అత్యంత ఆదరణ పొందిన కార్లలో XUV500, నానోలు టాప్

ఈ జాబితాలో మహీంద్రా తాజాగా మార్కెట్లోకి విడుదల చేసిన ఎక్స్‌యూవీ500 ఎస్‌యూవీ అత్యంత ఆదరణ పొందిన కారుగా నిలువగా, మారుతి సుజుకి అత్యంత ఆదరణ పొందిన కార్ బ్రాండ్‌గా నిలిచింది. కాగా, ఈ జాబితాలో అత్యంత ప్రజాదరణ పొందిన కారుగా రెండవ స్థానంలో టాటా నానో నిలవడం, ఈ కారును విమర్శించే వాళ్లందరి ముక్కున వేలు వేసుకునేలా చేసింది. ఇకపోతే ఈ జాబితాలో మూడవ స్థానాన్ని మారుతి సుజుకి స్విఫ్ట్ డిజైర్ దక్కించుకుంది.
ఎక్స్‌యూవీ500 ఎస్‌యూవీని అత్యంత ఆకర్షనీయమైన ధరకే, ప్రపంచ స్థాయి ఫీచర్లతో మహీంద్రా అందించడంతో ఈ మోడల్ మార్కెట్లో సునామీ సృష్టించింది. దేశీయ మార్కెట్లో ఈ మోడల్‌కు ఉత్పత్తికి మించిన డిమాండ్ ఉంది. అందుకే, ప్రపంచ మార్కెట్లకు ఎక్స్‌యూవీ500ను ఎగుమతి చేయాలనుకున్న ప్రణాళికలను కూడా కంపెనీ వాయిదా వేసుకుంది.
లక్షల రూపాయల ధరతో మార్కెట్లోకి విడుదలైన టాటా నానో కారు, తొలుత మార్కెట్లో జోరుగా దూసుకుపోయినప్పటికీ, ఆ తర్వాతి కాలంలో వరుసగా నానో మంటల్లో కాలిపోవటం వంటి సంఘటనలో ఈ మోడల్ అమ్మకాలు వెనక్కు తగ్గాయి. కానీ నానోలో పాత ధరకే కొత్త వెర్షన్‌ను ప్రవేశపెట్టిన తర్వాత మళ్లీ ఈ మోడల్ అమ్మకాలు జోరందుకున్నాయి.
బ్లూబైట్స్ జాబితాలో స్థానం సంపాధించుకున్న భారతదేశపు అత్యంత ఆదరణ పొందిన టాప్ 5 కార్ల వివరాలు ఇలా ఉన్నాయి:
1 మహీంద్రా ఎక్స్‌యూవీ500
2 టాటా నానో
3 మారుతి సుజుకి స్విఫ్ట్ డిజైర్
4 మహీంద్రా స్కార్పియో
5 ఆడి ఆర్8


Click it and Unblock the Notifications








