ఎర్టిగా మైలేజ్: 16.02 కెఎమ్‌పిల్ (పెట్రోల్); 20.77 కెఎమ్‌పిల్ (డీజిల్)
ఎర్టిగా ఎమ్‌పివిలో వెనుక రెండు వరుసలలో (మిడిల్ రో, లాట్స్ రో) ఉండే సీట్లను పూర్తిగా మడిచిపెట్టి, ఆ స్థలాన్ని లగేజ్ కోసం ఉపయోగించుకోవచ్చు. చివరి వరుసలో ప్యాసింజర్లు కూర్చోవాలంటే మధ్య వరుసలో ఉండే సీటును పూర్తిగా ముందు వైపుకు మడిచిపెట్టాల్సి ఉంటుంది. ఎర్టిగా ఎమ్‌పివిలో స్టీరింగ్ వీల్‌పైనే ఆడియో కంట్రోల్స్ ఉంటాయి. దీని ద్వారా స్టీరియో సిస్టమ్ శబ్ధాన్ని తగ్గించుకోవచ్చు, పాటలు మార్చుకోవచ్చు.
ఎర్టిగా ఎమ్‌పివిలో అమర్చిన ఆడియో సిస్టమ్ యూఎస్, ఆక్స్-ఇన్ కనెక్టివిటీలను కలిగి ఉంటుంది. ఇందులో రెండు ఎస్ఆర్ఎస్ ఎయిర్‌బ్యాగ్స్, ఏబిఎస్ (యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్), ఈబిడి (ఎలక్ట్రానికి బ్రేక్-ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్) వంటి భద్రతా ఫీచర్లు కూడా ఉన్నాయి. కప్ హోల్డర్స్, టర్నింగ్ ఇండికేటర్లతో కూడిన ఎలక్ట్రిక్ అవుట్‌సైడ్ రియర్ వ్యూ మిర్రర్స్ (సైడ్ మిర్రర్స్), పవర్ విండోస్, డిఫాగ్గర్‌తో కూడిన రియర్ విండ్‌షీల్డ్ (వెనుక అద్దం), అల్లాయ్ వీల్స్ డిజైన్, కారు సైడ్ ప్రొఫైల్, ఆకర్షనీయమైన ఫ్రంట్ గ్రిల్ వంటి వాటితో మొత్తమ్మీద ఎర్టిగా ఓ విశిష్టమైన లుక్ అండ్ ఫీల్ అనుభూతిని కల్పిస్తుంది.
ఎర్టిగా ఎమ్‌పివి ఇంజన్ పవర్:
* మారుతి సుజుకి ఎర్టిగా ఎమ్‌పివిలో అమర్చిన 1.4 లీటర్ కె14 వివిటిఐ పెట్రోల్ ఇంజన్ 6000 ఆర్‌పిఎమ్ వద్ద గరిష్టంగా 95 పిఎస్ (70 కి.వా.)ల శక్తిని, 4000 ఆర్‌పిఎమ్ వద్ద 130 ఎన్ఎమ్‌ల గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది లీటరు పెట్రోల్‌కు 16.02 కి.మీ. మైలేజీని ఇస్తుంది.
* ఇక డీజిల్ వేరియంట్ ఎర్టిగా విషయానికి వస్తే, ఇందులో అమర్చిన 1.3 లీటర్ డిడిఐఎస్ సూపర్‌టర్బో విజిటి డీజిల్ ఇంజన్ 4000 ఆర్‌పిఎమ్ వద్ద గరిష్టంగా 90 పిఎస్ (66 కి.వా.)ల శక్తిని, 1750 ఆర్‌పిఎమ్ వద్ద 200 ఎన్ఎమ్‌ల గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది లీటరు డీజిల్‌కు 20.77 కి.మీ. మైలేజీని ఇస్తుంది.


Click it and Unblock the Notifications









