డాట్సన్ గో ప్లస్ ఎమ్‌పివి ఆవిష్కరణ; 2014లో విడుదల

By Ravi

నిస్సాన్‌కు చెందిన పురాతన ఆటోమొబైల్ బ్రాండ్ డాట్సన్ (Datsun), సెప్టెంబర్ 17, 2013న ఇండోనేషియాలో ఓ సరికొత్త కారును ఆవిష్కరించనున్నట్లు తెలుగు డ్రైవ్‌స్పార్క్ ఇదివరకటి కథనంలో ప్రచురించిన సంగతి తెలిసినదే. కాగా.. డాట్సన్ నిన్న (సెప్టెంబర్ 17, 2013) ఇండోనేషియా రాజధాని జకార్తాలో తమ గో (GO) హ్యాచ్‌బ్యాక్ ప్లాట్‌ఫామ్ ఆధారంగా చేసుకొని అభివృద్ధి 'గో+' (GO+) (గో ప్లస్ అని పలకాలి) అనే ఎమ్‌పివిని ఆవిష్కరించింది.

డాట్సన్ గో+ ఎమ్‌పివి, గో హ్యాచ్‌బ్యాక్ విడుదల తర్వాత మార్కెట్లోకి రానుంది. అంటే 2014లో ఇది వాణిజ్య పరంగా అందుబాటులోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ ఎమ్‌పివి నాలుగు మీటర్ల కన్నా తక్కువ పొడవును కలిగి ఉంటుంది. అంటే, దీనిని ప్రత్యేకించి భారతదేశం కోసం కూడా అభివృద్ధి చేసినట్లు తెలుస్తోంది.

గో హ్యాచ్‌బ్యాక్ వీల్‌బేస్ ఎంత ఉంటుందో (2450 మి.మీ.) గో ప్లస్ ఎమ్‌పివి వీల్‌బేస్ కూడా అంతే ఉంటుంది. ఉత్పత్తి వ్యయాన్ని భారీగా తగ్గించుకొని, సరసమైన ధరకే వీటిని అందించాలనే ఉద్దేశ్యంతో డాట్సన్ తమ ఎమ్‌పివి కోసం హ్యాచ్‌బ్యాక్ ప్లాట్‌ఫామ్‌ను యధావిధిగా ఉపయోగించుకుంది. డాట్సన్ గో ప్లస్ ఒక సెవన్ సీటర్ ఎమ్‌పివి, దీనికి సంబంధించిన మరింత సమాచారాన్ని క్రింద ఫొటో ఫీచర్‌లో పరిశీలిద్దాం రండి.

కొలతలు

కొలతలు

డాట్సన్ గో ప్లస్ ఎమ్‌పివి మొత్తం 3995 మి.మీ. పొడవును, 1635 మి.మీ. వెడల్పును, 1485 మి.మీ. ఎత్తును కలిగి ఉంటుంది.

ఇంజన్

ఇంజన్

డాట్సన్ గో హ్యాచ్‌బ్యాక్, నిస్సాన్ మైక్రా కార్లలో ఉపయోగిస్తున్న అదే 1.2 లీటర్ పెట్రోల్ ఇంజన్‌నే డాట్సన్ గో ప్లస్ ఎమ్‌పివిలోను ఉపయోగించనున్నారు. ఈ ఇంజన్ 5-స్పీడ్ మ్యన్యువల్ గేర్‌బాక్స్‌తో జతచేయబడి ఉంటుంది. డీజిల్ ఇంజన్ గురించి కంపెనీ ఇంకా ఎలాంటి ప్రకటన చేయలేదు.

మొబైల్ డాకింగ్ స్టేషన్

మొబైల్ డాకింగ్ స్టేషన్

డాట్సన్ గో ప్లస్ ఎమ్‌పివి 'మొబైల్ డాకింగ్ స్టేషన్'తో లభిస్తుంది. ఈ ఫొటో దీని ఇంటీరియర్ లుక్‌ను చూడొచ్చు.

