దేశీయ మార్కెట్లో టాటా నానో వైఫల్యానికి కారణాలు!

Tata Nano
ప్రస్తుతం టాటా మోటార్స్ ప్రజల కారు టాటా నానో టైమ్ అంతగా బాగోలేనట్లుంది. మధ్యతరగతి ప్రజల కారు కలను నిజం చేయాలనే ధృఢ సంకల్పంతో లక్ష రూపాయలకే కారును సృష్టించి రతన్ టాటా ప్రపంచ దేశాలకు ఆదర్శంగా నిలిచారు. అయితే, ప్రస్తుతం టాటా నానో కారుకు గతంలో లభించినట్లుగా పెద్దగా ఆదరణ ఉండటం లేదు.

వాస్తవానికి టాటా మోటార్స్ ఈ కారును పశ్చిమ బెంగాల్‌లోని సింగూర్ ప్లాంటు నుండి విడుదల చేసి ఉంటే, ఇది ప్రజల్లోకి మరింత చొచ్చుకొనిపోయి ఉండేదదేమో. ఈ చిన్న కారు ప్లాంటును సింగూర్ నుండి గుజరాత్‌లోని సనంద్‌కు మార్చడం, మళ్లీ కొత్తగా ప్లాంటు నిర్మించుకోవడంలో ఏర్పడిన జాప్యం కూడా టాటా నానో వైఫల్యానికి కారణాలు కావచ్చు.

ఈ జాప్యం కారణంగా, భారత ఆటోమొబైల్ మార్కెట్లో ఎన్నో చిన్న కార్లు ప్రవేశించాయి. 2009లో టాటా నానో దేశీయ మార్కెట్లో విడుదలైంది. అయితే, ఈ రెండేళ్ల కాలంలో టాటా నానోకు ధీటుగా అనేక గ్లోబల్ కంపెనీలు తమ చిన్న కార్లను ప్రవేశపెట్టాయి. మరోవైపు, తొలుత లక్ష రూపాయల ధరకే కారును అందించాలనుకున్న టాటా మోటార్స్, ఆ తర్వాత ఉత్పత్తి వ్యయం పెరిగిన కారణంగా దీని ధరను రూ.1.50 లక్షల వరకూ పెంచింది.

టాటా నానో ఆన్-రోడ్ మీదకు వచ్చే సరికి ధర సుమారు రెండు లక్షల రూపాయలు అవుతోంది. లక్ష రూపాయల కారు కాస్తా రెండు లక్షల రూపాయలు కావడంతో కొనుగోలుదారులు అదే ధరల శ్రేణిలో ఉండే ఇతర పోటీదారులను ఆశ్రయిస్తున్నారు. మరోవైపు నానో కార్లలో మంటలు చెలరేగుతుండటం కూడా ఈ బుజ్జి కారు వైఫల్యానికి మరో ప్రధాన కారణం.

ఈ సంఘటనలతో ఓవైపు కొనుగోలుదాలుకు టాటా నానో కారంటే.. నో.. నో.. అంటుంటే, మరోవైపు ప్రస్తుతం ఈ చిన్న కారును ఉపయోగిస్తున్న వినియోగదారుల గుండెల్లో 'నానో'లు పరిగెత్తుతున్నాయి. గత కొద్ది నెలలుగా సద్దుమణిగిన టాటా నానో ఫైర్ కేసులు తాజాగా గుజరాత్ మరియు శ్రీలంకలలో నమోదు కావడం ఈ మోడల్‌ సేఫ్టీ మరిన్ని అనుమాలను రేకెత్తిస్తున్నాయి.

More from DriveSpark

Article Published On: Thursday, September 8, 2011, 13:18 [IST]
English summary
The Tata Nano continues to suffer in terms of sales as well as image. The recent instances of Tata Nanos catching fire have not helped its cause. The Nano has had a tumultuous journey from its initial plat in Singur, its move to Sanand, several fire accidents and reduced sales. The image of the Tata Nano has also taken a beating due to its price. It is being considered as a cheap car and yet its luxury variant costs more than Rs.2 lakhs.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+