ఫోర్డ్ ఈకోస్పోర్ట్: దీన్ని మించింది మరొకటి లేదు - సమీక్ష
Car Evaluation & Words by Jobo Kuruvilla
Photography: Ford India & Jobo Kuruvilla
గడచిన కొన్నేళ్లుగా నేను అనేక కార్లు నడిపాను, ఈసారి అనుభవం మాత్రం చాలా విభిన్నమైనది. ఫోర్డ్ ఈకోస్పోర్ట్ కారును టెస్ట్ డ్రైవ్ చేసేందుకు ఫోర్డ్ ఇండియా కంపెనీ వాళ్లు నన్ను గోవాకు ఆహ్వానించారు. గతంలో నేను ఎన్నో మోటార్‌సైకిళ్లను క్రాష్ చేశాను కానీ క్రాష్ టెస్టులో డమ్మీ ఉండాల్సిన స్థానంలో ఉంటానని కలలో కూడా ఊహించలేదు.
ఫోర్డ్ ఈకోస్పోర్ట్‌ను టెస్ట్ డ్రైవ్ చేస్తున్నప్పుడు ఈ కారుతో నేను పొందిన అనుభూతులను ఈ కథనం ద్వారా మీతో పంచుకుంటున్నాను..! ఈ కథనంలో ఫోర్డ్ ఈకోస్పోర్ట్ గురించి మీరు చదవబోయేది పూర్తిగా నా అభిప్రాయం మాత్రమే. ఈ కారును టెస్ట్ డ్రైవ్ చేస్తున్నప్పుడు అది సినీ ఫక్కీలో బోల్తా కొట్టింది. అయితే, అదృష్టవశాత్తు (నిజానికి అదృష్టం కాదు, ఫోర్డ్ ఎమర్జెన్సీ అసిస్టమ్ సిస్టమ్ వల్ల అని చెప్పవచ్చు) నేను కారు ప్రమాదం నుంచి ప్రాణాలతో బయటపడ్డాను.
చిన్న కారు ధరలో, మంచి స్పేస్, మెరుగైన మైలేజ్, సాటిలేని పెర్ఫామెన్స్, అత్యంత సరక్షితమైన ఫీచర్లు, అధునాతన టెక్నాలజీతో కూడిన వాహనం కొనాలనుకునే వారికి ఫోర్డ్ ఈకోస్పోర్ట్ బెస్ట్ ఆప్షన్ అని చెప్పవచ్చు. మరి ఈ అత్యుత్తుమ ఫోర్డ్ ఈకోస్పోర్ట్ కాంపాక్ట్ ఎస్‌యూవీకి సంబంధించిన విశేషాలేంటో ఈ సమీక్ష ద్వారా క్షుణ్ణంగా తెలుసుకుందాం రండి..!

ఓవర్‌వ్యూ
ఫోర్డ్ ఈకోస్పోర్ట్‌ను భారత్, ఆసియా మార్కెట్లను లక్ష్యంగా చేసుకొని అభివృద్ధి చేశారు. గడచిన సంవత్సరం ఢిల్లీలో జరిగిన 11వ అంతర్జాతీయ మోటార్ షోలో ఈ కారును ఆవిష్కరించారు. అప్పటి నుంచే ఈ కారుకు పెద్ద ఎత్తున క్రేజ్ ఏర్పడింది. భారీగా అభిమానులను సొంతం చేసుకుంది. మరి ఇది మార్కెట్లో ఇంత హైప్ సృష్టించడానికి గల కారణం ఏంటి, ఇందులో అంత స్పెషల్ ఏముందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రండి.

ఈకోస్పోర్ట్‌ను గ్లోబల్ బి-సెగ్మెంట్ ఫోర్డ్ ఫియస్టా ప్లాట్‌ఫామ్‌ను ఆధారంగా చేసుకొని అభివృద్ధి చేశారు. ఇది మొత్తమ్మీద నాలుగు మీటర్ల కన్నా తక్కువ పొడవును కలిగి ఉంటుంది. అయితే, వెడల్పు విషయంలో మాత్రం ఇది ఫియస్టా మాదిరిగానే ఉంటుంది. రూఫ్ రెయిల్స్, వెనుక డోర్‌కు అమర్చిన స్పేర్ వీల్స్‌తో ఈ లైట్ ఎస్‌యూవీ చూపరులను తొలి చూపులోనే ఆకట్టుకుంటుంది.