7 సీటర్

7 సీటర్

డాట్సన్ గో ప్లస్ ఎమ్‌పివి 7 సీటర్ ఆప్షన్ (2+3+2) (డ్రైవర్‌తో కలిపి)ను కలిగి ఉంటుంది. ముందు వరుస అలాగే మధ్య వరుసలో కూర్చునే ప్రయాణికులకు విశాలమైన లెగ్‌‌రూమ్ ఉంటుంది.

సెంటర్ కన్సోల్ లేదు

సెంటర్ కన్సోల్ లేదు

డాట్సన్ గో ప్లస్ ఎమ్‌పివిలో కూడా హ్యాచ్‌బ్యాక్ వెర్షన్ మాదిరిగానే సెంటర్ కన్సోల్ ఉండదు. గేర్ బాక్సును డ్యాష్‌బోర్డుకే జతచేయబడి ఉంటుంది.

ఖర్చు తగ్గించుకునే చర్య

ఖర్చు తగ్గించుకునే చర్య

డాట్సన్ ఉత్పత్తి వ్యయాన్ని తగ్గించుకునేందుకు గో హ్యాచ్‌బ్యాక్ కారును పెద్దగా మార్పు చేయకుండా, వెనుక వైపు మాత్రమే కాస్తంత స్థలాన్ని పెంచి ఈ ఎమ్‌పివి రూపొందించింది. అందుకే వెనుక డోరు కూడా చిన్నదిగా అనిపిస్తుంది. ఇంత పెద్ద ఎమ్‌పివి అంత చిన్న డోర్ కొంచెం ఇబ్బందిగానే అనిపిస్తుంది.

ఫోల్డబల్ రియర్ సీట్స్

ఫోల్డబల్ రియర్ సీట్స్

డాట్సన్ గో ప్లస్ ఎమ్‌పివి వెనుక రెండు వరుసలలోని సీట్లను పూర్తిగా ముందుకు మడచి, లగేజ్ రూమ్‌ను పెంచుకోవచ్చు.

థర్డ్ రో సీట్స్

థర్డ్ రో సీట్స్

మూడవ వరుసలోని సీట్లు పొట్టిగా ఉండే వారికి లేదా చిన్న పిల్లకు మాత్రమే సరిపోయేలా ఉంటాయి. పొడవుగా ఉన్నవారు కానీ లేదా కొంచెం లావుగా ఉన్న వారు కానీ ఇందులో సౌకర్యంగా కూర్చోలేరు.

ధర

ధర

ఇండోనేషియా మార్కెట్లో 100 మిలియన్ ఇండోనేషియన్ రుపయ్యల కన్నా తక్కువ ధరకే (మన దేశ కరెన్సీలో సుమారు రూ.5.5 లక్షలు) ఈ ఎమ్‌పివి విక్రయిస్తామని డాట్సన్ ప్రకటించింది.

కాంపిటీటర్స్

కాంపిటీటర్స్

డాట్సన్ గో ప్లస్ ఎమ్‌పివి ఈ సెగ్మెంట్లోని మారుతి సుజుకి ఎర్టిగా, చెవర్లే ఎంజాయ్, హోండా నుంచి త్వరలో రానున్న బ్రయో ఆధారిత ఎమ్‌పివి లకు గట్టి పోటీ ఇచ్చే ఆస్కారం ఉంది.

అఫీషియల్ వీడియో

డాట్సన్ గో ఎమ్‌పివి అఫీషియల్ వీడియోని వీక్షించండి.

More from DriveSpark

Article Published On: Wednesday, September 18, 2013, 12:13 [IST]
English summary
Unveiled in Jakarta on Sep 17, 2013 was Datsun's second new model, an MPV. Its simply called the Datsun GO+, a sub-4 meter MPV that will appeal to buyers from Indonesia as well as India. The new MPV along with the GO hatchback will be hit the road next year. Datsun GO+ is a cleverly designed MPV which has savings for the manufacturer written all over it.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+