మారుతి సుజుకి ఎర్టిగా ఫీచర్లు, స్పెసఫికేషన్లు, ధరలు
మారుతి సుజుకి ఇండియా అత్యంత ఆకర్షనీయమైన ధరకే ఎర్టిగా ఎమ్‌పివిను మార్కెట్లోకి విడుదల చేసి ఈ సెగ్మెంట్లో ధరల యుద్ధానికి తెరలేపిన సంగతి తెలిసిందే. కేవలం రూ.5.89 లక్షల ప్రారంభ ధరకే ఎర్టిగా పెట్రోల్ వేరియంట్‌ను, రూ.8.45 లక్షల ప్రారంభ ధరకే డీజిల్ వేరియంట్‌ను కంపెనీ ఆఫర్ చేస్తోంది.
ఎర్టిగాను ఆర్3 (R3) కాన్సెప్ట్ పేరుతో మారుతి సుజుకి తొలిసారిగా 2010లో జరిగిన ఢిల్లీ ఆటో ఎక్స్‌పోలో ఆవిష్కరించింది. కాగా.. తాజాగా గడచిన జనవరిలో ఢిల్లీలో జరిగిన 2012 ఆటో ఎక్స్‌పో ప్రొడక్షన్‌ను సిద్ధంగా ఉన్న ఎర్టిగాను విడుదల చేసింది. పెద్ద కుటుంబాలున్న వారి కోసం సరసమైన ధరకే ఓ యుటిలిటీ వాహనాన్ని అందించాలనే ఉద్దేశ్యంతో మారుతి సుజుకి ఎర్టిగా ఎమ్‌పివి అభివృద్ధి చేసింది.
మారుతి సుజుకి ఎర్టిగా ఎమ్‌పివిలో లభించనున్న పూర్తి ఫీచర్లు, స్పెసిఫికేషన్లు, రంగులు, వేరియంట్లు, లభించే ధరలు తదితర అంశాలకు సంబంధించిన వివరాలు ఈ క్రింది విధంగా ఉన్నాయి:
మారుతి సుజుకి ఎర్టిగా పెట్రోల్ మరియు డీజిల్ వేరియంట్లలో లభిస్తుంది. మారుతి సుజుకి ఇండియా అందిస్తున్న మొత్తం పెట్రోల్ వేరియంట్ కార్లలో ఇదివరకెన్నడూ ఉపయోగించని సరికొత్త అత్యాధునిక కె-సిరీస్ 1.4 లీటర్ పెట్రోల్ వివిటి ఇంజన్‌ను ఎర్టిగా ఎమ్‌పివిలో మొట్టమొదటి సారిగా ఉపయోగించారు. ఇకపోతే డీజిల్ వేరియంట్లో 1.3 లీటర్ డిడిఐఎస్ సూపర్‌టర్బో విజిటి డీజిల్ ఇంజన్ ఉపయోగించారు.
విలాసవంతమైన కారులో ఉండే ఇంటీరియర్ల అనుభూతినిచ్చేలా ఎర్టిగా ఎమ్‌పివిని ఇంటీరియర్లను తీర్చిదిద్దారు. వెనుక కూర్చునే ప్యాసింజర్ల కోసం ఎర్టిగా రూఫ్‌పై అమర్చిన విశాలమైన ఎసి వెంట్స్, బీజ్ అండ్ లైట్ కలర్ ఇంటీరియర్ ప్లాస్టిక్స్, సెంట్రల్ కన్సోల్‌పై అమర్చిన 2-డిన్ ఆడియో సిస్టమ్ డ్యాష్‌బోర్డుకు మరింత అందమైన లుక్‌నిస్తుంది. 3-స్పోక్ స్టీరింగ్ వీల్, స్పోర్టీ గేర్ నాబ్ వంటి ప్రత్యేకమైన ఇంటీరియర్లు ఎర్టిగా ఎమ్‌పివి సొంతం.


Click it and Unblock the Notifications