అంతగా ఇది నచ్చేయటానికి కారణం, దీని ఆకర్షనీయమైన డిజైన్ అనే చెప్పవచ్చు. ఆకట్టుకునే ఫ్రంట్ లుక్, స్టయిలిష్ న్యారో హెడ్‌ల్యాంప్స్, క్రోమ్ ఫినిష్డ్ గ్రిల్, క్రోమ్ ఫాగ్ ల్యాంప్స్‌తో ఇది అటు ప్రీమియం లుక్‌ను ఇటు స్పోర్టీ లుక్‌ను ఇస్తుంది. ఇలాంటి స్టయిలిష్ కారులో మీరు డ్రైవ్ చేస్తుంటే, రోడ్డుపై వేళ్లే వారంతా మీరు వైపు చూపు తిప్పటం కాయం.

ఈ కారును వెనుక వైపు నుంచి చూసినా కూడా అందగానే కనిపిస్తుంది. వెనుక డోరుకు మధ్య భాగంలో అమర్చిన స్పేర్ వీల్, సగం డోరుకు సగం బాడీకి ఉండే రియర్ టెయిల్ ల్యాంప్స్, విశిష్టమైన రియర్ విండ్‌షీల్డ్ డిజైన్‌తో ఇది స్పోర్టీ లుక్‌ను కలిగి ఉంటుంది. నిజం చెప్పాలంటే ఈ రియర్ స్పేర్ టైర్ వలన ఇది 90 దశకు ఎస్‌యూవీలను గుర్తుకు తెస్తుంది.

ఇంటీరియర్స్
ఫోర్డ్ ఈకోస్పోర్ట్ ఇంటీరియర్స్ చాలా ప్లెజంట్‌గా ఉండి, ప్లష్ అనుభూతినిస్తాయి.

ఇందులోని ప్రీమియం లెథర్ సీట్లు చాలా సౌకర్యవంతంగా ఉండి దూర ప్రయాణాలకు ప్రయాణించేందుకు సైతం అనువుగా ఉంటాయి. డ్రైవర్ సీటును డ్రైవర్ ఎత్తుకు తగినట్లుగా సర్దుబాటు చేసుకునే సదుపాయం ఉంది. అయితే, భారీకాయులకు మాత్రం ఈ సీట్లు కాస్తంత ఇరుకుగానే అనిపిస్తాయి. మొత్తమ్మీద డ్రైవింగ్ కంఫర్ట్, విజిబిలిటీ, హెడ్-రూమ్, లెగ్-రూమ్‌లు బాగానే ఉన్నాయి.

స్టీరింగ్ వీల్‌ను డ్రైవర్ సౌకర్యానికి తగినట్లుగా సర్దుబాటు చేసుకోవచ్చు. మేము డ్రైవ్ చేస్తున్న హైవేలపై ఈ ఎలక్ట్రిక్ స్టీరింగ్ చాలా లైట్‌గా అనిపించింది. మనదేశ ట్రాఫిక్ పరిస్థితులకు ఇలాంటి స్టీరింగ్ ఎంతో చక్కగా పనిచేస్తుంది.

ఫోర్డ్ ఈకోస్పోర్ట్‌లోని ఇన్‌స్ట్రుమెంట్ కన్సోల్ ఫోర్డ్ ఫియస్టా కన్సోల్‌ను అనుకరించినట్లు అనిపిస్తుంది. శూన్యం నుంచి దూరం, సగటు మైలేజ్, ఇన్‌స్టాంట్ మైలేజ్, సగటు వేగం, బయటి ఉష్ణోగ్రత తదితర వివరాలను చూపించే ఈ 3.5 ఇంచ్ డిస్‌ప్లే స్క్రీన్‌ను డ్రైవ్ చేస్తున్నప్పుడు చూడటంలో ఎలాంటి సమస్య ఉండదు. ఈ కారులో స్టార్ట్/స్టాప్ బటన్ కూడా ఉంది. క్లచ్ నొక్కి జస్ట్ ఈ బటన్ నొక్కితే కారు స్టార్ట్ లేదా స్టాప్ అవుతుంది.

వెనుక సీట్లను 60:40 నిష్పత్తిలో మడుచుకునే వీలుటుంది. ఎక్కువ లగేజ్‌ను తరలించాలనుకున్నప్పుడు ఈ సీట్లను పూర్తిగా తొలగించుకునే వీలు కూడా ఉంటుంది. ఈ సీట్లను అమర్చిన నెక్ రెస్ట్‌లను ఎత్తుకు తగిన విధంగా సర్దుబాటు చేసుకోవచ్చు.

