మారుతి సుజుకి కొత్త రిట్జ్ గురించి మరిన్ని వివరాలు లీక్!

అతి త్వరలో మార్కెట్లో ఈ కొత్త మోడల్‌కు సంబంధించిన రహస్య చిత్రాలు ఇంటర్నెట్‌లో హల్ చల్ చేస్తున్నాయి. ఈ చిత్రాలను బట్టి పాత రిట్జ్‌కు కొత్త రిట్జ్‌కు ఉన్న కొన్ని వ్యత్యాసాలను ఇక్కడ మనం గమనించవచ్చు. 2012 వెర్షన్ రిట్జ్‌లో రీడిజైన్ చేయబడిన ఫ్రంట్ గ్రిల్, సరికొత్త డిజైన్‌తో కూడిన ఫ్రంట్ ఫాగ్‌ల్యాంప్స్, రివైజ్ చేసిన బానెట్ డిజైన్, ఫ్రంట్ హెడ్‌లైట్స్‌లో కొద్దిపాటి మార్పులను ఈ ఫోటో ద్వారా గుర్తించవచ్చు.
మారుతి సుజికి కొత్త స్విఫ్ట్‌లో ఆఫర్ చేసిన వివిటిఐ టెక్నాలజీతో కూడిన కె సిరీస్ పెట్రోల్ ఇంజన్‌నే కొత్త రిట్జ్‌లో కూడా అందించనుంది. ఇది 87 పిఎస్‌ల శక్తిని, 114 ఎన్ఎమ్‌ల టార్క్‌ను విడుదల చేస్తుంది. 2012 రిట్జ్ ప్రస్తుతం లభిస్తున్న రిట్జ్ కన్నా మెరుగైన మైలేజీని (19 కెఎమ్‌పిఎల్) ఇవ్వనుంది.
ఇకపోతే 2012 రిట్జ్ డీజిల్ వేరియంట్‍లో రీట్యూన్ చేయబడిన1.3 లీటర్ ఫియట్ మల్టీజెట్ డిడిఐఎస్ ఇంజన్‌ను ఉపయోగించనున్నారు. ఇది 75 పిఎస్‌ల శక్తిని, 190 ఎన్ఎమ్‌ల టార్క్‌ను విడుదల చేస్తుంది. డీజిల్ వేరియంట్ రిట్జ్ లీటరుకు సుమారు 23 కిలోమీటర్ల మైలేజీని ఇవ్వొచ్చని అంచనా. డీజిల్ వేరియంట్ రిట్జ్‌కు సంబంధించి ఎప్పటికప్పుడు తాజా సమాచారం కోసం డ్రైవ్ స్పార్క్‌ను గమనిస్తూనే ఉండండి.


Click it and Unblock the Notifications








