వచ్చింది.

కౌంటర్‌కు ప్రతికౌంటర్ అన్నట్లుగా టాటా కొత్త విస్టాకు ఝలక్ ఇచ్చింది. సాధారణంగా పట్టణాల్లో టాటా విస్టాను చాలా వరకూ ప్యాసింజర్ క్యాబ్‌ల మాదిరిగా, కాల్ టాక్సీల మాదిరిగా ఉపయోగిస్తుండటాన్ని మనం గమనిస్తూనే ఉంటాం. మారుతి కూడా ఇదే కాన్సెప్ట్‌ను ఆధారంగా చేసుకొని టాటా విస్టాకు కౌంటర్ ఇచ్చింది.

మారుతి సుజుకి ఓ ప్రకటనలో టాక్సీ ఇండికేటర్‌ను చూపిస్తూ.. 'మీ కారు కూడా ఇలా కాకుండా ఉండేలా చూసుకోండి అంటూ..' చెప్పకనే చెప్పినట్లుగా టాటా విస్టాకు చురక అంటించింది. దీనికి తోడు ప్రస్తుతం మారుతి సుజుకి మానేసర్ కార్మికుల సమ్మె కారణంగా ఉత్పత్తి సామర్థ్యం నెమ్మదించడం, మరోవైపు పోటీదారుల నుండి పోటీ పెరిగి పోతుండటంతో మారుతి భారీ ఎత్తున ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తుంది.

టెలివిజన్, ఆన్‌లైన్, ప్రింట్.. ఇలా ఏ మీడియాను వదలకుండా ప్రకటనల మీద ప్రకటనలు గుప్పించి తన ఉనికిని చాటిచెప్పే ప్రయత్నం చేస్తుంది. పాపం మారుతి ఎంత ప్రచారం చేసినప్పటికీ.. ఏం లాభం, మందగించిన ఉత్పత్తి, పెరిగిపోతున్న వెయింట్ పీరియడ్ వల్ల కొనుగోలుదారులు ఇతర కార్లవైపు మొగ్గుచూపుతున్నారనేది జగమెరిగిన సత్యం. మరి మారుతి ఈ పరిస్థితులను ఎలా ఎదుర్కుంటుందో కాలమే నిర్ణయించాలి.

More from DriveSpark

Article Published On: Thursday, October 20, 2011, 17:00 [IST]
English summary
Maruti Suzuki has launched an aggressive ad campaign for the Swift. A press advertisement published recently clearly attacks the Tata Indica.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+