కొత్త మారుతి సుజుకి ఆల్టో 800 అధికారిక ఫోటోలు విడుదల

By Ravi

ఇప్పుడు చిన్న కార్ ప్రియులంతా ఎంతో ఆసక్తిగా చర్చించుకుంటున్నది మరికొద్ది రోజుల్లో మార్కెట్లోకి రానున్న సరికొత్త మారుతి సుజుకి ఆల్టో 800 కారు గురించే. ఈ సెగ్మెంట్లో సునామీ సృష్టించేందుకు సరికొత్త డిజైన్, మెరుగైన్ మెలైజ్, ఆకర్షనీయమైన లుక్‌తో కొత్త ఆల్టో 800 వచ్చే మంగళవారం మార్కెట్లోకి రానున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కొత్త మారుతి సుజుకి ఆల్టో 800 అధికారిక ఫోటోలను కంపెనీ విడుదల చేసింది. దీంతో ఈ కారు ఎలా ఉంటుందా అన్న సందేహాలకు చెక్ పెట్టినట్లయింది. ఇదిగో.. ఈ కొత్త ఆల్టో 800 అఫీషియల్ ఫోటోలో ప్రత్యేకించి మా తెలుగు డ్రైవ్ స్పార్క్ పాఠకుల కోసం.. చూసి ఆనందించండి..!

మారుతి సుజుకి ఆల్టో 800 - ఫ్రంట్ ప్రొఫైల్

మారుతి సుజుకి ఆల్టో 800 - ఫ్రంట్ ప్రొఫైల్

సరికొత్త మారుతి సుజుకి ఆల్టో 800 చిన్న కారు ఫ్రంట్ డిజైన్‌ను గమనిస్తే, సరికొత్త షార్ప్ హెడ్‌‌ల్యాంప్స్, చిన్నపాటి క్రోమ్ గ్రిల్, పెద్ద ఎయిర్ డ్యామ్, హై గ్రౌండ్ క్లియరెన్స్, షార్ప్ డిజైన్ కర్వ్స్ వంటి ఫీచర్లు దర్శనమిస్తాయి.

మారుతి సుజుకి ఆల్టో 800 - సైడ్ ప్రొఫైల్

మారుతి సుజుకి ఆల్టో 800 - సైడ్ ప్రొఫైల్

కొత్త ఆల్టో 800 కారును సైడ్ ప్రొఫైల్‌ను గమనించినట్లయితే, దీని హెడ్‌రూమ్ ఇదివరకటి ఆల్టో, 800 కార్ల కన్నా కాస్తంత పెంచినట్లుగా తెలుస్తోంది. ఇది 3395 మి.మీ. పొడవును, 1490 మి.మీ. వెడల్పును, 1475 మి.మీ. ఎత్తును, 2360 మి.మీ. వీల్‌బేస్‌ను, 160 మి.మీ. గ్రౌండ్ క్లియరెన్స్‌ను కలిగి ఉండి 720 కేజీల బరువును కలిగి ఉంటుంది.

మారుతి సుజుకి ఆల్టో 800 - రియర్ ప్రొఫైల్

మారుతి సుజుకి ఆల్టో 800 - రియర్ ప్రొఫైల్

సరికొత్త మారుతి సుజుకి ఆల్టో 800లో రిఫ్రెష్డ్ డిజైన్‌తో కూడిన రియర్ బంపర్, హైమౌంట్ స్టాప్ లైట్, క్లియర్ లెన్స్ టెయిల్ ల్యాంప్స్ విత్ పార్కింగ్ ల్యాంప్స్, పెద్ద ఆల్టో 800 బ్రాండింగ్ వంటి ఫీచర్లను గమనించవచ్చు.

మారుతి సుజుకి ఆల్టో 800 - ఇంటీరియర్స్

మారుతి సుజుకి ఆల్టో 800 - ఇంటీరియర్స్

కొత్త ఆల్టో 800 కారులో విశాలమైన ఇంటీరియర్స్, సౌకర్యవంతమైన సీటింగ్, డ్యూయెల్ టోన్ 3-స్పోక్ స్టీరింగ్ వీల్, లెథర్‌తో కప్పబడిన గేర్ నాబ్, పెద్ద ఏసి వెంట్స్, డిజిటల్-అనలాగ్ మీటర్ కన్సోల్, నాణ్యమైన ప్లాస్టిక్స్‌తో చేయబడిన డ్యాష్‌బోర్డ్, పవర్ విండోస్, టాప్-ఎండ్ వేరియంట్‌లో ఎయిర్‌బ్యాగ్స్ వంటి ఫీచర్లు ఉండనున్నాయి.

