అగ్రస్థానాన్ని దక్కించుకుంటాం: బెంజ్; అగ్రస్థానాన్ని వదలం: బిఎమ్‌డబ్ల్యూ

ఈ నేపథ్యంలో చేజార్చుకున్న తన మొదటి స్థానాన్ని తిరిగి దక్కించుకునేందుకు మెర్సిడెస్ బెంజ్ భారీ కసరత్తులు చేస్తోంది. 2015 నాటికి బారత లగ్జరీ కార్ మార్కెట్లో నెంబర్ వన్ స్థానానికి వచ్చేందుకు మెర్సిడెస్ బెంజ్ 10 వరకూ కొత్త బ్రాండ్‌లను పరిచయం చేయనుంది.
అలాగే, బిఎమ్‌డబ్ల్యూ కూడా తన స్థానాన్ని వదులుకునేందుకు సిద్ధంగా లేదు. బ్రాండ్ పొజిషనింగ్, వినియోగదారుల సంతృప్తి, సాంకేతిక పరిజ్ఞానం మరియు ఉద్యోగుల కోరిక వంటి వివిధ విభాగాల్లో తన నాయకత్వాన్ని పునఃనిర్వచిస్తూ నెంబర్ వన్‌గానే సాగుతాననే ధృఢ నిశ్చంయతో ఉంది.
"భారత మార్కెట్‌కు సరిపోయే మా పూర్తి ప్రోడక్ట్ పోర్ట్‌ఫోలియో వచ్చే మూడేళ్లలో ఇక్కడికి రానుంది. అప్పటికి మావి 9 నుంచి 10 కొత్త బ్రాండ్‌లు ఉంటాయని నేను భావిస్తున్నాన"ని మెర్సిడెస్ బెంజ్ ఇండియా డైరెక్టర్ (సేల్స్ అండ్ మార్కెటింగ్) దెబాషిశ్ మిత్రా చెప్పారు.
మెర్సిడెస్ బెంజ్ అందిచనున్న ఈ కొత్త ఉత్పత్తులలో చిన్న కార్లు కూడా ఉంటాయని ఆయన అన్నారు. తమ సమీప పోటీదారు బిఎమ్‌డబ్ల్యూపై ఆయన స్పందిస్తూ, ప్రస్తుతం ఒక్క ఈ-క్లాస్ మినాహా అన్ని సెగ్మెంట్లలో తామే మార్కెట్ లీడర్‌మని, లగ్జరీ కార్ల తయారీదారులందరూ పూర్తిస్థాయిలో తమ ఉత్పత్తలను ఇక్కడికి తీసుకు వస్తేనే అసలైన అంకెల ఆట (గేమ్ ఆఫ్ నెంబర్స్) ప్రారంభమవుతుందని ఆయన అన్నారు.


Click it and Unblock the Notifications








