అగ్రస్థానాన్ని దక్కించుకుంటాం: బెంజ్; అగ్రస్థానాన్ని వదలం: బిఎమ్‌డబ్ల్యూ

Mercedes Benz
మెర్సిడెస్ బెంజ్‌ను బిఎమ్‌డబ్ల్యూ తొలిసారిగా 2009లో తొలిసారిగా ఓవర్‌టేక్ చేసింది. అప్పట్లో బెంజ్ మొత్త 3,247 యూనిట్లను విక్రయిస్తే, బిఎమ్‌డబ్ల్యూ 3,619 యూనిట్లను విక్రయించి బెంజ్ స్థానాన్ని ఆక్రమించుకుంది. అలాగే, 2010లో కూడా బిఎమ్‌డబ్ల్యూ 6,246 యూనిట్లను విక్రయిస్తే, మెర్సిడెస్ బెంజ్ కేవలం 5,819 యూనిట్లను మాత్రమే విక్రయించి మరోసారి కూడా తన ప్రథమ స్థానాన్ని కోల్పోయింది.

అయితే, మిత్రా తెలిపిన దాని ప్రకారం ప్రస్తుతం, మెర్సిడెస్ బెంజ్ 'లాభదాయక వృద్ధి'ని మాత్రమే లక్ష్యంగా చేసుకుందని, బిఎమ్‌డబ్ల్యూ విషయానికి వచ్చేసరికి తన ఎంట్రీ లెవల్ ఎస్‌యూవీ ఎక్స్1 కారణంగా మాత్రమే అమ్మకాల సంఖ్య పెరిగిందని, ఇతర లగ్జరీ కార్ల సెగ్మెంట్ల వల్ల కాదని అన్నారు.

ఈ ఏడాది జనవరి నుంచి జులై వరకూ మెర్సిడెస్ బెంజ్ 3,991 యూనిట్లను విక్రయించిందని మిత్రా చెప్పారు. అయితే, ఇదే సమయంలో బిఎమ్‌డబ్ల్యూ 5,364 యూనిట్లను విక్రయించదని, వాటిలో 1,620 యూనిట్లు బిఎమ్‌డబ్ల్యూ కాంపాక్ట్ ఎస్‌యూవీ అయిన ఎక్స్1 మోడళ్లే ఉన్నాయని ఆయన అన్నారు.

అయితే, బిఎమ్‌డబ్ల్యూ మాత్రం తామేమీ ఉత్పత్తుల ఆధారంగా భారత్‌లో విజయం సాధించలేదని, తమ బ్రాండ్ పొజిషనింగ్ ద్వారానే ఈ స్థానాన్ని దక్కించుకున్నామని అంటోంది. "అన్ని తరాల ప్రజలను ఆకట్టుకునే బిఎమ్‌డబ్ల్యూ కార్లు రూపొందిచబడ్డాయి. మామలు, తండ్రులు, తల్లులు మరియు యువకులకు కార్లను విక్రయించడంలో మాకు ఎలాంటి సమస్యలేదు, బహుశా అదే మా విజయానికి కారణమేమోన"ని బిఎమ్‌డబ్ల్యూ అధ్యక్షుడు ఆండ్రియాస్ స్కాఫ్ అన్నారు.

More from DriveSpark

Article Published On: Monday, September 5, 2011, 16:23 [IST]
English summary
The German luxury carmaker Mercedes-Benz has expressed its desire to regain its position as India's top selling premium carmaker. Mercedes-Benz has been overtaken by its German counterpart BMW in 2009.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+