ఫోర్డ్ ఈకోస్పోర్ట్ కాంపాక్ట్ ఎస్‌యూవీలో విశాలమైన బూట్ స్పేస్ ఉంది. ఉదహారణగా చెప్పుకోవాలంటే ఈ కారులో ఓ వాషింగ్ మెషీన్‌ను తీసుకువెళ్లేంత లగేజ్ స్థలం ఉందన్నమాట. దీని మొత్తం బూట్ స్పేస్ 362 లీటర్లు, వెనుక సీట్లను మడిచినప్పుడు ఇది 705 లీటర్లుగా ఉంటుంది.

ఫీచర్లు - ఇంటీరియర్స్
ఈరోజుల్లో ఎక్కువగా అడుగుతున్న ప్రశ్న అధనపు ఇంటీరియర్లు, ఎక్స్టీరియర్లను జోడించుకోవచ్చా? ఫోర్డ్ ఈకోస్పోర్ట్‌లో ఆ సమస్య లేదు. కంపెనీనే వివిధ రకాల ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫీచర్లను ఆఫర్ చేస్తుంది. ఈ ఫొటో చూస్తే మీకే అర్థమవుతుంది.

ఫీచర్లు - ఎక్స్టీరియర్స్
మీ ఈకోస్పోర్ట్‌ను మీకు నచ్చి విధంగా కస్టమైజ్ చేసుకునేందుకు, అధనపు ఎక్స్టీరియర్లను జోడించేందుకు ఫోర్డ్ ఇండియా విస్తృత శ్రేణి అవకాశాలను కల్పిస్తుంది. ఇదిగో అధనపు ఎక్స్టీరియర్ ఫీచర్లను చూడండి.

రోడ్డుపై..
డిస్క్/డ్రమ్ బ్రేక్ సెటప్‌తో ఫోర్డ్ తమ ఈకోస్పోర్ట్‌లో సమర్థవంతమైన బ్రేకింగ్ సిస్టమ్‌ను ఆఫర్ చేస్తుంది. అన్ని సందర్భాల్లోను బ్రేకింగ్ ఫీల్ సరిగ్గానే ఉందనిపించింది, పెడల్ ఫీడ్‌బ్యాక్ ఖచ్చితంగానే ఉంది. హ్యాండ్లింగ్ విషయంలో సస్పెన్షన్ ఇంకొంచెం ట్వీక్ చేసి ఉంటే బాగుండనిపించింది.

ఈకోస్పోర్ట్ సేఫ్టీ
సేఫ్టీ విషయంలో సందేహం అవసరమే లేదు. నా టెస్ట్ డ్రైవ్ పూర్తి కాగానే నేను ప్యాసింజర్ సీటులోకి మారాను. అప్పటి వరకు కోడ్రైవర్‌గా ఉన్న మరొక ఆటో జర్నలిస్ట్ డ్రైవర్ సీటులోకి మారాడు. అంతే, కారు ఒక్కసారిగా సినీ ఫక్కీలో బోల్తాకొట్టి ఇదిగో చివరకి ఇలా అయ్యింది. ఈ విషయంలో నా అనుభవాన్ని బట్టి చూస్తే, ఫోర్డ్ ఈకోస్పోర్ట్‌ను యుద్ధ ట్యాంక్ అంత పటిష్టంగా తయారు చేశారు. ఈ కారులో ప్రధానంగా
6 ఎయిర్‌బ్యాగ్స్, ఏబిఎస్, ఈబిడి, ఎమర్జెన్సీ అసిస్ట్ (నా ప్రాణం కాపాడింది అదే) వంటి ప్రధాన సేఫ్టీ ఫీచర్లున్నాయి.

క్లచ్
ఫోర్డ్ ఈకోస్పోర్ట్‌ను హైవేలపై, ఇరుకుగా ఉండే రోడ్లపై నడిపినప్పుడు క్లచ్‌ను ఇంకొంచెం మెరుగుపరచి ఉంటే బాగుండనిపించింది. షార్ట్ త్రో డిజైన్ కలిగిన కార్లను డ్రైవ్ చేయటానికి మీరు ఇష్టపడితే, వెంటనే మీరు ఈకోస్పోర్ట్‌ను ఎంచుకోవచ్చు.
ఈకోబూస్ట్ టెక్నాలజీ (వీడియో)
ఈ కారులో ప్రధానంగా చెప్పుకోదగనది ఈకోబూస్ట్ టెక్నాలజీ. ఈ టెక్నాలజీతో రూపొందించిన 1.0 లీటర్ ఈకోబూస్ట్ ఇంజన్ ఇప్పటికే అనేక అవార్డులను సొంతం చేసుకుంది. 123 హార్స్ పవర్‌ల శక్తిని ఉత్పత్తి చేసే ఈ ఇంజన్ 5-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్‌తో మాత్రమే లభ్యమవుతుంది.

