ఫియట్ పుంటో ఇవో టెస్ట్ డ్రైవ్ రివ్యూ

By Ravi

ఫియట్ ఇండియా దేశీయ విపణిలో విక్రయిస్తున్న పుంటో హ్యాచ్‌బ్యాక్‌లో ఓ రిఫ్రెష్డ్ వెర్షన్‌ను ఆగస్ట్ నెలలో విడుదల చేయనున్నట్లు తెలుగు డ్రైవ్‌స్పార్క్ ఇదివరకటి కథనంలో ప్రచురించిన సంగతి తెలిసినదే. కాగా.. తాజాగా మేము ఇందులో డీజిల్ వెర్షన్ కారును ముంబైలో టెస్ట్ డ్రైవ్ చేయటం జరిగింది. ఈ కథనంలో అప్‌గ్రేడెడ్ పుంటో హ్యాచ్‌బ్యాక్‌లోని ప్లస్‌లు, మైనస్‌లు తెలుసుకుందాం రండి.

ఇది కూడా చదవండి: 2014 నిస్సాన్ సన్నీ టెస్ట్ డ్రైవ్ రివ్యూ

డీలర్‌షిప్ నెట్‌వర్క్ విషయంలో టాటా మోటార్స్ నుండి విడిపోయిన తర్వాత ఫియట్ భారత్‌లో ఒంటరి ప్రయాణం సాగిస్తూ, స్వతహాగా కొత్త డీలర్‌షిప్ కేంద్రాలను ఏర్పాటు చేసుంటున్న సంగతి తెలిసినదే. ఈ నేపథ్యంలో, ఫియట్ నెట్‌వర్క్‌తో పాటుగానే ప్రోడక్ట్ పోర్ట్‌ఫోలియోని కూడా విస్తరించుకోవాలని చూస్తోంది. ఇందులో భాగంగానే, బోరింగ్ పుంటో స్థానంలో సరికొత్త పుంటో ఇవోను ప్రవేశపెట్టింది.

కొత్త 2014 ఫియట్ పుంటో ఇవో కారును మోడ్రన్‌గా డిజైన్ చేశారు. ఫ్రంట్ డిజైన్ నుంచి రియర్ డిజైన్ వరకు ఈ కొత్త పుంటో ఇవో కారులో అనేక మార్పులు చేర్పులు ఉన్నాయి. అవేంటో తెలుసుకుందాం రండి.

మరింత సమాచారం తర్వాతి సెక్షన్‌లో.. మరిన్ని వివరాలను ఈ ఫొటో ఫీచర్‌లో పరిశీలించండి..!

2014 ఫియట్ పుంటో ఇవో రివ్యూ

తర్వాతి స్లైడ్‌లలో కొత్త 2014 ఫియట్ పుంటో ఇవో టెస్ట్ డ్రైవ్ రివ్యూని పరిశీలించండి.

2014 ఫియట్ పుంటో ఇవో - 90 హెచ్‌పి మోడల్

2014 ఫియట్ పుంటో ఇవో - 90 హెచ్‌పి మోడల్

ఫియట్ ఇండియా మరికొద్ది రోజుల్లోనే (ఆగస్ట్ 2వ వారంలో) ఈ కొత్త 2014 పుంటో ఇవో హ్యాచ్‌బ్యాక్‌ను భారత మార్కెట్లో విడుదల చేయనుంది. ఇది ప్రస్తుతం మార్కెట్లో లభిస్తున్న పుంటో మోడల్‌ను రీప్లేస్ చేయనుంది.

టెస్ట్ చేసిన మోడల్: పుంటో ఇవో, డీజిల్, 90 హెచ్‌పి మోడల్

టెస్ట్ చేసినది: అజింక్యా పారాలికర్

టెస్ట్ చేసిన ప్రాంతం: ముంబై-లూనావాలా, 150 కి.మీ.

