ఈ యాక్ససరీలతో మీ ఈకోస్పోర్ట్‌ను మరింత అందంగా మార్చుకోండి

By Ravi

అమెరికన్ ఆటో దిగ్గజం ఫోర్డ్ ఇటీవల భారత మార్కెట్లో తమ సరికొత్త కాంపాక్ట్ ఎస్‌యూవీ 'ఫోర్డ్ ఈకోస్పోర్ట్‌'ను విడుదల చేసిన సంగతి తెలిసినదే. మీ వద్ద ఓ ఫోర్డ్ ఈకోస్పోర్ట్ ఉండి, దానిని మరింత అందంగా స్టయిలిష్ మార్చుకోవాలనుకునే వారి కోసం కంపెనీ కొన్ని అదనపు యాక్ససరీలను ఆఫర్ చేస్తోంది.

చదవటం మర్చిపోయారా..? ఫోర్డ్ ఈకోస్పోర్ట్ టెస్ట్ డ్రైవ్ రిపోర్ట్

మీ ఫోర్డ్ ఈకోస్పోర్ట్ ఎస్‌యూవీకి ఈ అదనపు యాక్ససరీలను జోడించినట్లయితే, మీ కారును మరింత స్టయిలిష్‌గా, సౌకర్యవంతంగా మారి పోతుంది. మరి ఈకోస్పోర్ట్ కోసం ఫోర్డ్ ఇండియా అందిస్తున్న ఆ స్టయిలిష్ యాక్ససరీలు ఏంటో ఈ కథనంలో తెలుసుకుందాం రండి..!

15 ఇంచ్ అల్లాయ్ వీల్స్

15 ఇంచ్ అల్లాయ్ వీల్స్

ఈ లైట్ వెయిట్ అల్లాయ్ వీల్స్ డ్రైవింగ్ కంఫర్ట్‌ను ఆఫర్ చేయటమే కాకుండా, వాహనానికి మంచి స్టైల్‌ను కూడా ఇస్తాయి. ఇవి ప్రత్యేకమైన లాకింగ్ నట్స్‌తో లభిస్తాయి. వీటిని అమర్చుకోవటం వలన అనవసరమైన బరువు కొద్దిగా తగ్గుతుంది.

రియర్ స్పాయిలర్

రియర్ స్పాయిలర్

అధిక వేగాల వద్ద డ్రైవ్ చేసేటప్పుడు, ఇది కారుకు మంచి ఏరోడైనమిక్ స్టెబిలిటీని అందించడమే కారుకు స్పోర్టీ లుక్‌ని కూడా అందింస్తుంది. బాడీ కలర్ పెయింట్‌తో లభిస్తుంది. ఈజీ ఇన్‌స్టలేషన్ కోసం ఇంటిగ్రేటెడ్ స్టడ్స్, లాక్ నట్స్‌తో లభిస్తుంది.

ఫ్రంట్ ఫాగ్ ల్యాంప్స్

ఫ్రంట్ ఫాగ్ ల్యాంప్స్

శీతాకాలంలోనే కాకుండా, అన్ని రకాల వాతావరణాల్లో మరింత సేఫ్టీ లైటింగ్ కోసం ఈ ఫాగ్ ల్యాంప్స్ ఉపయోగపడుతాయి. ఇవి బ్రైట్ క్లియర్ లెన్స్‌తో, విశిష్టమైన రౌండ్ షేపులో ఉంటాయి.

ఎయిర్ డిఫ్లెక్టర్ (స్లిమ్‌లైన్ వెథర్‌షీల్డ్స్)

ఎయిర్ డిఫ్లెక్టర్ (స్లిమ్‌లైన్ వెథర్‌షీల్డ్స్)

అద్దాలను దించుకొని డ్రైవ్ చేస్తున్నప్పుడు వేడి గాలులు, వర్షపు చినుకులు కారు లోపలి ప్రవేశించకుండా ఉండేందు ఇవి చక్కగా ఉపయోగపడుతాయి. కారుకు మంచి స్పోర్టీ లుక్‌నిస్తాయి. ఇవి లైట్ వెయిట్ ఎఫ్ఆర్‍‌పి మెటీరియల్‌తో తయారు చేయబడి ఉంటాయి. నాలుగు డోర్లకు ఫిట్ అవుతాయి.

రూఫ్ ర్యాక్ ట్రే

రూఫ్ ర్యాక్ ట్రే

తరచూ దూరప్రయాణాలు చేసేవారు, లేదా ఎక్కువగా లగేజ్‌ను తీసుకువెళ్లే వారు ఈ రూఫ్ ర్యాక్ ట్రేను బిగించుకోవచ్చు. రూఫ్ రెయిల్స్‌ను డిస్ట్రబ్ చేయకుండా దీన్ని అమర్చుకోవచ్చు. ఇది 50 కేజీల వరకు బరువును మోయగలదు. కారుకు స్పోర్టీ, రగ్గడ్ లుక్‌నిస్తుంది.

రూఫ్ స్టయిలింగ్ రెయిల్స్, క్రాస్ బార్స్

రూఫ్ స్టయిలింగ్ రెయిల్స్, క్రాస్ బార్స్

ఈకోస్పోర్ట్ రూఫ్ మరింత స్టయిలిష్‌గా ఉండాలనుకునే వారు వీటిని అమర్చుకోవచ్చు. వీటిని రూఫ్ రెయిల్స్‌కు మధ్యలో ఫిక్స్ చేసుకోవచ్చు. ఇవి లగేజ్‌ను క్యారీ చేసేందుకు కూడా ఉపయోపడుతాయి. వీటిపై 50 కిలోల వరకు బరువును ఉంచవచ్చు.

