హ్యుందాయ్ ఐ-జెన్ ఐ20 హ్యాచ్‌బ్యాక్ కంఫర్ట్, సేఫ్టీ ఫీచర్లు
అంతే కాకుండా ఇందులో...
* పుష్ బటన్ స్టార్ట్‌తో కూడిన స్మార్ట్ కీ
* వన్ టచ్ ట్రిపుల్ టర్న్ సిగ్నల్
* లెథర్‌తో కప్పబడిన స్టీరింగ్ వీల్, గేర్ షిఫ్ట్ నాబ్
* డ్రైవర్ సీట్ ఆర్మ్ రెస్ట్
* యాంత్రికంగా సర్దుబాటు చేసుకునే సైడ్ మిర్రర్స్ (ఎలక్ట్రిక్ అడ్జస్టబిల్ రియర్ వ్యూ మిర్రర్స్)
* టిల్ట్, టెలిస్కోపిక్ స్టీరింగ్
* లగేజ్ స్థలం కోసం వెనుకవైపు మడిచిపెట్టేందుకు వీలుగా డిజైన్ చేసి సీట్ (60:40 స్ప్లిట్ సీట్)
* 4 స్పీకర్లు, 2 ట్వీటర్లతో కూడిన ప్రీమియం 2-డిన్ సిడి, ఎమ్‌పి3 ఆడియో సిస్టమ్
* మ్యూజిక్ సిస్టమ్‌కు యూఎస్‌బి, ఆక్స్-ఇన్, బ్లూటూత్ కనెక్టివిటీ
* స్టీరింగ్‌పై అమర్చబడిన ఆడియో, బ్లూటూత్ కంట్రోల్స్
* మంచి స్టయిలిష్ లుక్‌నిచ్చే ఫ్రంట్ గ్రిల్
* 8-స్పోక్ స్పోర్టీ అల్లాయ్ వీల్స్
* స్టాంప్ ల్యాంప్‌తో కూడిన రియర్ స్పాయిలర్
* క్రోమ్ కోటింగ్ కలిగిన డోర్ హ్యాండిల్స్
* అవుట్ సైడ్ మిర్రర్లపై టర్న్ ఇండికేటర్స్
Hyundai i-Gen i20 Photo Gallery:
సేఫ్టీ విషయంలో సరికొత్త ఐ-జెన్ ఐ20 అత్యాధునిక సాంకేతి పరిజ్ఞానంతో అత్యంత సురక్షితను అందిచనుంది. ఇందులో..
- ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు
- ఏబిఎస్ (యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్)
- ప్రమాదవశాత్తూ ఇంజన్ స్టార్ట్ కావడాన్ని అడ్డుకునే "క్లచ్ లాక్ సిస్టమ్"
- కంగారులో అకస్మాత్తుగా బ్రేక్ పెడల్, యాక్సిలరేటర్ పెడల్ రెండింటినీ ఒకేసారి నొక్కినప్పుడు దానిని సెన్సార్‌లు గుర్తించి కారు వేగాన్ని తగ్గించేలా ఏర్పాటు చేసిన "స్మార్ట్ పెడల్ సిస్టమ్" టెక్నాలజీ
- కారు వేగాన్ని గుర్తించి ఆటోమేటిక్‌గా డోర్లు లాక్ అయ్యేలా ఏర్పాటు చేసిన స్పీడ్ సెన్సెంగ్ ఆటో డోర్ లాకింగ్ టెక్నాలజీ
- ఒకవేళ దురదృష్టవశాత్తు ప్రమాదం జరిగినట్లయితే డోర్లు అన్‌లాక్ (ఓపెన్) అయ్యేలా ఏర్పాటు చేసిన ఇంపాక్ట్ సెన్సింగ్ ఆటో డోర్ అన్‌లాకింగ్ టెక్నాలజీ
- రివర్స్ పార్కింగ్ సెన్సార్స్


Click it and Unblock the Notifications