ధర: విడుదల సమయంలో తెలుస్తుంది

ఫ్రంట్ డిజైన్

ఫ్రంట్ డిజైన్

కొత్త ఫియట్ పుంటో ఇవో డిజైన్ మరింత సింపుల్‌ ఉంటుంది. ప్రీమియం లుక్ కోసం ఇందులో ఎక్కువ క్రోమ్ గార్నిష్ చేశారు. ఇందులో ఫియట్ లోగోను ఫ్రంట్ గ్రిల్‌‌పై నుంచి బానెట్‌పైకి మార్చారు. ఫ్రంట్ గ్రిల్, ఫాగ్ ల్యాంప్స్ చుట్టూ క్రోమ్ సరౌండింగ్ ఉంటుంది. ముందు వైపు నుంచి స్పోర్టీ లుక్‌నిచ్చేందుకు గాను దీని హెడ్‌లైట్ డిజైన్‌ను మార్చారు.

సైడ్ ప్రొఫైల్

సైడ్ ప్రొఫైల్

సైడ్ నుంచి చూస్తే 2014 ఫియట్ పుంటో ఇవో ఇదివరకటి మోడల్ మాదిరిగానే అనిపిస్తుంది. అయితే, ఇందులో 16-ఇంచ్ అల్లాయ్ వీల్స్, టర్న్ ఇండికేటర్లతో కూడిన సైడ్ మిర్రర్స్, క్రోమ్ డోర్ హ్యాండిల్స్ వంటి ఫీచర్లున్నాయి. దీని డోర్లు చాలా ధృడంగా అనిపిస్తాయి, నాణ్యతను మరియు సేఫ్టీని దృష్టిలో ఉంచుకొని దీనిని తయారు చేశారు.

రియర్ డిజైన్

రియర్ డిజైన్

వెనుక వైపు టెయిల్ ల్యాంప్స్, రియర్ బంపర్‌‌లను రీడిజైన్ చేశారు. మేము టెస్ట్ డ్రైవ్ చేసిన 90 హెచ్‌పి మోడల్‌కు వెనుక వైపు స్పాయిలర్ కూడా ఉంది. దానిపై హైమౌంట్ బ్రేక్ ల్యాంప్ ఉంటుంది. వెనుక బంపర్‌పై నెంబర్ ప్లేట్‌కు దిగువన క్రోమ్ లైన్, రిఫ్లెక్టర్స్‌కు బదులుగా ఏర్పాటు చేసిన అలెర్ట్ లైట్స్ చుట్టూ క్రోమ్ సరౌండింగ్ కొత్తగా అనిపిస్తుంది. ఈ బంపర్ లైట్లలో కుడివైపు లైట్ ఫాగ్ ల్యాంప్ స్విచ్ ఆన్ చేసినప్పుడు వెలుగుతుంది, ఎడమ వైపు లైట్ రివర్స్ గేర్ వేసినప్పుడు ఆన్ అవుతుంది. వెనుక వైపు వైపర్, డిఫాగ్గర్ ఉంటుంది.

ఇంటీరియర్

ఇంటీరియర్

కొత్త 2014 ఫియట్ పుంటో ఇవో ఇంటీరియర్స్ రెండు రంగులలో లభిస్తుంది. ఇందులో మొదటిది ఆల్-బ్లాక్ ఇంటీరియర్, ఇది కేవలం 90 హెచ్‌పి మోడల్‌లో మాత్రమే లభిస్తుంది. ఇతర వేరియంట్లు బ్లాక్ విత్ బీజ్ సాఫ్ట్ టచ్ స్పోర్టీ లుకింగ్ ఇంటీరియర్‌తో లభిస్తాయి. 90 హెచ్‌పి వేరియంట్లో క్లైమేట్ కంట్రోల్, రియర్ ఏసి వెంట్స్, స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో కంట్రోల్స్, బ్లూటూత్ కనెక్టివిటీ వంటి ఫీచర్లు లభిస్తాయి.

