గాలితో నడిచే కారును విజయవంతంగా టెస్ట్ చేసిన టాటా

ప్రపంచంలోనే అత్యంత చవక ధరకే కారును సృష్టించడమే కాకుండా, దానిని విజయవంతంగా మార్కెట్లోకి తీసుకువచ్చిన టాటా మోటార్స్ గాలితో నడిచే కారును అభివృద్ధి చేస్తున్నట్లు తెలుగు డ్రైవ్ స్పార్క్ గతంలో ఓ కథనంలో ప్రచురించిన సంగతి తెలిసిందే. టాటా మోటార్స్ అభివృద్ధి చేసిన ఈ గాలితో నడిచే కారును ప్రయోగాత్మకంగా టెస్టింగ్ చేశామని కంపెనీ ఓ ప్రకటనలో పేర్కొంది.

మోటార్ డెవలప్‌మెంట్ ఇంటర్నేషనల్ (లక్సెంబర్గ్) నుండి టాటా మోటార్స్ లైసెన్స్ పొంది అభివృద్ధి చేస్తున్న ఎయిర్-పవర్డ్ కారు అభివృద్ధిలో ఇది మొదటి దశ. 2007లో ఈ రెండు కంపెనీలు ఓ ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. ఈ ఒప్పందంలో భాగంగా, ఎమ్‌డిఐ టెక్నాలజీని ఉపయోగించి కంప్రెస్డ్-ఎయిర్ ద్వారా నడిచే కార్లను టాటా మోటార్స్ ఉత్పత్తి చేసి, ఇండియన్ మార్కెట్లో విక్రయిస్తుంది.


ఈ ఎయిర్-పవర్డ్ కార్ రెండవ దశలో భాగంగా, రెండు కంపెనీలు కలిసి ఈ అభివృద్ధిని పూర్తి చేసి, ప్రొడక్షన్‌కు సిద్ధంగా ఉండే కారును తయారు చేయనున్నాయి. ఈ టెక్నాలజీని ఇటు ప్యాసింజర్, అటు కమర్షియల్ వాహనాల్లో ఉపయోగించుకోవచ్చని కంపెనీ చెబుతోంది.

టాటా మోటార్స్ ఇప్పటికే నీటితో నడిచే ఓ కారును కూడా అభివృద్ధి చేయడంలో బిజీగా ఉంది. టాటా మోటార్స్ అభివృద్ధి చేసిన ఈ ఎయిర్-పవర్డ్ కారులో ఓ ఎయిర్‌ ట్యాంక్ అమర్చబడి ఉంటుంది. ఒక పూర్తి ఎయిర్‌ట్యాంక్‌తో సుమారు 300 కి.మీ. ప్రయాణించవచ్చు. తక్కువు బరువుండేలా ఈ కారును డిజైన్ చేయటం వలన ఎక్కువ దూరం ప్రయాణించేదుకు వీలవుతుంది.

Article Published On: Monday, May 7, 2012, 20:05 [IST]
English summary
Tata Motors has developed a car that car run on compressed air. Company says it has successfully completed tests with the compressed air engine concept.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+