ఫిస్టివ్ ఆఫర్లతో కస్టమర్లను ఆకట్టుకోనున్న కార్ కంపెనీలు

By Ravi
టాటా మోటార్స్ ఆఫర్:
దేశపు ఆటో దిగ్గజం టాటా మోటార్స్ కూడా కస్టమర్ల కోసం వివిధ రకాల ఆఫర్లను అందిస్తోంది. ఈ పండుగ సీజన్ టాటా కార్లను కొనుగోలు చేసే కస్టమర్లు రూ.10,000 నుంచి రూ.50,000 డిస్కౌంట్లను (ఈ డిస్కౌంట్ కస్టమర్లు ఎంచుకునే మోడల్‌ను బట్టి ఉంటుంది). పొందవచ్చు. కంపెనీ అందిస్తున్న బుజ్జి కారు టాటా నానోపై కూడా కంపెనీ ఓ ప్రత్యేక ఆఫర్‌ను అందుబాటులో ఉంచింది.

మారుతి సుజుకి ఆఫర్స్:
భారతదేశపు అగ్రగామి కార్ కంపెనీ మారుతి సుజుకి ఇండియా కూడా పెట్రోల్ కార్లపై భారీ డిస్కౌంట్లను అందిస్తుంది. కంపెనీ ఫ్లాగ్‌షిప్ మోడల్స్ ఆల్టో, వ్యాగన్‌ఆర్‌, ఎస్టిలో మోడళ్లపై రూ.30,000 నుంచి రూ.35,000 వరకు ప్రోత్సాహకాలను అందిస్తోంది. మారుతి సుజుకి బాటలోనే దేశపు ద్వితీయ అగ్రగామి కార్ కంపెనీ హ్యుందాయ్ మోటార్ ఇండియా కూడా పెట్రోల్ కార్లపై వివిధ ప్రోత్సాకాలను ఆఫర్ చేస్తోంది.

మెర్సిడెస్ బెంజ్ ఆఫర్స్:
బుధ్ ఇంటర్నేషనల్ సర్క్యూట్‌‌కు అధికారిక ఆటోమొబైల్ భాగస్వామిగా వ్యవహరిస్తున్న మెర్సిడెస్ బెంజ్ ఇండియా ఓ సరికొత్త ఫెస్టివల్ క్యాంపైన్‌ను ప్రారంభించింది. సెప్టెంబర్ 1, 2012 నుంచి ప్రారంభమైన ఈ క్యాంపైన్ అక్టోబర్ 15, 2012 వరకూ కొనసాగుతుంది. ఈ క్యాంపైన్‌లో భాగంగా, త్రీ పాయింటెడ్ స్టార్‌ను కొనుగోలు చేసే కస్టమర్లకు మెర్సిడెస్ బెంజ్ ఇండియా రేసింగ్ వరల్డ్ స్టార్ మైఖేల్ షుముఖర్‌ను కలుసుకునే అవకాశాన్ని కల్పిస్తుంది.

అంతేకాకుండా, అన్ని ఖర్చులు కంపెనీ భరించి ఫార్ములా వన్ రేస్‌ను ప్రత్యక్షంగా వీక్షించే సౌకర్యాన్ని కూడా ఆఫర్ చేస్తోంది. ఇంకా, ఈ క్యాంపైన్ సమయంలో మెర్సిడెస్ బెంజ్ ఇండియా షోరూమ్‌లను సందర్శించి, తమ వాహనాలను టెస్ట్ డ్రైవ్ చేసే వారికి 2012 ఎయిర్‌టెల్ గ్రాండ్ ప్రి కోసం 100 గ్రాండ్ స్టాండ్ టికెట్లను కూడా కంపెనీ ఇవ్వనుంది.

More from DriveSpark

Article Published On: Monday, September 10, 2012, 17:13 [IST]
English summary
Car makers, including Honda Siel Cars, Tata Motors, Ford India and Maruti Suzuki, are offering discounts worth up to around Rs. 60,000 in a bid to cash in on the festive season amid a sluggish market.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+