కొత్త మహీంద్రా జైలో vs కొత్త చెవర్లే తవేరా నియో3

ఫీచర్ల పరంగా గమనిస్తే.. మహీంద్రా జైలో టాప్-ఎండ్ వేరియంట్ ఈ9లో డ్యూయెల్ ఫ్రంట్ ఎయిర్ బ్యాగ్స్, ఏబిఎస్ (యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్) వంటి సేఫ్టీ ఫీచర్లు, క్రూయిజ్ కంట్రోల్, వాయిస్ కమాండ్ టెక్నాలజీ వంటి సౌకర్యవంతమైన ఫీచర్లు ఉన్నాయి. తవేరా నియో3లో ఇవేమీ కనిపించవు. కాబట్టి, ఫీచర్స్ పరంగా చూస్తే కొత్త జైలో అన్ని విధాలా బెస్ట్ అని చెప్పవచ్చు. అయితే, నియో3లో అధిక సీటింగ్ కెపాసిటీ (10 సీట్స్) కలిగి ఉండి అధిక వేగంలో కూడా జైలో కన్నా మంచి హ్యాండ్లింగ్ అనుభూతినిస్తుంది.
పెర్ఫామెన్స్‌లో ఏది బెస్ట్..?
ఇక పెర్ఫామెన్స్ పరంగా గమనించినట్లయితే, కొత్త జైలో టాప్-ఎండ్ వేరియంట్ ఈ9లో 2.2లీటర్ ఎమ్‌హాక్ ఇంజన్‌ను ఉపయోగించారు (ఇదే ఇంజన్‌ను స్కార్పియోలో కూడా ఉపయోగించడం జరుగుతుంది), ఇది 120 బిహెచ్‌పిల శక్తిని, 290 ఎన్ఎమ్‌ల టార్క్‌ను విడుదల చేస్తుంది. తవేరా నియో3లో ఉపయోగించిన 2.0 లీటర్ టిసిడిఐ ఇంజన్ కన్నా 15 బిహెచ్‌పిల అధిక శక్తిని, 26.3 ఎన్ఎమ్‌ల అధిక టార్క్‌ను విడుదల చేస్తుంది.
కాబట్టి, పెర్ఫామెన్స్‌లో చెవర్లే తవేరా నియో3 కన్నా కొత్త జైలో ఎంతో మెరుగైనదని చెప్పవచ్చు. మొత్తమ్మీద చూస్తే, వాణిజ్యపరంగా వాహనాన్ని ఉపయోగించుకోవాలనే వారికి తవేరా నియో3 చక్కగా సరిపోతుంది. అలాగే, కొంచెం స్టయిలిష్ లుక్, ప్రీమియం ఫీల్ కావాలనుకునే వారికి జైలో సూట్ అవుతుంది.


Click it and Unblock the Notifications








