టాటా నానోకు పోటీగా బుజ్జి కారును ప్రవేశపెట్టిన బజాజ్

Bajaj RE60
తనకెవ్వరూ పోటీరారంటూ విర్రవీగిపోతున్న టాటా నానో కారు చెక్ పెట్టేందుకు మరో బుజ్జికారు మార్కెట్లోకి విడులైంది. ద్విచక్ర వాహన మార్కెట్లో దేశపు ద్వితీయ అగ్రగామిగా ఉన్న బజాజ్ ఆటో ఎన్నాళ్లుగానో అభివృద్ధి చేస్తున్న ఓ బుజ్జి కారు "ఆర్ఈ60"ను భారత మార్కెట్లో ఆవిష్కరించింది. కనీవినీ ఎరుగని రీతిలో లీటర్ పెట్రోల్‌కు 35 కి.మీ. మైలేజీనిచ్చే ఈ చిన్న కారును బజాజ్ ఆటో మేనేజింగ్ డైరెక్టర్ రాజీవ్ బజాజ్ లాంఛనంగా దేశీయ విపణిలో ఆవిష్కరించారు.

బజాజ్ ఆర్ఈ60 చిన్న కారులో 200సీసీ డిటిఎస్-ఐ టెక్నాలజీతో కూడిన (బహుశా పల్సర్ మోడల్ బైక్‌లలో ఉపయోగించే ఇంజన్ ఏమో..) ఇంజన్‌ను అమర్చారు. టాటా నానో మాదిరిగానే ఆర్ఈ60 ఇంజన్ కూడా వెనకభాగంలోనే ఉంటుంది. ఇది గరిష్టంగా గంటకు 70 కిలోమీటర్లు వేగంతో పరుగులు తీస్తుందని, దీన్ని అభివృద్ధి చేయడానికి నాలుగేళ్లు శ్రమించామని ఆయన చెప్పారు. తొలుతగా ఈ వాహనాన్ని పొరుగు దేశమైన శ్రీలంకకు ఎగుమతి చేస్తామని ఆయన అన్నారు.

మరికొద్ది నెలల్లోనే బజాజ్ ఆర్ఈ60 వాణిజ్య పరంగా మార్కెట్లోకి విడుదల చేస్తామని కంపెనీ తెలిపింది. 2008లో జరిగిన అంతర్జాతీయ ఢిల్లీ ఆటో ఎక్స్‌పో కంపెనీ తమ కాన్సెప్ట్ కారును "ఆల్ట్రా లో-కాస్ట్ కారు" పేరుతో మార్కెట్‌కు పరిచయం చేసింది. అయితే, ప్రస్తుతం బజాజ్ మార్కెట్లో ఆవిష్కరించిన ఆర్ఈ60 కాన్సెప్ట్‌కు గతంలో కంపెనీ ప్రదర్శించిన ఆల్ట్రా లో-కాస్ట్ కారుకు ఏ మాత్రం పొంతన లేదు. 2008లో ప్రవేశపెట్టిన కాన్సెప్ట్‌కు రీనాల్ట్, నిస్సాన్‌లు మార్కెటింగ్ భాగస్వామిగా వ్యవరించాలనుకున్నాయి.

అయితే, ప్రస్తుతం ఆవిష్కరించిన కాన్సెప్ట్ గురించి ఈ రెండు కంపెనీలకు అస్సలు తెలియనే తెలియదు. రేపటి నుండి ప్రారంభం కానున్న ఢిల్లీ ఆటో ఎక్స్‌పో ఈ బుజ్జి కారును ప్రదర్శించనున్నామని కంపెనీ వెల్లడించింది.

బజాజ్ ఆర్ఈ60లో ఉండే ఫీచర్ల గురించి తెలుసుకోవడానికి నెక్స్ట్ (NEXT)పై క్లిక్ చేయండి.

More from DriveSpark

Article Published On: Thursday, January 5, 2012, 1:29 [IST]
English summary
The Bajaj RE60 is a fourwheeler that has a heart of a motorcycle and the platform of an auto rickshaw. This low cost vehicle is comparitivley priced close to the Tata Nano but there are quite a few differences. Here is a comparison.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+