కూతురి కోసం అభిషేక్ బచ్చన్ కొన్న 'ఆడి' కారు ఇదే!
ప్రముఖ బాలీవుడ్ నటుడు అభిషేక్ బచ్చన్ తనకు కలిగిన తొలి సంతానానికి గుర్తుగా కొనుగోలు చేసిన ఆడి కారులో ప్రయాణిస్తూ ఇలా అభిమానులకు అడ్డంగా దొరికిపోయాడు. గత నెలలో (మార్చి 2012) సరిగ్గా ఇదే సమయంలో అభిషేక్ బచ్చన్ తన కూతురి పేరుతో (ఆరాధ్య అని సమాచారం) ఓ ఆడి ఏ8 ఎల్ లగ్జరీ కారును బుక్ చేసిన విషయం గురించి తెలుగు డ్రైవ్ స్పార్క్ ఓ కథనాన్ని ప్రచురించిన సంగతి తెలిసిందే.
అబిషేక్ బచ్చన్ తాజాగా తన ఆడి ఏ8 ఎల్ కారులో ప్రయాణిస్తుండగా తీసి ఫోటోలు. ఈ కారుకు ఇంకా రిజిస్ట్రేషన్ కూడా కాలేదు. ఆడి ఇండియా తమ ఫేస్‌బుక్ వాల్‌పై ఈ ఫోటోలను షేర్ చేసింది. అభిషేక్ బచ్చన్ కూడా ఆడి కారును కొనుగోలు చేయటంతో ఆడి లగ్జరీ కార్లను సొంతం చేసుకున్న బాలీవుడ్ సెలబ్రిటీల మరొకరు అధనంగా వచ్చి చేరినట్లయింది. ఇప్పటికే జాన్ అబ్రహామ్, గుల్ పనాగ్ వంటి పలు బాలీవుడ్ సినీ ప్రముఖులు ఆడి కార్లను కలిగి ఉన్నారు.
ఇకపోతే ఆడి ఏ8 ఎల్ లగ్జరీ కారు విషయానికి వస్తే, జర్మన్ కంపెనీ అందిస్తున్న ఈ ప్రీమియం కారు పూర్తిగా విలాసవంతమైన ఫీచర్లతో రూపొందించబడిన శక్తివంతమైన కారు ఇది. ఇది రెండు వేరియంట్లలో లభిస్తుంది. పెట్రోల్ వేరియంట్ ఆడి ఏ8 కారు 4.2 లీటర్ ఎఫ్ఎస్ఐ క్వట్టారో ఇంజన్‌తోనూ, డీజిల్ వేరియంట్ ఆడి ఏ8 3.0 లీటర్ టిడిఐ ఇంజన్‌తోనూ లభిస్తుంది.
భారత మార్కెట్లో ఆడి ఏ8 ఎల్ ధరలు ఈ విధంగా ఉన్నాయి:
* ఆడి ఏ8 ఎల్ 3.0 టిడిఐ క్వెట్టారో - రూ.76,85,000
* ఆడి ఏ8 ఎల్ 4.2 ఎఫ్ఎస్ఐ క్వెట్టారో - రూ.89,00,000
* ఆడి ఏ8 ఎల్ 4.2 టిడిఐ క్వెట్టారో - రూ.98,65,000
* ఆడి ఏ8 ఎల్ డబ్ల్యూ12 క్వెట్టారో - రూ.1,26,00,000
ఇది కూడా చదవండి: కూతురి కోసం ఆడి ఏ8 ఎల్ కారును బుక్ చేసిన అభిషేక్ బచ్చన్


Click it and Unblock the Notifications









