రూ.9,999 ఈఎమ్ఐకే కొత్త జైలోను సొంతం చేసుకోండి
కేవలం నెలకు పది వేల రూపాయల చెల్లించగలిగితే చాలు, కొత్త మహీంద్రా జైలో ఎమ్‌యూవీని మీ సొంతం చేసుకోవచ్చు. యుటిలిటీ వాహనాల తయారీలో తనకంటూ ఓ ప్రత్యేక బ్రాండ్ ఇమేజ్‌ను ఏర్పరచుకున్న దేశీయ వాహన దిగ్గజం మహీంద్రా అండ్ మహీంద్రా (ఎమ్ అండ్ ఎమ్) తాజాగా మార్కెట్లోకి ప్రవేశపెట్టిన అప్‌గ్రేడెడ్ 2012 జైలో ఎమ్‌యూవీ కోసం ఆకర్షనీయమైన ఈఎమ్ఐ (సులభ వాయిదాల పద్దతి) ఆఫర్‌ను అందిస్తోంది.
ఈ ఆఫర్‌లో భాగంగా, నెలకు కేవలం రూ.9,999 లకే కొత్త జైలో ఎమ్‌యూవీని సొంతం చేసుకోవచ్చు. ఎంపిక చేసిన ఫైనాన్షియర్ల ద్వారా మహీంద్రా అండ్ మహీంద్రా ఈ ఈఎమ్ఐ ఆఫర్‌ను అందిస్తోంది. ఈ ఆఫర్‌కు సంబంధించిన మరిన్న వివరాలు, నియమ నిబంధనల కోసం కంపెనీ అధికారిక వెబ్‌సైట్ మహీంద్రాజైలో డాట్‌కామ్‌కు లాగిన్ అవ్వండి.
ఇక సరికొత్త మహీంద్రా జైలో ఎమ్‌పివి విషయానికి వస్తే.. పాత జైలోతో పోల్చుకుంటే దాదాపు 50 మార్పులతో ఈ ఎమ్‌యూవీని రూపొందించడం జరిగింది. ఇందులో ప్రధానంగా చెప్పుకోదగిన ఫీచర్ వాయిస్ కమాండ్ టెక్నాలజీ (విసిటి) వెర్షన్ జైలో ఎమ్‌పివి డి2, డి4, ఈ4, ఈ8, ఈ9 అనే ఐదు వేరియంట్లలో, ఆరు ఆకర్షనీయమైన రంగుల్లో లభించనుంది. కొత్త మహీంద్రా జైలో ఈ9 వేరియంట్‌లో స్కార్పియోలో ఉపయోగించే 2.2లీటర్ ఎమ్‌హాక్ ఇంజన్‌ను ఉపయోగించారు, ఇది 120 బిహెచ్‌పిల శక్తిని, 290 ఎన్ఎమ్‌ల టార్క్‌ను విడుదల చేస్తుంది.
మహీంద్రా జైలో ఎమ్‌యూవీపై మరిన్న కథనాలు
అలాగే, ఈ4, ఈ8 వేరియంట్లలో ఉపయోగించిన 2.5 లీటర్ ఎమ్ఈగల్ ఇంజన్ 112 బిహెచ్‌పిల శక్తిని, డి2, డి4 వేరియంట్లలో ఉపయోగించిన ఎమ్‌డిఐ ఇంజన్ 95 బిహెచ్‌పిల శక్తిని విడుదల చేస్తుంది. ఐదు వేరియంట్లలో లభ్యమయ్యే కొత్త జైలో ఎమ్‌పివి వేరియంట్‌ను బట్టి లీటరుకు 13-15 కి.మీ. మైలేజీనిస్తుంది. హైదరాబాద్ మార్కెట్లో కొత్త జైలోలో లభించే వేరియంట్లు, వాటి ఎక్స్-షోరూమ్ ధరల వివరాలు ఈ క్రింది విధంగా ఉన్నాయి.
కొత్త మహీంద్రా జైలో వేరియంట్లు ధరలు
* Mahindra Xylo D2 BS III - Rs.729364
* Mahindra Xylo D4 BS III - Rs.771539
* Mahindra Xylo E4 BS III - Rs.811120
* Mahindra Xylo E4 ABS BS III - Rs.835296
* Mahindra Xylo E8-ABS BS III - Rs.912787
* Mahindra Xylo E8-ABS-AIRBAG BS III - Rs.951402
* Mahindra Xylo D2 BS IV - Rs.742434
* Mahindra Xylo D4 BS IV - Rs.784608
* Mahindra Xylo E4 BS IV - Rs.820783
* Mahindra Xylo E4 ABS BS IV - Rs.844958
* Mahindra Xylo E8 ABS BS IV - Rs.924396
* Mahindra Xylo E8-ABS-AIR-BAG BS IV - Rs.963584
* Mahindra Xylo E9 BS IV - Rs.1045865


Click it and Unblock the Notifications








