ఫోర్డ్ ఈకోస్పోర్ట్ ఇప్పుడు ఆప్షనల్ డేటైమ్ రన్నింగ్ లైట్లతో!
ఫోర్డ్ ఇండియా అందిస్తున్న పాపులర్ కాంపాక్ట్ ఎస్‌యూవీ 'ఫోర్డ్ ఈకోస్పోర్ట్' ఇప్పుడు 'సిగ్నేచర్' ఎల్ఈడి డేటైమ్ రన్నింగ్ లైట్లతో లభ్యం కానుంది. ఇప్పటికే ఈ తరహా ఎల్ఈడి డేటైమ్ రన్నింగ్ లైట్లను అంతర్జాతీయ వెర్షన్ ఫోర్డ్ ఈకోస్పోర్ట్‌లో ఆఫర్ చేస్తున్నారు. తాజాగా ఈ ఫీచర్‌ను ఇండియన్ వెర్షన్ ఈకోస్పోర్ట్‌లో కూడా ఆఫర్ చేస్తున్నారు.
ఈకోస్పోర్ట్‌కు ఆప్షనల్ యాక్ససరీ ఈ ఎల్ఈడి డేటైమ్ రన్నింగ్ లైట్లను ఫోర్డ్ అందిస్తోంది. అన్ని రకాల ఫోర్డ్ ఈకోస్పోర్ట్ వేరియంట్లలోను ఈ ఆప్షనల్ ఎల్ఈడి డేటైమ్ రన్నింగ్ లైట్స్‌తో కూడిన హెడ్‌ల్యాంప్ యూనిట్‌ను అమర్చుకోవచ్చు. ఒకవేళ ఎవరైనా ఇప్పటికే ఫోర్డ్ ఈకోస్పోర్ట్‌ను కొనుగోలు చేసి ఉండి, తమ ఈకోస్పోర్ట్‌లలో కూడా ఈ తరహా లైట్లను అమర్చుకోవాలనుకుంటే కూడా అలా చేసుకునే వెసలుబాటు ఉందని కంపెనీ చెబుతోంది.
ఫోర్డ్ ఈకోస్పోర్ట్ 'సిగ్నేచర్' డేటైమ్ రన్నింగ్ లైట్ల ధర రూ.15,000. కంప్లీట్ ఫోర్డ్ ఈకోస్పోర్ట్ యాక్ససరీస్ కోసం ఈ లింక్‌పై క్లిక్ చేయండి.


Click it and Unblock the Notifications









