కొత్త మహీంద్రా జైలో vs కొత్త చెవర్లే తవేరా నియో3
ఈ నేపథ్యంలో టొయోటా 2012 వెర్షన్ ఇన్నోవాను ప్రవేశపెట్టగా, జనరల్ మోటార్స్ 2012 వెర్షన్ చెవర్లే తవేరా నియో3నూ విడుదల చేసింది. అలాగే, మహీంద్రా అండ్ మహీంద్రా కూడా ఈ సెగ్మెంట్లో అందిస్తున్న జైలోలో కొత్త అప్‌గ్రేడెడ్ వెర్షన్‌ను విడుదల చేసింది. అంతేకాకుండా.. మారుతి ఎర్టిగా, నిస్సాన్ ఎవాలియా, అశోక్ లేలాండ్ స్టయిల్, చెవర్లే ఎంజాయ్ వంటి ఎమ్‌పివిలు త్వరలో మార్కెట్లోకి రానున్నాయి.
గత కథనంలో 2012 టొయోటా ఇన్నోవాకు, 2012 మహీంద్రా జైలోకు మధ్య ఉన్న వ్యత్యాసాలను తెలుకున్నాం. అలాగే, ప్రస్తుత కథనంలో 2012 మహీంద్రా జైలోకు 2012 చెవర్లో తవేరా నియో3కు మధ్య గల వ్యత్యాసాలను తెలుసుకుందాం..!
ఎమ్‌పివి సెగ్మెంట్లో చెవర్లే తవేరాకు ఓ ప్రత్యేక స్థానం ఉంది. ఇందులో ఓ సరికొత్త వెర్షన్ (తవేరా నియో3) ఫిబ్రవరి 7న జనరల్ మోటార్స్ భారత మార్కెట్లో విడుదల చేసింది. తవేరా నియో3 ఎమ్‌పివి రూ.8.25 లక్షల నుండి రూ.10.25 లక్షల రేంజ్‌లో కొత్త జైలోకు సమీపంగా చెవర్లే ప్రవేశపెట్టింది. అయితే, మహీంద్రా అండ్ మహీంద్రా కేవలం రూ.7.37 లక్షల ప్రారంభ ధరకే తవేరా నియో3ని సవాల్ చేస్తూ కొత్త 2012 స్టయిలిష్ "జైలో"ను విడుదల చేసింది,
ధరలో ఏది బెస్ట్..?
ధర పరంగా చూస్తే, మహీంద్రా జైలో బేస్ వేరియంట్ కన్నా చెవర్లే తవేరా నియో3 బేస్ వేరియంట్ దాదాపు రూ.88,000 అధికం. అయితే, ఈ రెండు మోడళ్లల టాప్-ఎండ్ వేరియంట్ల ఎక్స్-షోరూమ్ ధరలు మాత్రం సమానంగా ఉన్నాయి. కాబట్టి ఇక్కడ ధర పరంగా రెండు మోడళ్లు దాదాపు సమానంగానే ఉన్నప్పటికీ ఫీచర్ల విషయంలో మాత్రం భారీ వ్యత్యాసాలు ఉన్నాయి.


Click it and Unblock the Notifications