ఫ్రంట్ సీట్స్

ఫ్రంట్ సీట్స్

ఇందులోని ఫ్రంట్ సీట్లు మంచి సౌకర్యంగా ఉంటాయి, ఇవి తగినంత లంబార్ సపోర్ట్‌ను ఆఫర్ చేస్తాయి. పొడవుగా ఉండే వారికి కూడా ఇది సౌకర్యంగా ఉంటుంది. అయితే, వెనుక వైపు కుషనింగ్‌ను మాత్రం కొద్దిగా మెరుగుపరచి ఉంటే బాగుండనిపించింది. ఇందులోని ఫ్రంట్ సీట్స్ రేస్ కార్లలోని బకెట్స్ సీట్స్ డిజైన్‌ను తలపిస్తాయి.

వెనుక సీట్స్

వెనుక సీట్స్

వెనుక సీట్స్‌లో ఆర్మ్‌రెస్ట్ లేదు. ఇది 60:40 నిష్పత్తిలో మడుచుకుంటుంది. ఈ కారులో వెనుక సీటులో ముగ్గురు ప్రయాణీకులు సౌకర్యంగా కూర్చోవచ్చు. అయితే, మధ్యలో వ్యక్తికి మాత్రం హెడ్‌రెస్ట్ ఉండదు. వెనుక లెగ్‌రూమ్ అంత విశాలంగా అనిపించకపోయినప్పటికీ, సౌకర్యంగానే ఉంటుంది.

డీజిల్ ఇంజన్

డీజిల్ ఇంజన్

మేము టెస్ట్ డ్రైవ్ చేసిన ఫియట్ పుంటో ఇవో 90 హెచ్‌పి మోడల్‌లో 1.3 లీటర్ మల్టీజెట్ డీజిల్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఈ ఇంజన్ గరిష్టంగా 90 హార్స్‌పవర్‌ల శక్తిని, 209 న్యూటన్ మీటర్ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ 5-స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్‌తో కనెక్ట్ చేయబడి ఉంటుంది. ఏఆర్ఏఐ సర్టిఫై చేసినదాని ప్రకారం, ఈ కారు లీటరుకు 20.5 కి.మీ. మైలేజీనిస్తుంది.

పాత, కొత్త పుంటో కార్లు

పాత, కొత్త పుంటో కార్లు

ఇదిగో కొత్త 2014 ఫియట్ పుంటో ఇవో మరియు పాత ఫియట్ పుంటో కార్లను పక్కపక్కనే చూడండి. ఈ రెండు కార్ల బేసిక్ డిజైన్ ఒకేలా అనిపిస్తుంది. అయితే, ఫ్రంట్ అండ్ రియర్ డిజైన్లలో అనేక కాస్మోటిక్ మార్పులను మనం ఇందులో చూడొచ్చు.

కలర్ ఆప్షన్స్

కలర్ ఆప్షన్స్

కొత్త 2014 ఫియట్ పుంటో ఇవో మొత్త ఏడు ఆకర్షనీయమైన రంగులలో లభిస్తుంది. అవి - ఎగ్జోటిక్ రెడ్, గ్లిట్టెరటి గోల్డ్, హిప్ హాప్ బ్లాక్, మాగ్నెసియో గ్రే, మినిమల్ గ్రే, టస్కాన్ వైన్ మరియు వోకల్ వైట్.

లేటెస్ట్ అప్‌డేట్స్ కోసం తెలుగు డ్రైవ్‌స్పార్క్‌ను గమనిస్తూ ఉండండి.

Most Read Articles

English summary
The 2014 Punto Evo has been radically redesigned giving it more character and charm to impress the Indian buyers. The Evo does not stand for an evolutionary engine, instead it stands for the evolution the vehicle has gone through in the past few years. Continue to our next segment to witness the impact the Fiat Punto Evo had on us.
Story first published: Thursday, July 31, 2014, 13:55 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X