బెంగుళూరులో ఫియట్ పుంటో ఇవో విడుదల; ధరలు

By Ravi

ఫియట్ ఇండియా ఇటీవలే న్యూఢిల్లో విడుదల చేసిన'ఫియట్ పుంటో ఇవో' (Fiat Punto Evo) ప్రీమియం హ్యాచ్‌బ్యాక్‌ను కంపెనీ నేడు (ఆగస్ట్ 8, 2014) బెంగుళూరు మార్కెట్లో కూడా విడుదల చేసింది. రాష్ట్ర విపణిలో దీని ప్రారంభ ధర రూ.4.65 లక్షలు (ఎక్స్-షోరూమ్, బెంగుళూరు)గా ఉంది. కస్టమర్ల అవసరాలకు దృష్టిలో ఉంచుకుని, భారతీయ మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగా ఈ కారును డిజైన్ చేశామని ఫియట్ ఇండియా అధ్యక్షుడు, ఎండీ నాగేశ్ బసవన్ హల్లీ తెలిపారు.

ఇది కూడా చదవండి: ఫియట్ పుంటో ఇవో టెస్ట్ డ్రైవ్ రివ్యూ

పుంటో ఇవో ఈ సెగ్మెంట్లో కెల్లా తొలిసారిగా రియర్ ఏసి వెంట్స్, ప్రీమియం సాఫ్ట్ టచ్ టూ టోన్ డ్యాష్, యాంబీంట్ లైట్, ఆటో డౌన్ పవర్ విండో (నాలుగు డోర్లకు), డ్యూయెల్ స్టేజ్ డ్రైవర్ సైడ్ ఎయిర్‌బ్యాగ్, స్మార్ట్ వైపర్స్, 16 ఇంచ్ అల్లాయ్ వీల్స్ వంటి విశిష్టమైన ఫీచర్లతో లభిస్తుంది. ఈ కారుపై కంపెనీ మూడేళ్ల రెగ్యులర్ వారంటీని మరియు మరో రెండేళ్ల అదనపు వారంటీని ఆఫర్ చేస్తోంది.


పటిష్టమైన బిల్డ్ క్వాలిటీ, మెరుగైన డ్రైవింగ్ డైనమిక్స్, మరింత సౌకర్యవంతమైన సీట్స్, బెస్ట్-ఇన్ క్లాస్ గ్రౌండ్ క్లియరెన్స్, అత్యుతన్న భద్రతా ప్రమాణాలతో తయారు చేయబడిన ఫియట్ పుంటో ఇవో అవుట్‌స్టాండింగ్ డ్రైవింగ్ ఎక్స్‌పీరియెన్స్‌ను ఆఫర్ చేస్తుందని కంపెనీ పేర్కొంది. ఇది మొత్తం ఏడు వేరియంట్లలో ఏడు ఆకర్షణీయమైన రంగులలో లభిస్తుంది.

బెంగుళూరు మార్కెట్లో ఫియట్ పుంటో ఇవో ధరలు ఇలా ఉన్నాయి:
* పుంటో ఇవో యాక్టివ్ 1.2లీ పెట్రోల్ - రూ.4.65 లక్షలు
* పుంటో ఇవో డైనమిక్ 1.2లీ పెట్రోల్ - రూ.5.22 లక్షలు
* పుంటో ఇవో ఎమోషన్ 1.4లీ పెట్రోల్ - రూ.6.78 లక్షలు
* పుంటో ఇవో యాక్టివ్ 1.3లీ డీజిల్ - రూ.5.38 లక్షలు
* పుంటో ఇవో డైనమిక్ 1.3లీ డీజిల్ - రూ.6.33 లక్షలు
* పుంటో ఇవో ఎమోషన్ 1.3లీ డీజిల్ - రూ.6.96 లక్షలు
* పుంటో ఇవో స్పోర్ట్ 1.3లీ 90 పిఎస్ డీజిల్ - రూ.7.33 లక్షలు
(అన్ని ధరలు ఎక్స్-షోరూమ్, బెంగుళూరు)

More from DriveSpark

Article Published On: Friday, August 8, 2014, 17:51 [IST]
English summary
Fiat India has rolled out the new Punto Evo, a stylish and premium hatchback in Bangalore. The Punto Evo will appeal to the style conscious customers with evolved taste who enjoy life to the fullest. The Punto Evo styling is unique to India. It is a dramatic evolution of the earlier version sporting the design theme of dynamism and harmony. It is designed and engineered for India catering to the needs of today’s customers.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+