హ్యుందాయ్ ఐ-జెన్ ఐ20 వేరియంట్లు, మైలేజ్, ధరలు
ఇది వరకు చెప్పుకున్నట్లుగానే 2012 హ్యుందాయ్ ఐ-జెన్ ఐ20 హ్యాచ్‌బ్యాక్ 12 వేరియంట్లలో లభ్యమవుతుంది. ఇందులో ఐదు డీజిల్ వేరియంట్లు, ఏడు పెట్రోల్ వేరియంట్లలో లభ్యమవుతాయి. కొత్త ఐ20 మూడు విభిన్నమైన ఇంజన్లు (1.2 లీటర్ పెట్రోల్, 1.4 లీటర్ పెట్రోల్, 1.4 లీటర్ డీజిల్), రెండు ఫ్యూయెల్ ఆప్షన్ (పెట్రోల్, డీజిల్), మూడు ట్రాన్సిమిషన్ ఆప్షన్ (5-స్పీడ్, 6-స్పీడ్, ఆటోమేటిక్) లతో లభిస్తుంది.
2012 వెర్షన్ ఐ-జెన్ ఐ20 హ్యాచ్‌బ్యాక్‌లో డ్యూయెల్ విటివిటి (వేరియబుల్ వాల్వ్ టైమింగ్) టెక్నాలజీతో కూడిన రీఫైన్ చేయబడిన శక్తివంతమైన 1.2 లీటర్ కప్పా పెట్రోల్ ఇంజన్‌ను ఉపయోగించారు. పాత వేరియంట్‌లో ఉపయోగించిన 1.2 లీటర్ ఇంజన్‌ను రీట్యూన్ చేసి శక్తిని (పవర్)ను 80 పిఎస్‌ల నుండి 84 పిఎస్‌లకు పెంచడం జరిగింది. ఇది లీటరు పెట్రోల్‌కు 18.5 కి.మీ. మైలేజీనిస్తుందని కంపెనీ పేర్కొంది.
ఇకపోతే.. మిగిలిన రెండు ఇంజన్లలో (1.4 లీటర్ పెట్రోల్, 1.4 లీటర్ డీజిల్) వేరియంట్లలో ఎలాంటి మార్పులు లేవు. హై-టెక్ 1.4 యూ2 సిఆర్‌డిఐ డీజిల్ ఇంజన్‌తో 6-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్ సిస్టమ్ లభిస్తుంది. ఇది గరిష్టంగా 90 బిహెచ్‌పిల శక్తిని, 22.4 కెజిఎమ్‌ల టార్క్‌ను విడుదల చేస్తుంది. ఏఆర్ఏఐ సర్టిఫై చేసిన దాని ప్రకారం ఇది లీటరు డీజిల్‌కు 21.9 కి.మీ. మైలేజీని ఇస్తుంది.
ఇక ఆటోమేటిక్ వేరియంట్లో లభ్యం కానున్న హ్యుందాయ్ ఐ-జెన్ ఐ20లో 1.4 లీటర్ గమ్మా పెట్రోల్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఇది 100 పిఎస్‌ల గరిష్ట శక్తిని, 13.9 కెజిఎమ్‌ల టార్క్‌ను విడుదల చేస్తుంది. ఆటోమోటివ్ రీసెర్చ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ఏఆర్ఏఐ) సర్టిఫై చేసిన దాని ప్రకారం, ఆటోమేటిక్ వేరియంట్ ఐ20 లీటరు పెట్రోల్‌కు 15 కి.మీ. మైలేజీనిస్తుందని హ్యుందాయ్ తెలిపింది.
హ్యుందాయ్ ఐ-జెన్ ఐ20 వేరియంట్లు ధరల వివరాలు ఈ క్రింది విధంగా ఉన్నాయి.
పెట్రోల్ వేరియంట్ హ్యుందాయ్ ఐ-జెన్ ఐ20 ధరలు:
* ఎరా - రూ.4,73,400
* మాగ్నా - రూ.4,97,310
* మాగ్నా (ఆప్షనల్) - రూ.5,27,278
* స్పోర్ట్జ్ - రూ.5,75,247
* ఆస్టా - రూ.6,21,082
* ఆస్టా (ఆప్షనల్) సన్‌రూఫ్‌తో - రూ.6,65,894
* స్పోర్ట్జ్ (ఆటోమేటిక్) - రూ.7,67,405
డీజిల్ వేరియంట్ హ్యుందాయ్ ఐ-జెన్ ఐ20 ధరలు:
* ఎరా - రూ.5,96,334
* మాగ్నా - రూ.6,20,243
* మాగ్నా (ఆప్షనల్) - రూ.6,50,213
* స్పోర్ట్జ్ - రూ.6,98,183
* ఆస్టా - రూ.744,013


Click it and Unblock the Notifications








