మారుతి సుజుకి కొత్త స్విఫ్ట్ వేరియంట్స్ - ఫీచర్స్

New Swift
దేశపు అగ్రగామి కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి అందిస్తున్న స్విఫ్ట్ హ్యాచ్‌బ్యాక్‌లో అప్‌గ్రేడెడ్ వేరియంట్ స్విఫ్ట్‌ను కంపెనీ బుధవారం దేశీయ విపణిలోకి విడుదల చేసిన సంగతి తెలిసిందే. దశల వారీగా ఈ కారును దేశంలోని అన్ని ప్రధాన నగరాల్లో విడుదల చేయనున్నట్లు కంపెనీ పేర్కొంది. ఇందులో భాగంగానే నేడు బెంగుళూరులో కొత్త 2011 స్విఫ్ట్ కారును కంపెనీ ఆవిష్కరించింది. ఈ సందర్భంగా కంపెనీ అధికారులు కొత్త 2011 స్విఫ్ట్ కారు గురించి వెల్లడించిన పూర్తి వివరాలు ప్రత్యేకంగా వన్ఇండియా పాఠకుల కోసం....:

మారుతి సుజుకి స్విఫ్ట్ ఎల్ఎక్స్ఐ మరియు ఎల్‌డిఐ వేరియంట్లలో అందిస్తున్న ఫీచర్లు:
* పార్శిల్ ట్రే
* ఇంధన వ్యయాన్ని సూచించే డిస్‌ప్లే
* డ్రైవర్ ఎత్తుకు అనుగుణంగా మార్చుకునేందుకు వీలుగా అమర్చబడిన టిల్ట్ అడ్జస్టబుల్ స్టీరింగ్
* లేన్ ఛేంజ్ ఇండికేటర్
* ఇంధనం తక్కువగా ఉన్నప్పుడు హెచ్చరించే ల్యాంప్
* హెడ్‌లైట్లు ఆన్‌లో ఉన్నట్లు సూచించే రిమైండర్
* కారుకు తాళం చెవి ఉన్నట్లు సూచించే రిమైండర్
* సీట్ బెల్ట్ రిమైండర్
* పవర్ స్టీరింగ్
* మ్యాన్యువల్ ఎయిర్ కండిషనింగ్ కంట్రోల్స్
* ఇమ్మొబిలైజర్ (ఐక్యాట్స్ - ఇంటెలిజెంట్ కంప్యూటరైజ్డ్ యాంటీ-థెఫ్ట్ సిస్టమ్)
* కారు బాడీ కలర్‌లోనే ఉండే బంపర్స్

మారుతి సుజుకి స్విఫ్ట్ విఎక్స్ఐ మరియు విడిఐ వేరియంట్లలో అందిస్తున్న ఫీచర్లు:
పైన తెలిపిన ఎల్ఎక్స్ఐ మరియు ఎల్‌డిఐ ఫీచర్లతో పాటు వాటికి అధనంగా ఈ కింది ఫీచర్లను విఎక్స్ఐ మరియు విడిఐ వేరియంట్లలో పొందవచ్చు.

* ఎలక్ట్రానికల్లీ అడ్జస్టబుల్ అవుట్‌సైడ్ రియర్ వ్యూ మిర్రర్స్
* కారు బాడీ కలర్‌లోనే ఉండే, టర్న్ ఇండికేటర్‌తో కూడిన అవుట్‌సైడ్ మిర్రర్స్
* కీలెస్ ఎంట్రీ సిస్టమ్
* అలారమ్‌తో కూడిన యాంటీ-థెఫ్ట్ సేఫ్టీ సిస్టమ్
* కారు లోపలి వైపు ఉండే డోర్ హ్యాండిల్స్‌పై క్రోమ్ ఫినిషింగ్
* అన్ని పవర్ విండోస్
* సెంట్రల్ లాకింగ్
* ఫాగ్ ల్యాంప్స్
* వీల్ క్యాప్స్
* డే / నైట్ ఇన్‌సైడ్ రియర్ వ్యూ మిర్రర్

మారుతి సుజుకి స్విఫ్ట్ జెడ్‌ఎక్స్ఐ మరియు జెడ్‌డిఐ వేరియంట్లలో అందిస్తున్న ఫీచర్లు:
పైన తెలిపిన విఎక్స్ఐ మరియు విడిఐ ఫీచర్లతో పాటు వాటికి అధనంగా ఈ కింది ఫీచర్లను జెడ్‌ఎక్స్ఐ మరియు జెడ్‌డిఐ వేరియంట్లలో పొందవచ్చు.

* ఆరు స్పీకర్లు మరియు ట్వీటర్స్‌తో కూడిన ఇంటిగ్రేటెడ్ ఆడియో సిస్టమ్
* కారు వేగాన్ని బట్టి మ్యూజిక్ సిస్టమ్ సౌండ్‌ను తగ్గే విధంగా రూపొందించిన ఆటోమేటిక్ వాల్యూమ్ కంట్రోల్
* 15 ఇంచ్‌ల అల్లాయ్ వీల్స్
* కారులోపలి వాతావరణాన్ని బట్టి ఏసి పనిచేసేందుకు సహకరించే ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్
* కారు స్టీరింగ్‌కే అమర్చబడి ఉండే ఆడియో కంట్రోల్స్
* ఎలక్ట్రానిక్ బ్రేక్‌ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్ (ఈబిడి) కూడిన యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్ (ఏబిఎస్)
* ముందువైపు అమర్చిన డ్యూయెల్ ఎయిర్‌బ్యాగ్స్
* డ్రైవర్‌కు అనుకూలంగా సీటు ఎత్తును మార్చుకునే ఏర్పాటు
* కారు వెనుకవైపు వాషర్ మరియు డిఫాగ్గర్‌తో కూడిన వైపర్

ఇవీ కొత్త స్విఫ్ట్ హ్యాచ్‌బ్యాక్‌లో లభించే వేరియంట్లు మరియు వేరియంట్లను బట్టి లభించే ప్రధాన ఫీచర్లు. స్విఫ్ట్ పెట్రోల్ మరియు డీజిల్ ఇంజన్‌ల గురించి తెలుసుకోవడానికి నెక్స్ట్ (NEXT)పై క్లిక్ చేయండి.

More from DriveSpark

Article Published On: Thursday, August 18, 2011, 16:21 [IST]
English summary
India's largest carmaker Maruti Suzuki has launched its all-new Swift hatchback in Bangalore today. Here is the Features and Details of all new 2011 Swift hatchback.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+