కొత్త జైలో ఎంట్రీతో ఇన్నోవా, తవేరా నియో3ల పని ఫినిష్..!
2012 జైలో ఎమ్‌పివి చిత్రాల కోసం ఈ లింక్‌పై క్లిక్ చేయండి:
ఎమ్‌హాక్ ఇంజన్, ప్రస్తుతం జైలోలో ఉపయోగిస్తున్న 2.5లీటర్ ఎమ్ఈగల్ ఇంజన్ కన్నా 8 బిహెచ్‌పిల అధిక శక్తిని, 30 ఎన్ఎమ్‌ల అధిక టార్క్‌ను విడుదల చేస్తుంది. ఈ అన్ని ఇంజన్లు కూడా 5-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్ (గేర్స్) సిస్టమ్‌తో లభిస్తాయి. కొత్త జైలోలో మెరుగపరచబడిన రియర్ సస్పెన్షన్, యాంటీ-రోల్ బార్స్ వల్ల ఎలాంటి రోడ్లపై అయినా ఇది సౌకర్యవంతమైన రైడింగ్ అనుభూతిని ఇస్తుంది.
మొత్తమ్మీద చూస్తే.. 2012 మహీంద్రా జైలో ధరలో ప్రస్తుతం మార్కెట్లో లభిస్తున్న పాత జైలో కన్నా రూ.15,000 అధికమే అయినప్పటికీ, అప్‌గ్రేడ్ చేయబడిన ఫీచర్ల కారణంగా ఇది ధరకు తగిన ఫలితాన్ని ఇస్తుందని చెప్పవచ్చు. డి2, డి4 వేరియంట్లు వాణిజ్య ప్రయోజనాల కోసం, ఈ4, ఈ8 వేరియంట్లు పెద్ద కుటుంబం ఉన్న వారి కోసం, ఈ9 వేరియంట్ విలాసం కోరుకునే వారి కోసం చక్కగా సరిపోతుంది. ఆరు ఆకర్షనీయమైన రంగులలో ఇది లభిస్తుంది. టొయొటా కొత్తగా విడుదల చేసిన 2012 ఇన్నోవా, చెవర్లే కొత్తగా ప్రవేశపెట్టిన తవేరా నియో3 ఎమ్‌పివిలకు ఇది గట్టి పోటీ ఇవ్వనుంది.


Click it and Unblock the Notifications









