సెప్టెంబర్ 17న మరొక సరికొత్త కారును ఆవిష్కరించనున్న డాట్సన్
నిస్సాన్‌కు చెందిన పురాతన కార్ బ్రాండ్ డాట్సన్ (Datsun) గడచిన జులై నెలలో భారత్‌ను వేదికగా చేసుకొని తమ తొలి కారు 'గో' హ్యాచ్‌బ్యాక్‌కు (Go) గ్లోబల్ ప్రీమియర్ నిర్వహించిన సంగతి తెలిసినదే. ప్రధానంగా చిన్న కార్లకు ఎక్కువగా అవకాశాలు ఉండే ఏషియా మార్కెట్లను లక్ష్యంగా చేసుకొని డాట్సన్ గో హ్యాచ్‌బ్యాక్ కారును తయారు చేశారు. వచ్చే ఏడాది ఆరంభంలో ఇది మార్కెట్లోకి రానుంది.
ఇదిలా ఉండగా, డాట్సన్ ఈనెల 17న మరొక సరికొత్త కారును ఆవిష్కరించేందుకు సిద్ధమవుతోంది. సెప్టెంబర్ 17, 2013వ తేదీన ఓ సరికొత్త కారును ఆవిష్కరించనున్నట్లు డాట్సన్ ప్రకటించింది. కానీ, ఈసారి డాట్సన్ తమ సరికొత్త కారు ఆవిష్కరించేందుకు ఇండియాకు బదులుగా ఇండోనేషియాను వేదికగా ఎంచుకుంది. అయితే, ఇది భారత మార్కెట్లో ఆవిష్కరించిన డాట్సన్ గో హ్యాచ్‌బ్యాక్ కారో లేక వేరే ఇతర కారో అనేది ఇంకా తెలియరాలేదు.
ఏదేమైనప్పటికి, మార్కెట్ వర్గాల సమాచారం ప్రకారం, డాట్సన్ ఆవిష్కరించనున్న ఈ కొత్త కారును ప్రత్యేకించి ఇండోనేషియన్ మార్కెట్ అభిరుచికి అనుగణంగా ట్యూన్ చేసినట్లు తెలుస్తోంది. ఇండోనేషియా రాజధాని జకార్తాలో ఆవిష్కృతం కానున్న ఈ కొత్త కారు ధర 100 మిలియన్ ఇండోనేషియన్ రుపయ్య (మనదేశ కరెన్సీలో సుమారు 5.95 లక్షలు రూపాయ)ల కన్నా తక్కువగా ఉంటుందని మాత్రం కంపెనీ స్పష్టం చేసింది.
డాట్సన్ ఆవిష్కరించనున్న ఈ కొత్త కారుకు సంబంధించిన మరిన్ని వివరాలు సెప్టెంబర్ 17, 2013న వెల్లడి కానున్నాయి. లేటెస్ట్ అప్‌డేట్స్ కోసం తెలుగు డ్రైవ్‌స్పార్క్‌ను గమనిస్తూనే ఉండండి.


Click it and Unblock the Notifications









