ఫోర్డ్ క్లాసిక్ సెడాన్ ధరలో లక్ష రూపాయల కోత

By Ravi

అమెరికన్ కార్ కంపెనీ ఫోర్డ్ ఇండియా దేశీయ విపణిలో విక్రయిస్తున్న 'ఫోర్డ్ క్లాసిక్' సెడాన్ అమ్మకాలను పెంచుకునేందుకు సన్నాహాలు చేస్తుంది. ఇందులో భాగంగా, ఫోర్డ్ క్లాసిక్ సెడాన్ ధరను వేరియంట్‌ను బట్టి రూ.70,000 నుంచి రూ.1,00,000 మేర తగ్గించనుంది. ఈ తగ్గింపు వలన ఫోర్డ్ క్లాసిక్ ఇప్పుడు కేవలం రూ.4.99 లక్షల ప్రారంభ ధరకే లభ్యం కానుంది. టాప్ ఎండ్ వేరియంట్ కేవలం రూ.7.6 లక్షలకే లభించనుంది.

ఇది కూడా చదవండి: ఫోర్డ్ క్లాసిక్ ఫీచర్లు, స్పెసిఫికేషన్లు, ధరలు, రివ్యూ

ఫోర్డ్ ఇండియా గడచిన 2012 మధ్య భాగంలో పాత ఫియస్టా సెడాన్‌ను క్లాసిక్‌గా పేరు మార్చి, ధరను తగ్గించి విడుదల చేసింది. డీజిల్ వెర్షన్ ఫోర్డ్ క్లాసిక్ టైటానియం వేరియంట్ గరిష్టంగా లీటర్ డీజిల్‌కు 32.38 కి.మీ. మైలేజీనిస్తుందని కంపెనీ (ఏఆర్ఏఐ సర్టిఫై చేసిన దాని ప్రకారం) కంపెనీ పేర్కొంది. డీజిల్ వెర్షన్ ఫోర్డ్ క్లాసిక్‌లో 1.4 లీటర్ డీజిల్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఇది గరిష్టంగా 68 పిఎస్‌ల శక్తిని, 160 ఎన్ఎమ్‌ల టార్క్‌‌ను ఉత్పత్తి చేస్తుంది.

Ford Classic

పెట్రోల్ వెర్షన్ ఫోర్డ్ క్లాసిక్ లీటరు పెట్రోల్‌కు 21.7 కి.మీ. మైలేజీని ఆఫర్ చేస్తుంది. ఇందులో 1.6 లీటర్ డ్యూరాటెక్ పెట్రోల్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఇది గరిష్టంగా 101 పిఎస్‌ల శక్తిని, 146 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

ఫోర్డ్ క్లాసిక్‌ టాప్-ఎండ్ వేరియంట్లో బ్లూటూత్ కనెక్టివిటీతో కూడిన స్టీరియో సిస్టమ్, వేగాన్ని బట్టి సౌండ్ తగ్గిపోయేలా ఏర్పాటు చేసిన స్పీడ్ సెన్సింగ్ వాల్యూమ్ కంట్రోల్స్, డ్రైవింగ్‌లో ఉన్నప్పుడు ఆటోమేటిక్‌‌గా లాక్ అయ్యే డ్రైవ్-అవే లాక్స్, బీజ్ ఇంటిరీయర్ ట్రిమ్, సరికొత్త అల్లాయ్ వీల్ డిజైన్, బాడీ కలర్‌లో ఉండే సైడ్ మిర్రర్స్, బ్లాక్ ఫ్రంట్ గ్రిల్ ఫీచర్లతో లభిస్తుంది.

ఫోర్డ్ క్లాసిక్ సెడాన్ ఆరు ఆకర్షనీయమైన రంగుల్లో (పాప్రికా రెడ్, పాంథర్ బ్లాక్, డైమండ్ వైట్, చిల్ మెటాలిక్, మూన్ డస్ట్ సిల్వర్, సీ గ్రే), ఇది రెండేళ్లు లేదా 1,00,000 కి.మీ. వారంటీతో లభిస్తుంది.

More from DriveSpark

Article Published On: Wednesday, January 15, 2014, 12:29 [IST]
English summary
According to sources, Ford India is trying to perk up its mid-sized sedan Ford Classic by slashing prices by Rs 70,000 to Rs 1 lakh across variants, with the entry level starting at Rs 4.99 and price top-most variant costing Rs 7.6 lakh.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+