దేశంలో రతన్ టాటాకు ఉన్నంత ఆదరణ పొందిన కారు.. అత్యంత సేఫ్టీ, పైగా బడ్జెట్ ధర.. ఫుల్ డిమాండ్

భారత కార్ల మార్కెట్‌లో మైక్రో SUV సెగ్మెంట్‌కు ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చిన మోడల్‌గా టాటా పంచ్ (Tata Punch) ఇప్పుడు బలమైన స్థానం సంపాదించింది. కాంపాక్ట్ సైజ్, బలమైన నిర్మాణం, మంచి గ్రౌండ్ క్లియరెన్స్, సరసమైన ధర కలిపి ఈ కారును మధ్యతరగతి కుటుంబాల ఫేవరెట్‌గా మార్చాయి. రోజువారీ నగర ప్రయాణాలకు సరిపోవడంతో పాటు, గ్రామీణ రోడ్లపై కూడా సౌకర్యవంతంగా నడిచే సామర్థ్యం ఉండటం పంచ్‌కు ప్రత్యేక ప్లస్ పాయింట్‌గా నిలుస్తోంది. 2026 జనవరి నెలలో పంచ్ మరోసారి తన సత్తా చాటుకుంది. ఆ ఒక్క నెలలోనే మొత్తం 18,748 యూనిట్లు కొనుగోలుదారులకు డెలివరీ చేయబడటం గమనార్హం.

ఇది గత ఏడాది ఇదే కాలంలో 14,559 యూనిట్లు మాత్రమే అమ్ముడవగా, ఈసారి గణనీయమైన పెరుగుదల నమోదైంది. లెక్కల ప్రకారం సంవత్సర ప్రాతిపదికన దాదాపు 28.77 శాతం వృద్ధి సాధించడం ఈ మోడల్‌కు ఉన్న పెరుగుతున్న డిమాండ్‌ను స్పష్టంగా చూపిస్తోంది. ఈ అద్భుతమైన అమ్మకాలతో టాటా పంచ్ గత నెలలో అత్యధికంగా అమ్ముడైన టాప్ 10 కార్ల జాబితాలో మూడో స్థానాన్ని దక్కించుకుంది.

Tata Punch Suv February 2026 India Sales 18748 Units Growth Report

అదే సమయంలో టాటా నెక్సాన్ 19,430 యూనిట్లతో మొదటి స్థానాన్ని కైవసం చేసుకోగా, మారుతి సుజుకి డిజైర్ 19,326 యూనిట్లతో రెండో స్థానంలో నిలిచింది. ఈ జాబితాలో పంచ్ మూడో స్థానంలో నిలవడం, టాటాకు ఇది మరో పెద్ద విజయంగా చెప్పుకోవచ్చు. భద్రత, బలమైన బాడీ స్ట్రక్చర్, SUV లుక్‌ను కోరుకునే వినియోగదారులకు పంచ్ సరైన ఎంపిక. రాబోయే నెలల్లో కూడా ఇది మార్కెట్‌లో తన ప్రభావాన్ని మరింత పెంచుకోవచ్చు.

Tata Punch ప్రస్తుతం భారత మార్కెట్‌లో సరసమైన ధరలో లభిస్తున్న మైక్రో SUVలలో ఒకటిగా గుర్తింపు పొందింది. స్టాండర్డ్ వేరియంట్ ధర రూ. 5.59 లక్షల నుండి రూ. 9.29 లక్షల వరకు (ఎక్స్-షోరూమ్) ఉండటంతో మధ్యతరగతి వినియోగదారులకు ఇది అందుబాటులో ఉన్న మంచి ఎంపికగా నిలుస్తోంది. ఈ మోడల్ స్మార్ట్, ప్యూర్, ప్యూర్ ప్లస్, అడ్వెంచర్, అకంప్లిష్డ్, అకంప్లిష్డ్ ప్లస్ S వంటి పలు వేరియంట్లలో అందుబాటులో ఉంది.

Tata Punch Suv February 2026 India Sales 18748 Units Growth Report

ఇంజిన్ ఎంపికల విషయంలో కూడా పంచ్ విభిన్న ఆప్షన్లు అందిస్తోంది. 1.2-లీటర్ టర్బోచార్జ్డ్ పెట్రోల్, 1.2-లీటర్ నేచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్, 1.2-లీటర్ CNG ఇంజిన్ ఆప్షన్లతో ఇది అందుబాటులో ఉంది. ట్రాన్స్‌మిషన్ పరంగా 5-స్పీడ్ మాన్యువల్, ఆటోమేటిక్, 6-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్ ఆప్షన్లు ఉన్నాయి. మైలేజ్ విషయానికి వస్తే, ఇంజిన్, వేరియంట్ ఆధారంగా సుమారు 19 నుండి 27 కిమీ/లీటర్ వరకు ఇంధన సామర్థ్యం అందిస్తుంది.

ఎలక్ట్రిక్ వాహనాల విభాగంలో కూడా తన సత్తా చాటేందుకు Tata Punch EV ను మార్కెట్లో ప్రవేశపెట్టింది టాటా మోటార్స్. మైక్రో SUV సెగ్మెంట్‌లో ఇప్పటికే మంచి గుర్తింపు పొందిన పంచ్‌కు ఎలక్ట్రిక్ రూపం తీసుకురావడం ద్వారా కంపెనీ EV మార్కెట్‌లో మరింత బలపడాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ ఎలక్ట్రిక్ SUV ధర రూ. 9.69 లక్షల నుండి రూ. 12.59 లక్షల వరకు (ఎక్స్-షోరూమ్) ఉంది.

Tata Punch Suv February 2026 India Sales 18748 Units Growth Report

పంచ్ EV రెండు బ్యాటరీ ప్యాక్ ఎంపికలతో 30 kWh, 40 kWh లభిస్తుంది. పూర్తి ఛార్జ్‌పై సుమారు 365 నుండి 468 కిలోమీటర్ల వరకు రేంజ్ అందిస్తుందని కంపెనీ ప్రకటించింది. ఇంటీరియర్ విషయంలో కూడా పంచ్ EV ఆధునికతను ప్రతిబింబిస్తుంది. 5-సీట్ల లేఅవుట్‌తో సౌకర్యవంతమైన ప్రయాణ అనుభవాన్ని అందిస్తుంది. ఈ కారులో డజన్ల కొద్ది అధునాతన ఫీచర్స్ అందుబాటులో ఉంటాయి.

కారు లోపల 10.2-అంగుళాల సెంట్రల్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, ఆకర్షణీయమైన 2-స్పోక్ స్టీరింగ్ వీల్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, వైర్‌లెస్ ఫోన్ ఛార్జర్, సింగిల్-పేన్ సన్‌రూఫ్ వంటి ఫీచర్లు ఈ SUVకు ప్రీమియం ఫీలింగ్‌ను ఇస్తాయి. భద్రత పరంగా కూడా ఈ ఎలక్ట్రిక్ SUV సమృద్ధిగా ఫీచర్లను అందిస్తుంది. 6 ఎయిర్‌బ్యాగులు, ESP (ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్), హిల్-స్టార్ట్ అసిస్ట్, 360-డిగ్రీ కెమెరా వంటివి రక్షణను మరింత బలపరుస్తాయి.

More from DriveSpark

Article Published On: Tuesday, March 3, 2026, 13:42 [IST]
English summary
Tata punch suv february 2026 india sales 18748 units growth report
Read more on: #tata motors #india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+