ఫోర్డ్ క్లాసిక్ ఫీచర్లు, స్పెసిఫికేషన్లు, ధరలు, రివ్యూ

ఫోర్డ్ ఇండియా నుంచి గ్లోబల్ వెర్షన్ ఫియస్టా సెడాన్ విడుదలైన తర్వాత క్లాసిక్ ఫియస్టా అమ్మకాలు స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి. స్టయిలిష్ డిజైన్‌తో కూడిన 2012 గ్లోబల్ ఫియస్టా సెడాన్ అధిక ధర కారణంగా కొనుగోలుదారులు ఇప్పటికీ ఫియస్టా క్లాసిక్ సెడాన్‌ను కొనుగోలు చేసేందుకే మక్కువ చూపుతున్నారు. ఈ నేపథ్యంలో ఫియస్టా క్లాసిక్ సెడాన్ అమ్మకాలను మరింత పెంచేందుకు ఇందులో ఓ రిఫ్రెష్డ్ వెర్షన్‌ను కంపెనీ తాజాగా మార్కెట్లోకి ప్రవేశపెట్టింది.

ఫోర్డ్ ఫియస్టా క్లాసిక్ పేరులో ఫియస్టాను తొలగించి 'ఫోర్డ్ క్లాసిక్' అనే పేరుతో ఈ కొత్త వేరియంట్‍‌ను కంపెనీ విడుదల చేసింది (గ్లోబల్ ఫియస్టా, ఫియస్టా క్లాసిక్ పేరుతో వినియోగదారుడు తికమక పడకుండా ఉండేందుకు కోసం). సరైసమైన ధర, క్లాసిక్ లుక్, స్టయిలిష్ ఇంటీరియర్స్, సరికొత్త ఫీచర్లతో రూపొందించిన ఈ సరికొత్త ఫియస్టా క్లాసిక్ సెడాన్ మొత్తం ఆరు వేరియంట్లలో (మూడు పెట్రోల్, మూడు డీజిల్) లభ్యమవుతుంది.


ఫోర్డ్ క్లాసిక్ ధరలు రూ.5.53 లక్షల నుంచి రూ.7,82 లక్షల (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ) రేంజ్‌లో ఉన్నాయి. టాప్-ఎండ్ వేరియంట్ (ఫోర్డ్ క్లాసిక్ టైటానియం) డీజిల్ వెర్షన్‌ ధర రూ.7.82 లక్షలుగా ఉంది. ఇదివరకటి ఫోర్డ్ ఫియస్టా క్లాసిక్ టాప్-ఎండ్ డీజిల్ వేరియంట్ ధరతో పోల్చుకుంటే కొత్త ఫోర్డ్ క్లాసిక్ టైటానియం ధర సుమారు రూ.60,000 తక్కువగా ఉంది. అయితే, టాప్-ఎండ్ పెట్రోల్ వేరియంట్ ధరలో మాత్రం ఎలాంటి మార్పు లేకుండా యధావిధిగానే రూ.6.86 లక్షలుగా ఉంది.

ఫోర్డ్ క్లాసిక్‌లో కొత్తగా జోడించిన ఫీచర్లు:
ఫోర్డ్ క్లాసిక్ టైటానియం వేరియంట్‌లో సరికొత్త డిజైన్‌తో కూడిన అల్లాయ్ వీల్స్, బూట్ స్పాయిలర్, క్రోమ్ గ్రిల్, క్రోమ్ రిమ్మడ్ హెడ్‌ల్యాంప్స్, టర్న్ ఇండికేటర్లతో కూడిన క్రోమ్ మిర్రర్స్, ముందు వైపు ఫాగ్ ల్యాంప్స్ వంటి అనేక మార్పులును గమనించవచ్చు. ఇద కేవలం 4.9 మీటర్ల టర్నింగ్ రేడియస్‌ను మాత్రమే కలిగి ఉంటుంది.

