పండుగ సీజన్లో కార్ మేకర్ల నుంచి కస్టమర్లకు వరాలే వరాలు
దీనికితోడు తాజాగా మార్కెట్లో వస్తున్న కొత్త కార్లతో పెరుగుతున్న పోటీ పరిస్థితుల్లో అగ్రగాములుగా నిలవాలంటే కార్ కంపెనీలకు తమ అమ్మకాలను పెంచుకోవాల్సిన అవసరం ఉంది. హోండా, టాటా, ఫోర్డ్, మారుతి సుజుకి వంటి కంపెనీలు సుమారు తమ కార్లపై రూ.10,000 మొదలుకొని రూ.60,000 వరకూ తగ్గింపులను, ప్రోత్సాహకాలను అందించనున్నాయి.
హోండా ఆఫర్స్:
హోండా తమ కస్టమర్ల కోసం ప్రత్యేక ఆఫర్లను ప్రకటించింది. హోండా అందిస్తున్న బ్రయో, సిటీ, సివిక్, అకార్డ్ కార్ల కొనుగోలుపై ఒక్క రూపాయికే బీమా (ఇన్సూరెన్స్) ఆఫర్‌ను అందుబాటులోకి తెస్తామని కంపెనీ ఉపాధ్యక్షుడు (సేల్స్ అండ్ మార్కెటింగ్) జ్ఞానేశ్వర్‌సేన్ తెలిపారు. కస్టమర్లు ఎంచుకునే మోడల్‌ను బట్టి, వాహనాన్ని కొనుగోలు చేసే ప్రాంతాన్ని బట్టి రూ.60,000 వరకూ తగ్గింపులను అందించనున్నామని ఆయన చెప్పారు.
ఫోర్డ్ ఆఫర్స్:
అమ్మకాల సంఖ్య పరంగా డీలాపడిన అమెరికన్ కార్ కంపెనీ ఫోర్డ్ కూడా దేశీయ విపణిలో భారీ డిస్కౌంట్లను ఆఫర్ చేసేందుకు సిద్ధమవుతోంది. సాధారణంగా ప్రతి పండుగ సీజన్‌లో వివిధ స్కీమ్‌లను అందిస్తుంటామని, అలాగే ఈ పండుగ సీజన్ కోసం కూడా గిఫ్ట్ వోచర్‌లను, లాయల్టీ ఎక్సేంజ్ బోనస్ వంటి ఆఫర్లను అందుబాటులోకి తెచ్చామని కంపెనీ ఉపాధ్యక్షుడు (మార్కెటింగ్) అనురాగ్ మెహరోత్రా చెప్పారు.
ఇప్పటికే కేరళ పెద్ద పండుగ ఓనమ్ సందర్భంగా ప్రారంభించిన ఈ స్కీమ్‌కు భారీ స్పందన లభించిందని ఆయన తెలిపారు. ఫోర్డ్ అందిస్తున్న స్పోర్ట్స్ యుటిలిటీ వెహికిల్ (ఎస్‌యూవీ) ఎండీవర్ కొనుగోలుపై రూ.52,000 విలువైన యాక్ససరీలను ఉచితంగా అందిస్తున్నామని, అలాగే, ఎక్సేంజ్ ఆఫర్ క్రింద రూ.20,000 వరకూ లాయల్టీ బోనస్‌ను కస్టమర్లకు ఆఫర్ చేస్తున్నామని ఆయన వివరించారు. తమ చిన్న కారు ఫిగో కొనుగోలుపై ఉచిత బీమాతో పాటుగా రూ.28,000 విలువైన ప్రోత్సాకాలను అందిస్తున్నామని మెహరోత్రా తెలిపారు.


Click it and Unblock the Notifications









