అప్‌గ్రేడెడ్ మారుతి సుజుకి రిట్జ్ ఫోటోలు విడుదల
మారుతి సుజుకి అందిస్తున్న రిట్జ్ హ్యాచ్‌బ్యాక్‌లో ఓ సరికొత్త అప్‌గ్రేడెడ్ వేరియంట్‌ను కంపెనీ మార్కెట్లో ప్రవేశపెట్టనుందని తెలుగు డ్రైవ్ స్పార్క్ గతంలో ఓ కథనాన్ని ప్రచురించిన సంగతి తెలిసిందే. అయితే, ఇప్పుడు తాజాగా రిట్జ్ హ్యాచ్‌బ్యాక్‌లో ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌ను కంపెనీ విదేశీ మార్కెట్లలో విడుదల చేసింది. ప్రస్తుతం మార్కెట్లో లభ్యమవుతున్న రిట్జ్ స్టాక్ పూర్తిగా క్లియర్ కాగానే కొత్త వేరియంట్‌ను మారుతి సుజుకి విడుదల చేసే అవకాశం ఉంది.
రిట్జ్ హ్యాచ్‌బ్యాక్ గ్లోబల్ మార్కెట్లలో సుజుకి స్ప్లాష్ (Suzuki Splash) అనే పేరుతో అమ్ముడవుతుంది. ఈ నేపథ్యంలో ఇండియాకు రానున్న కొత్త ఫేస్‌లిఫ్ట్ రిట్జ్ ఫోటోలోను సుజుకి విడుదల చేసింది. ఈ అప్‌గ్రేడెడ్ రిట్జ్‌లో రీడిజైన్ చేయబడిన ఫ్రంట్ గ్రిల్, సరికొత్త డిజైన్‌తో కూడిన ఫ్రంట్ ఫాగ్‌ల్యాంప్స్, రివైజ్ చేసిన బానెట్ డిజైన్, కొద్దిగా మార్పు చేయబడిన ఫ్రంట్ హెడ్‌లైట్స్, వెనుక వైపు బంపర్‌పై నకిలీ (ఫేక్) ఎయిర్ వెంట్స్ వంటి మార్పులు చోటుచేసుకోనున్నాయి.
కొత్త రిట్జ్ ఇంటీరియర్‌లో కూడా కొద్దిపాటి మార్పులు ఉండనున్నాయి. ఇందులో ఉపయోగించిన 1.2 లీటర్ కె సిరీస్ పెట్రోల్ ఇంజన్ 84 బిహెచ్‌పిల శక్తిని, 1.3 లీటర్ డీజిల్ ఇంజన్ 74 బిహెచ్‌పిల శక్తిని ఉత్పత్తి చేస్తుంది. ఇవి రెండూ కూడా 5-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్ సిస్టమ్‌తో లభించనున్నాయి. మరికొద్ది రోజుల్లోనే ఈ కొత్త రిట్జ్ మార్కెట్లోకి రానుంది.
రిట్జ్ కూడా స్విఫ్ట్ హ్యాచ్‌బ్యాక్ మాదిరిగానే మారుతి సుజుకి ఇండియాకు బెస్ట్ సెల్లింగ్ మోడల్ అని చెప్పవచ్చు. మొదటి తరం రిట్జ్ హ్యాచ్‌బ్యాక్‌ను 2009లో మారుతి సుజుకి విడుదల చేసింది. ఇప్పటి వరకూ మారుతి సుజుకి రెండు లక్షలకు పైగా స్విఫ్ట్ కార్లను విక్రయించింది. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని రిట్జ్‌లో అప్‌గ్రేడెడ్ వేరియంట్‌ను మారుతి సుజుకి విడుదల చేయాలని భావిస్తుంది. ఈ కారు ఇండియాలోకి వచ్చే లోపుగా, కొత్త రిట్జ్‌పై ఓ లుక్కేయండి మరి..!!


Click it and Unblock the Notifications