ఇంటీరియర్స్ విషయానికి వస్తే.. ఇది వరకు నకిలీ ఉడ్ ప్యానెల్‌తో ఉన్న భాగాలను అల్యూమినియంతో రీప్లేస్ చేశారు. బూట్ రిలీజ్ ఇప్పుడు ఎలక్ట్రిక్ ఆప్షన్‌తో లభిస్తుంది (ఫోర్డ్ ఫిగో మాదిరిగా). ఫిగోలో ఉపయోగించిన బ్లూటూత్ ఆడియో సిస్టమ్‌ను ఫోర్డ్ క్లాసిక్‌లో కూడా ఉపయోగించారు. వెనుక సీటులో కప్ హోల్డర్‌తో కూడిన ఆర్మ్‌రెస్ట్, నాణ్యమైన ప్లాస్టిక్, ముందువైపు డ్రైవర్, ప్యాసింజర్ ఎయిర్‌బ్యాగ్స్, బీజ్ ఇంటీరియర్స్, ఆటోమేటిక్ వాల్యూమ్ కంట్రోల్, కీలెస్ ఎంట్రీ వంటి ఫీచర్లను జోడించారు.

ధరకు తగిన విలువ:
కొత్త ఫోర్డ్ క్లాసిక్ సెడాన్ ధర ఈ సెగ్మెంట్లోని టొయోటా ఎతియోస్ సెడాన్ కన్నా రూ.45,000 తక్కువ గాను, మారుతి సుజుకి స్విఫ్ట్ డిజైర్ (కొత్త కాంపాక్ట్ డిజైర్) సెడాన్ కన్నా రూ.45,000 ఎక్కువ గాను ఉంది. మొత్తమ్మీద ఫోర్డ్ క్లాసిక్‌లో లభించే ఫీచర్ల వలన ఇది ధరకు తగిన విలువను కలిగి ఉంటుందిన చెప్పవచ్చు.

ఇంజన్, పవర్, పెర్ఫామెన్స్, మైలేజ్:
డీజిల్ వెర్షన్ ఫోర్డ్ క్లాసిక్ గరిష్టంగా లీటర్ డీజిల్‌కు 32.38 కి.మీ. మైలేజీనిస్తుంది (ఏఆర్ఏఐ సర్టిఫై చేసిన దాని ప్రకారం). ఇందులో 1.4 లీటర్ డీజిల్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఇది గరిష్టంగా 68 పిఎస్‌ల శక్తిని, 160 ఎన్ఎమ్‌ల టార్క్‌‌ను ఉత్పత్తి చేస్తుంది.

పెట్రోల్ వెర్షన్ ఫోర్డ్ క్లాసిక్ మాత్రం ఇదివరకటి మాదిరిగానే లీటరు పెట్రోల్‌కు 21.7 కి.మీ. మైలేజీని ఆఫర్ చేస్తుంది. ఇందులో 1.6 లీటర్ డ్యూరాటెక్ పెట్రోల్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఇది గరిష్టంగా 101 పిఎస్‌ల శక్తిని, 146 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

ఫోర్డ్ క్లాసిక్ టైటానియం సెడాన్ ఆరు ఆకర్షనీయమైన రంగుల్లో (పాప్రికా రెడ్, పాంథర్ బ్లాక్, డైమండ్ వైట్, చిల్ మెటాలిక్, మూన్ డస్ట్ సిల్వర్, సీ గ్రే), ఇది రెండేళ్లు లేదా 1,00,000 కి.మీ. వారంటీతో లభిస్తుంది.

More from DriveSpark

Article Published On: Tuesday, July 17, 2012, 11:57 [IST]
English summary
Ford India has recently introduced a new variant in the Classic series (old Fiesta). The range topper Titanium variant is available in both petrol and diesel options with an array of new features. Well, what we are mainly talking is about the Ford Classic Titanium diesel model's record breaking fuel economy. The 1.4 litre diesel engine boasts whopping 32.38 Kmpl on the cheaper fuel.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+