మారుతి ఎర్టిగా ఎమ్‌పివి వేరియంట్లు - లభించే ఫీచర్లు
మారుతి సుజుకి ఎర్టిగా మొత్తం ఆరు వేరియంట్లలో (మూడు పెట్రోల్ వేరియంట్లు, మూడు డీజిల్ వేరియంట్లు) లభిస్తుంది. ఎర్టిగా ఎంట్రీ లెవల్ వేరియంట్లయిన ఎల్ఎక్స్ఐ (పెట్రోల్), ఎల్‌డిఐ (డీజిల్) వేరియంట్లలో క్రింద తెలిపిన ఫీచర్లు లభిస్తాయి.
మారుతి సుజుకి ఎర్టిగా ఎల్ఎక్స్ఐ / ఎల్‌డిఐ వేరియంట్లలో లభించే ఫీచర్లు:
* ఏబిఎస్ (ఎల్‌డిఐ వేరియంట్లో మాత్రమే)
* మ్యాన్యువల్ ఏసి
* ఇంజన్ ఇమ్మొబిలైజర్
* పవర్ స్టీరింగ్
* లోపలి నుండే అడ్జస్ట్ చేసుకునేలా ఏర్పాటు చేసిన సైడ్ మిర్రర్స్ (మ్యాన్యువల్ ఓవిఆర్ఎమ్‌లు)
* యాక్ససరీ సాకెట్
* 60:40 నిష్పత్తిలో మడుకునేందుకు వీలుగా అమర్చిన వెనుక సీట్లు
* టిల్ట్ (వంపు) స్టీరింగ్
* రీట్రాకబిల్ కప్ హోల్డర్స్ (అవసరం లేదనుకుంటే లోపలకు మడుచుకోవచ్చు)
* కారు బాడీ రంగులోనే ఉండే బంపర్స్
* ట్యాంక్‌లో ఇంధనం తగ్గినట్లు చూపించే వార్నింగ్ ల్యాంప్
* డోర్ లాక్ క్యాన్సిలర్ (ముందు వైపు డోర్లకు మాత్రమే)
ఎర్టిగా మిడ్ లెవల్ వేరియంట్లయిన విఎక్స్ఐ (పెట్రోల్), విడిఐ (డీజిల్) వేరియంట్లలో లభించే ఫీచర్ల వివరాలు ఇలా ఉన్నాయి.
ఎర్టిగా విఎక్స్ఐ (పెట్రోల్), ఎర్టిగా విడిఐ (డీజిల్) వేరియంట్లలో పైన తెలిపిన ఫీచర్లకు అధనంగా క్రింద పేర్కొన్న ఫీచర్లు కూడా లభిస్తాయి:
* ఈబిడితో కూడిన ఏబిఎస్ (విఎక్స్ఐలో ఆప్షనల్, విడిఐలో స్టాండర్డ్)
* ట్విన్ (డబుల్) ఏసి
* సెక్యూరిటీ అలారమ్ సిస్టమ్ (డోర్, హుడ్)
* ఫూల్ వీల్ క్యాప్ (వీల్ కవర్)
* టాకోమీటర్
* ముందు వైపు ఫాగ్ ల్యాంప్స్
* సిడి, యూఎస్‌బి, స్పీకర్లతో కూడిన ఆడియో సిస్టమ్
* సీట్ బ్యాక్ పాకెట్స్ (కో-డ్రైవర్ సైడ్)
* షోల్డర్ అడ్జస్ట్ కలిగిన ముందువైపు సీట్ బెల్ట్స్
* వెనుక సీట్లో (మధ్య వరుసలోనిది) అమర్చిన ఆర్మ్ రెస్ట్
* ముందు, వెనుక పవర్ విండోస్
* ఆటోమేటిక్‌గా డౌన్ అయ్యే డ్రైవర్ సైడ్ పవర్ విండో
* కారు బాడీ రంగులోనే ఉండే డోర్ హ్యాండిల్స్, సైడ్ మిర్రర్స్
* రిమోట్ కీలెస్ ఎంట్రీ
* సైడ్ మిర్రర్స్‌పై టర్న్ ఇండికేటర్స్ (ఎలక్ట్రిక్)
* ప్యాసింజర్ వానిటీ మిర్రర్
* ముందువైపు, వెనుక వైపు అమర్చిన ఫాగ్ ల్యాంప్స్
* ముందు వెనుక అమర్చిన మడ్ గార్డ్
* ఫ్యూయెల్ ఎఫీషియన్సీ డిస్‌ప్లే


Click it and Unblock the Notifications









