సనంద్ ప్లాంటులో ఇతర మోడళ్ల ఉత్పత్తి చేపట్టనున్న టాటా!

గుజరాత్‌ని సనంద్ ప్లాంటును ప్రత్యేకించి టాటా నానో కార్ల ఉత్పత్తి కోసం రూపొందించారు. ఈ ప్లాంటు ద్వారా సాలీనా 2.5 లక్షల టాటా నానో కార్లను ఉత్పత్తి చేయవచ్చు. అయితే, టాటా నానో నెలవారీ విక్రయాలు ప్లాంటు సామర్థ్యం కన్నా గణనీయంగా తగ్గిపోతుండటంతో కంపెనీకు మరియు ఆ ప్రాంతంలోని సప్లయర్లకు లబ్ధి చేకూరే విధంగా ఇతర మోడళ్లను ఇక్కడ ఉత్పత్తి చేయాలని టాటా మోటార్స్ భావిస్తోంది.
గతంలో ఒక నెలలో 10,000 యూనిట్లకు పైగా అమ్ముడైన టాటా నానో గడచిన ఆగస్టు నెలలో కేవలం 1,202 యూనిట్లు మాత్రమే అమ్ముడై, విక్రయాలు 85 శాతానికి పడిపోయాయి. సనంద్ ప్లాంటులో ఖాలీగా ఉన్న ఉత్పత్తి సామర్థ్యాన్ని ఉపయోగించుకునేందుకు ఇక్కడ మరిన్న ఉత్పత్తులను టాటా మోటార్స్ తయారు చేయనుందని, పంత్‌నగర్ లేదా ధార్వార్ ప్లాంట్ల నుండి కొన్ని మోడళ్ల ఉత్పత్తిని సనంద్‌కు తరలించే ఆస్కారం ఉందని కంపెనీ సప్లయర్ ఒకరు చెప్పారు.


Click it and Unblock the Notifications