వామ్మో నానోకు పోటీగా చౌక కారా..?: మా వల్ల కాదు బాబోయ్..!

రూ. 4,000 కోట్ల పెట్టుబడితో గుజరాత్‌లోని సనంద్‌లో ఉన్న టాటా నానో ప్లాంటుకు సమీపంలో తమ రెండో ప్లాంటును ఏర్పాటు చేయనున్న ప్రపంచపు నాలుగో అతిపెద్ద కార్ల తయారీ సంస్థ ఫోర్డ్ మోటార్, భారత కార్ మార్కెట్లో చిన్న కార్ల విభాగంపై దృష్టి సారిస్తామని అయితే, టాటా నానోకు క్లోనింగ్ అంటే మాత్రం ప్రస్తుతం తమ వల్ల కాదని అంటోంది.
వాస్తవానికి ప్రస్తుతం దేశీయ మార్కెట్లో టాటా నానో కారును కొనే వారి సంఖ్య అంతంత మాత్రమనే చెప్పాలి. తొలిసారిగా కారు కొనేవారు కూడా దాదాపు అన్ని ఫీచర్లు కలిగిన ప్రీమియం కార్లపైనే ఆసక్తి చూపుతున్నారు. ఇదే విషయాన్ని ఫోర్డ్ ఇండియా అధ్యక్షుడు మైఖేల్ బోన్‌హామ్ ప్రస్థావిస్తూ.. కంపెనీ అందిస్తున్న ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ ఫోర్డ్ ఫిగో కొనుగోలుదారుల్లో దాదాపు సగానికి పైగా మొట్టమొదటి సారిగా కారును కొనుగోలు చేస్తున్న వారేనని, కాబట్టి వారు ఎక్కువగా ప్రీమియం కార్లపైనే ఆసక్తి చూపుతున్నారని అన్నారు.


Click it and Unblock the Notifications








