మారుతి సుజుకి ఎర్టిగా ఎమ్‌పివి ఫీచర్లు, స్పెసిఫికేషన్లు
అంతేకాకుండా ఇందులో తొలిసారిగా సరికొత్త శక్తివంతమైన మరియు తేలికైన కె-14 వివిటి పెట్రోల్ ఇంజన్‌ను ఉపయోగించారు. ప్రపంచ మార్కెట్ల కోసం మారుతి సుజుకి ఈ ఇంజన్‌ను పరిచయం చేయడం జరిగింది. ఈ ఇంజన్ తక్కువ బరువు కలిగి ఉండటం వలన మైలేజ్ కూడా పెరుగుతుంది. ఇకపోతే డీజిల్ వేరియంట్ ఎర్టిగా ఎమ్‌పివిలో 1.3 లీటర్ డిడిఐఎస్ సూపర్ టర్బో డీజిల్ ఇంజన్‌ను ఉపయోగించారు.
ఎర్టిగాలో ఉపయోగించిన కె-14 వివిటి పెట్రోల్ ఇంజన్ 6000 ఆర్‌పిఎమ్ వద్ద 70 కి.వా. గరిష్ట శక్తిని, 4000 ఆర్‌పిఎమ్ వద్ద 130 ఎన్ఎమ్‌ల గరిష్ట టార్క్‌ను విడుదల చేస్తుంది. అలాగే 1.3 లీటర్ డిడిఐఎస్ సూపర్ టర్బో డీజిల్ ఇంజన్ 4000 ఆర్‌పిఎమ్ వద్ద 66 కి.వా. గరిష్ట శక్తిని, 1750 ఆర్‌పిఎమ్ వద్ద 200 ఎన్ఎమ్‌ల గరిష్ట టార్క్‌ను విడుదల చేస్తుంది. దీని ధర రూ.6 లక్షల నుండి రూ.9 లక్షల రేంజ్‌లో ఉండొచ్చని అంచనా.


Click it and Unblock the Notifications









