ప్రతిరోజూ 635 డెలివరీలు.. రెండు కుటుంబాలను ఒక్కటి చేస్తుంది.. ఇండియాలో బెస్ట్ 7 సీటర్ ఇదే!

దేశంలో ఆటోమొబైల్ మార్కెట్‌ అంటే ముందుగా గుర్తుకు వచ్చేది మారుతి సుజుకి (Maruti Suzuki). బడ్జెట్ ధరలు, మెరుగైన మైలేజ్, తక్కువ మెయింటెనెన్స్ ఖర్చులు ఈ మూడు కారణాల వల్లే మారుతి కార్లు భారతీయ కుటుంబాల్లో ప్రత్యేక స్థానం సంపాదించాయి. చిన్న కార్ల విభాగం నుంచి SUVలు, MPVల వరకు ప్రతి సెగ్మెంట్‌లోనూ తనదైన ముద్ర వేసుకున్న ఈ కంపెనీ, అమ్మకాల పరంగా ఎప్పటికప్పుడు నంబర్ వన్ స్థానాన్ని నిలబెట్టుకుంటోంది. ప్రత్యేకంగా పెద్ద కుటుంబాలకు అనువైన 7-సీటర్ విభాగంలో మారుతి సుజుకి ఫ్లాగ్‌షిప్ మోడల్ ఎర్టిగా (Ertiga) మరోసారి అద్భుతమైన ప్రదర్శన చేసింది. 2026 ఫిబ్రవరి నెలలో ఈ కారు మొత్తం 17,807 యూనిట్లు అమ్ముడవడం విశేషం. అంటే రోజుకు సగటున 635 కార్లు షోరూమ్‌ల నుంచి బయటకు వెళ్లాయి.

ఇది సాధారణ గణాంకం కాదు ప్రతి రోజూ వందలాది కుటుంబాలు దీన్ని తమ ఇంటి తెచ్చుకుంటున్నారు. గత సంవత్సరం ఇదే కాలంతో పోలిస్తే ఈసారి అమ్మకాలు గణనీయంగా పెరిగాయి. 2025 ఫిబ్రవరిలో 14,868 యూనిట్లు అమ్ముడవగా, ఈ ఏడాది దాదాపు 3 వేల యూనిట్లకు పైగా పెరుగుదల నమోదైంది. ఈ వృద్ధి ఒక సాధారణ సంఖ్య కాదు; వినియోగదారుల విశ్వాసం, బ్రాండ్‌పై ఉన్న నమ్మకం, ఈ కారు స్పష్టంగా చూపిస్తోంది.

Maruti Suzuki Ertiga February 2026 Sales Recorded 17807 More Details Inside

ఈ 7-సీటర్ కారు పెద్ద కుటుంబాలకు సరైన స్పేస్, సౌకర్యవంతమైన సీటింగ్, ఆధునిక ఫీచర్లు, మంచి మైలేజ్‌ను అందిస్తోంది. నగర ప్రయాణాలకు, దూర ప్రయాణాలకు ఇది అనువైన ఎంపిక. అంతేకాకుండా, విస్తృత సర్వీస్ నెట్‌వర్క్, అందుబాటులో ఉండే స్పేర్ పార్ట్స్ వినియోగదారులకు అదనపు భరోసాను ఇస్తాయి. ప్రతి నెలా రికార్డు స్థాయి విక్రయాలు నమోదు కావడం, ముఖ్యంగా 7-సీటర్ విభాగంలో ఈ స్థాయి పెరుగుదల రావడం, కంపెనీకి మంచి సంకేతం.

భారత మార్కెట్లో కుటుంబాలకు అత్యంత ఇష్టమైన MPVల్లో ఒకటైన మారుతి సుజుకి ఎర్టిగా ప్రస్తుతం ధర, ఫీచర్లు, మైలేజ్ పరంగా మంచి విలువను అందిస్తోంది. కొత్త ఎర్టిగా బేస్ వేరియంట్ ధర రూ. 8.80 లక్షలు (ఎక్స్-షోరూమ్) నుంచి ప్రారంభమవుతుండగా, టాప్ వేరియంట్ ధర రూ. 12.94 లక్షలు (ఎక్స్-షోరూమ్) వరకు ఉంది. ఈ ధర పరిధిలో 7-సీటర్ కారును అందించడం మారుతి సుజుకి ప్రత్యేకతగా చెప్పుకోవాలి.

Maruti Suzuki Ertiga February 2026 Sales Recorded 17807 More Details Inside

ఇంజన్ విషయానికి వస్తే, కొత్త ఎర్టిగా 1.5-లీటర్ పెట్రోల్ ఇంజన్‌తో పాటు CNG ఆప్షన్‌లో కూడా లభిస్తోంది. ఇది వేరియంట్‌ను బట్టి 5-స్పీడ్ మాన్యువల్ లేదా 6-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో అందుబాటులో ఉంటుంది. సిటీ డ్రైవింగ్‌లో సౌకర్యం కోరుకునే వారికి ఆటోమేటిక్ మంచి ఎంపిక కాగా, మైలేజ్‌పై దృష్టి పెట్టేవారికి మాన్యువల్ వేరియంట్ సరైనది.

మైలేజ్ పరంగా కూడా ఎర్టిగా ఆకట్టుకుంటోంది. కంపెనీ ప్రకారం పెట్రోల్ మాన్యువల్ వేరియంట్‌కు 20.51 kmpl, పెట్రోల్ ఆటోమేటిక్‌కు 20.3 kmpl మైలేజ్ లభిస్తుంది. ఇక CNG మాన్యువల్ వేరియంట్ అయితే లీటర్‌కు 26.11 kmpl మైలేజ్ ఇస్తుందని పేర్కొంది. పెరుగుతున్న ఇంధన ధరల నేపథ్యంలో ఈ మైలేజ్ గణాంకాలు కుటుంబ వినియోగదారులకు పెద్ద ప్లస్‌గా మారాయి.

Maruti Suzuki Ertiga February 2026 Sales Recorded 17807 More Details Inside

ఫీచర్ల పరంగా కూడా కొత్త ఎర్టిగా వెనుకబడలేదు. ఇందులో 7-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌తో పాటు Android Auto, Apple CarPlay సపోర్ట్ అందుబాటులో ఉన్నాయి. అదనంగా ప్యాడిల్ షిఫ్టర్లు (ఆటోమేటిక్ వేరియంట్‌లో), కీలెస్ ఎంట్రీ, పుష్ బటన్ స్టార్ట్/స్టాప్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, క్రూయిజ్ కంట్రోల్ వంటి సౌకర్యాలు ఉన్నాయి. దీని వల్ల దీర్ఘదూర ప్రయాణాల్లో కూడా డ్రైవింగ్ అనుభవం మరింత సౌకర్యవంతంగా ఉంటుంది.

More from DriveSpark

Article Published On: Wednesday, March 4, 2026, 9:08 [IST]
English summary
Maruti suzuki ertiga february 2026 sales recorded 17807 more details inside
Read more on: #maruti suzuki #india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+