మారుతి సుజుకి ఆల్టో 800 - ఇంజన్

మారుతి సుజుకి ఆల్టో 800 - ఇంజన్

కొత్త మారుతి సుజుకి ఆల్టో 800లో 796సీసీ, 3-సిలిండర్, 12-వాల్వ్ పెట్రోల్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఇది 6000 ఆర్‌పిఎమ్ వద్ద 47.5 బిహెచ్‌పిల గరిష్ట శక్తిని, 3500 ఆర్‌పిఎమ్ వద్ద 69 ఎన్ఎమ్‌ల గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది 5-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్ సిస్టమ్‌తో లభిస్తుంది.

మారుతి సుజుకి ఆల్టో 800 - మైలేజ్

మారుతి సుజుకి ఆల్టో 800 - మైలేజ్

కొత్త ఆల్టో 800 కారు ఏఆర్ఏఐ సర్టిఫై చేసిన దాని ప్రకారం లీటరు పెట్రోల్‌కు 22.74 కిలోమీటర్ల మైలేజీని ఆఫర్ చేస్తుంది.

మారుతి సుజుకి ఆల్టో 800 - బూట్ స్పేస్

మారుతి సుజుకి ఆల్టో 800 - బూట్ స్పేస్

కొత్త ఆల్టో 800 హ్యాచ్‌‌బ్యాక్ విశాలమైన బూట్ స్పేస్‌ను కలిగి ఉండి ఎల్‌పిజి/సిఎన్‌జి కిట్‌ను అమర్చుకునేంత స్థలాన్ని కలిగి ఉంటుంది. దీని ఫ్యూయెల్ ట్యాంక్ సామర్ధ్యం 35 లీటర్లుగా ఉంటుంది.


దేశపు అగ్రగామి ప్యాసింజర్ కార్ల తయారీ కంపెనీ మారుతి సుజుకి సుజుకి ఇండియా ఎంట్రీ లెవల్ స్మాల్ కార్ సెగ్మెంట్లో ఓ సరికొత్త 800సీసీ కారును అభివృద్ధి చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుత కాలుష్య నిబంధనల దృష్ట్యా పలు మెట్రో నగరాలకు దూరమైన ఎమ్800 కారు స్థానాన్ని భర్తీ చేస్తూ మార్కెట్లోకి వస్తున్న ఈ కొత్త మారుతి ఆల్టో 800 కారు, ఇది వరకటి 800సీసీ కన్నా మెరుగైన్ పెర్ఫామెన్స్‌ను కలిగి ఉండటమే కాకుండా మంచి మైలేజ్‌ను కూడా ఆఫర్ చేయనుంది. ఏఆర్ఏఐ సర్టిఫై చేసిన దాని ప్రకారం ఇది లీటరు పెట్రోల్‌కు 22.74 కిలోమీటర్ల మైలేజీని ఆఫర్ చేస్తుంది.

కొత్త ఆల్టో 800 కారు కోసం మారుతి సుజుకి ఇప్పటికే బుకింగ్‌లను కూడా అంగీకరిస్తోంది. కేవలం రూ.5,000ల బుకింగ్ అడ్వాన్సును స్వీకరించే కంపెనీ డీలర్లు ఈ కొత్త కారును బుక్ చేస్తున్నారు. కొత్త మారుతి సుజుకి ఆల్టో 800లో 796సీసీ, 3-సిలిండర్, 12-వాల్వ్ పెట్రోల్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఇది 6000 ఆర్‌పిఎమ్ వద్ద 47.5 బిహెచ్‌పిల గరిష్ట శక్తిని, 3500 ఆర్‌పిఎమ్ వద్ద 69 ఎన్ఎమ్‌ల గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది 5-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్ సిస్టమ్‌తో లభిస్తుంది. కొత్త ఆల్టో 800 తొలుత పెట్రోల్ వెర్షన్‌లో విడుదల కానుంది. అనంతరం ఇందులో ఎల్‌పిజి, సిఎన్‌జి వెర్షన్లు కూడా అందుబాటులోకి రావచ్చని సమాచారం.

More from DriveSpark

Article Published On: Wednesday, October 10, 2012, 18:39 [IST]
English summary
Maruti Suzuki will launch its latest small car, the Alto 800 ion 16th October. While many of us are waiting with bated breath to find out how exactly the car will look. Here are the on official images of the new Alto 800.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+