స్పేర్ వీల్ కవర్

స్పేర్ వీల్ కవర్

బాడీ కలర్‌లో ఉండే ఈ స్పేర్ వీల్ కవర్ కారుకు వెనుక వైపు నుంచి మంచి స్పోర్టీ లుక్‌నివ్వటమే కాకుండా, స్పేర్ టైరుకు రక్షణ కవచంలా కూడా ఉపయోగపడుతుంది.

రివర్స్ పార్కింగ్ సెన్సార్స్

రివర్స్ పార్కింగ్ సెన్సార్స్

కారును సురక్షితంగా రివర్స్ చేయటానికి ఈ రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ చక్కగా ఉపయోగపడుతాయి. వెనుక వైపు ఏదైనా అవాంతరం/అడ్డంకి ఉంటే, ఈ సెన్సార్లు గుర్తించి డ్రైవర్‌ను అప్రమత్తం చేస్తాయి.

క్రోమ్ ఫినిషర్, ఫ్రంట్ గ్రిల్

క్రోమ్ ఫినిషర్, ఫ్రంట్ గ్రిల్

ఫోర్డ్ ఈకోస్పోర్డ్ ముందు వైపు నుంచి మరింత ప్రీమియంగా, మెరుస్తూ కనబడాలని కోరుకునే వారు రెగ్యులర్ ఫ్రంట్ గ్రిల్‌ను అప్‌గ్రేడ్ చేసుకోవచ్చు.

ఫ్రంట్ అండ్ రియర్ బంపర్ అప్లిక్యూస్

ఫ్రంట్ అండ్ రియర్ బంపర్ అప్లిక్యూస్

ఈ యాక్ససరీ బంపర్లను ప్రొటెక్ట్ చేయటమే కాకుండా, ఎస్‌యూవీకి మరింత స్పోర్టీ లుక్‌నిస్తుంది. ఇది సిల్వర్ కలర్ రెండు డిజైన్ ఆప్షన్లలో అందుబాటులో ఉంటుంది.

హెడ్‌ల్యాంప్ గార్డ్

హెడ్‌ల్యాంప్ గార్డ్

కారు హెడ్‌ల్యాంప్స్‌ను ప్రొటెక్ట్ చేసేందుకు ఇది సహకరిస్తుంది. ఇది హెడ్‌లైట్స్‌పై అధనపు రక్షక కవచంలా చిన్నపాటి స్క్రాచ్‌ల నుంచి వాటిని కాపాడుతుంది. అంతేకాకుండా, ఇది ఎస్‌యూవీకి స్పోర్టీ లుక్‌ని కూడా ఆఫర్ చేస్తుంది.

బగ్ డిఫ్లెక్టర్/బానెట్ ప్రొటెక్టర్

బగ్ డిఫ్లెక్టర్/బానెట్ ప్రొటెక్టర్

అధిక వేగంతో నడుపుతున్నప్పుడు పురుగులు విండ్‌షీల్డ్‌కు తగలకుండా ఉండేందుకు ఇది సహకరిస్తుంది. ట్రాన్స్‌పరెంట్ గ్రే కలర్‌లో ఇది లభిస్తుంది. దీనిని బానెట్‌కు ముందు భాగంలో ఫిట్ చేస్తారు. దీనిని లైట్ వెయిట్ ఎఫ్ఆర్‌పి మెటీరియల్‌తో తయారు చేశారు.

సైడ్ రన్నింగ్ బోర్డ్

సైడ్ రన్నింగ్ బోర్డ్

ప్యాసింజర్లు సులువుగా కారు లోపలి ప్రవేశించేందుకు, బయటకు వచ్చేందుకు ఇది సహకరిస్తుంది. వీటిని అమర్చుకోవటం వలం కారుకు స్పోర్టీ, రగ్గడ్ లుక్ వస్తుంది. ఈ సైడ్ బార్స్ సుమారు 150 కేజీల బరువును మోయగలవు.

మడ్ ఫ్లాప్స్

మడ్ ఫ్లాప్స్

ఈ మడ్ ఫ్లాప్స్ అన్ని వాతావరణాల్లో చక్కగా ఉపయోగపడుతాయి. ప్రత్యేకించి వర్షాకాలంలో వీటి ఉపయోగం ఎక్కువగా ఉంటుంది. బురద లేదా నీరు నిలిచి ఉండే రోడ్లపై ప్రయాణిస్తున్నప్పుడు టైర్లు చిమ్మే బురద/నీరు వెనుక వాహనాలపై పడకుండా ఉండేందుకు ఇవి ఉపయోగపడుతాయి.

కార్ కవర్

కార్ కవర్

కారును పార్క్ చేయటానికి గ్యారేజ్ లేని వారికి ఇది చక్కగా ఉపయోపడుతుంది. కారు తరచూ బయట పార్క్ చేసే వారుకు, తమ కారును ఈ కవర్‌తో కప్పగలిగితే దుమ్ము, ధూళి, వర్షం, ఎండల బారి నుంచి కారును కాపాడుకోవచ్చు.

More from DriveSpark

Article Published On: Wednesday, October 30, 2013, 14:05 [IST]
English summary
You can make you Ford EcoSport extra special by adding these accessories available at all ford showrooms. The most notable among them are the 15" Allow Wheels, Rear Spoiler, Front Fog Lamps, Spare Wheel Cover, Side Running Board, Reverse Parking Sensors, Air Deflectors etc.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+