మార్చిలో మార్కెట్లోకి రానున్న మారుతి ఎర్టిగా ఎమ్‌పివి
వచ్చే మార్చి నెల చివరి భాగంలో కానీ లేదా ఏప్రిల్ నెల మొదటి వారంలో మారుతి సుజికి ఎర్టిగా ఎమ్‌పివి మార్కెట్లో వాణిజ్య పరంగా లభ్యం కానుంది. ఇందులో నెక్స్ట్ జనరేషన్ కె-సిరీస్ 1.4 లీటర్ వివిటి ఇంజన్‌ను అమర్చారు. టొయాటా నుండి అత్యధికంగా అమ్ముడవుతున్న ఎమ్‌పివి ఇన్నోవాకు పోటీగా మారుతి సుజుకి రూపొందించిన ఈ సెవన్-సీటర్ ఎర్టిగా ఎమ్‌పివి పెట్రోల్, డీజిల్ వేరియంట్లలో లభ్యం కానుంది.
పెట్రోల్ వేరియంట్‌లో లభించనున్న ఎర్టిగా లీటరు పెట్రోల్‌కు 16.02 కి.మీ. మైలేజీని, డీజిల్ వేరియంట్ ఎర్టిగా లీటరు డీజిల్‌కు 20.77 కి.మీ. మైలేజీనిస్తుంది. మారుతి సుజుకి ఎర్టిగా ఎమ్‌పివి 4265 మి.మీ. పొడవును, 1695 మి.మీ. వెడల్పును, 1685 మి.మీ. ఎత్తును కలిగి ఉంటుంది. భారతీయ రోడ్లకు అనువుగా ఉండేలా దీని వీల్‌బేస్ 2740 మి.మీ ఉంటుంది.
మారుతి సుజుకి ఎర్టిగా ఎమ్‌పివిలో ఉండే ఫీచర్లు, తదితర వివరాల కోసం నెక్స్ట్ (NEXT)పై క్లిక్ చేయండి.


Click it and Unblock the Notifications









