6,500లకు పైగా ప్రీబుకింగ్‌లను సొంతం చేసుకున్న కొత్త ఆల్టో 800
దేశపు అగ్రగామి ప్యాసింజర్ కార్ల తయారీ కంపెనీ మారుతి సుజుకి ఇండియా (ఎమ్ఎస్ఐ) నుండి ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిన్న కారు కొత్త ఆల్టో 800 విడులకు ముందే రికార్డుల మీద రికార్డులు సృష్టిస్తోంది. ఈ బుజ్జి కారు కోసం ఇప్పటికే 6,500 బుకింగ్‌లు వచ్చి పడ్డాయి. విడుదల సమయం నాటికి ఈ సంఖ్య 10,000 లను మించవచ్చని అంచనా. కాగా.. ఇప్పటికే మారుతి సుజుకి ఆల్టో 800 కోసం కంపనీ రూపొందించిన మైక్రో వెబ్‌సైట్‌ను 3 లక్షలకు పైగా నెటిజన్లు వీక్షించారు.
ఎంట్రీ లెవల్ స్మాల్ కార్ సెగ్మెంట్లో హాట్ ట్రెండ్‌గా మారిన కొత్త మారుతి సుజుకి ఆల్టో 800 కారు ఈనెల 16న మార్కెట్లో విడుదల కానున్న సంగతి తెలిసిందే. ఈ కొత్త మారుతి సుజుకి ఆల్టో 800 కారులో ఇదివరకటి వెర్షన్‌లో ఉపయోగించిన 800సీసీ ఇంజన్ కన్నా మెరుగైన ఇంజన్‌ను అమర్చారు. ఇది ఉత్తమ పెర్ఫామెన్స్‌ను ఆఫర్ చేయడమే కాకుండా మెరుగైన మైలేజ్‌ను కూడా ఆఫర్ చేయనుంది. ఏఆర్ఏఐ సర్టిఫై చేసిన దాని ప్రకారం కొత్త ఆల్టో 800 లీటరు పెట్రోల్‌కు 22.74 కిలోమీటర్ల మైలేజీని ఆఫర్ చేస్తుంది. పాత వెర్షన్‌తో పోల్చుకుంటే ఈ మైలేజ్ 15 శాతం ఎక్కువ.
కొత్త మారుతి సుజుకి ఆల్టో 800లో 796సీసీ, 3-సిలిండర్, 12-వాల్వ్ పెట్రోల్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఇది 6000 ఆర్‌పిఎమ్ వద్ద 47.5 బిహెచ్‌పిల గరిష్ట శక్తిని, 3500 ఆర్‌పిఎమ్ వద్ద 69 ఎన్ఎమ్‌ల గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది 5-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్ సిస్టమ్‌తో లభిస్తుంది. కొత్త ఆల్టో 800 తొలుత పెట్రోల్ వెర్షన్‌లో విడుదల కానుంది. అనంతరం ఇందులో ఎల్‌పిజి, సిఎన్‌జి వెర్షన్లు కూడా అందుబాటులోకి రావచ్చని సమాచారం.
సరికొత్త షార్ప్ హెడ్‌ల్యాంప్స్, చిన్నపాటి క్రోమ్ గ్రిల్, పెద్ద ఎయిర్ డ్యామ్, హై గ్రౌండ్ క్లియరెన్స్, షార్ప్ డిజైన్ కర్వ్స్, రిఫ్రెష్డ్ రియర్ బంపర్, హైమౌంట్ స్టాప్ లైట్, క్లియర్ లెన్స్ టెయిల్ ల్యాంప్స్ విత్ పార్కింగ్ ల్యాంప్స్, పెద్ద ఆల్టో 800 బ్రాండింగ్ వంటి ఎక్స్టీరియర్ ఫీచర్లు, విశాలమైన ఇంటీరియర్స్, సౌకర్యవంతమైన సీటింగ్, డ్యూయెల్ టోన్ 3-స్పోక్ స్టీరింగ్ వీల్, లెథర్‌తో కప్పబడిన గేర్ నాబ్, పెద్ద ఏసి వెంట్స్, డిజిటల్-అనలాగ్ మీటర్ కన్సోల్, నాణ్యమైన ప్లాస్టిక్స్‌తో చేయబడిన డ్యాష్‌బోర్డ్, పవర్ విండోస్, టాప్-ఎండ్ వేరియంట్‌లో ఎయిర్‌బ్యాగ్స్ వంటి ఇంటీరియర్ ఫీచర్లు కొత్త ఆల్టో 800 సొంతం.


Click it and Unblock the Notifications