మంచి, చెడు
మంచి: అధునాతన టెక్నాలజీ, భారతీయ రోడ్ల కోసం అత్యుత్తమ చిన్న సైజు ఇంజన్, ఎయిరీ ఇంటీరియర్స్, ఫ్యూచరిస్టిక్ స్టయిలింగ్ అండ్ వెల్ బ్యాలెన్స్డ్ లైట్ ఎస్‌యూవీ.
చెడు: హ్యాండ్లింగ్ కన్నా రైడ్ కంఫర్ట్ కోసం సెటప్ చేసిన గట్టి సస్పెన్షన్, బ్లైండ్ స్పాట్‌లకు కారణమయ్యే మందపాటి ఏ-పిల్లర్స్, హైవేలపై లైట్‌గా అనిపించే ఎలక్ట్రిక్ స్టీరింగ్, పొడవుగా ఉండే వ్యక్తులకు ఇరుకుగా అనిపించే డ్రైవర్/కోప్యాసింజర్ లెగ్ రూమ్.

చివరి మాట
భారత రోడ్లపై కేవలం చిన్న కారుకు పట్టేంత స్థలాన్ని మాత్రమే ఆక్రమించే లైట్ కాంపాక్ట్ ఎస్‌యూవీని, అధునాత టెక్నాలజీ, అత్యుత్తమ సేఫ్టీ ఫీచర్లు, ఫ్యూచరిస్టిక్ స్టయిల్ మరియు సరసమైన ధరతో కూడిన కొనుగోలు చేయాలనుకుంటే, మీకు ఫోర్డ్ ఈకోస్పోర్ట్ కన్నా మించిన మరొక బెస్ట్ ఆప్షన్ లేదని డ్రైవ్‌స్పార్క్ భావిస్తోంది.

ధర
మేము డ్రైవ్ చేసిన ఫోర్డ్ ఈకోస్పోర్ట్ 1.0 లీటర్ ధర ప్రస్తుతం రూ.7.89 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)గా ఉంది. తర్వాతి స్లైడ్‌లలో దేశంలోని ఇతర ప్రధాన నగరాల్లో ఫోర్డ్ ఈకోస్పోర్ట్ ధరలను పరిశీలించడి.

ఇంజన్స్:
1.5 లీటర్ పెట్రోల్: 110 హార్స్ పవర్, 140 ఎన్ టార్క్
1.5 లీటర్ డీజిల్: 90 హార్స్ పవర్, 204 ఎన్ టార్క్
1.0 లీటర్ ఈకోబూస్ట్ పెట్రోల్: 123 హార్స్ పవర్, 170 ఎన్ టార్క్

ట్రాన్సిమిషన్:
5-స్పీడ్ మ్యాన్యువల్
6-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్సిమిషన్‌ను కేవలం 1.5 లీటర్ పెట్రోల్ ఇంజన్‌తో మాత్రమే ఆఫర్ చేస్తున్నారు.

మైలేజ్:
1.5 లీటర్ పెట్రోల్: 15.6 కెఎమ్‌పిల్
1.5 లీటర్ డీజిల్: 22.7 కెఎమ్‌పిల్
1.0 లీటర్ ఈకోబూస్ట్: 18.9 కెఎమ్‌పిల్

కలర్ ఆప్షన్స్:
మార్స్ రెడ్
కైనెటిక్ బ్లూ
సీ గ్రే
మాన్‌డస్ట్ సిల్వర్
పాంథర్ బ్లాక్
డైమండ్ వైట్
చిల్

ఫోర్డ్ ఈకోస్పోర్ట్ వేరియంట్లు, ధరలు (జూన్ 2013 నాటికి):
ఫోర్డ్ ఈకోస్పోర్ట్ పెట్రోల్, డీజిల్ ఇంజన్ ఆప్షన్లతో మొత్తం 10 వేరియంట్లలో లభ్యమవుతుంది. వాటి ధరల వివరాలు ఇలా ఉన్నాయి:

ఫోర్డ్ ఈకోస్పోర్ట్ 1.5 లీటర్ పెట్రోల్ వెర్షన్ ధరలు (మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్):
- ఫోర్డ్ ఈకోస్పోర్ట్ 1.5 ఎమ్‌టి ఆంబీంటే - రూ.5.59 లక్షలు
- ఫోర్డ్ ఈకోస్పోర్ట్ 1.5 ఎమ్‌టి ట్రెండ్ - రూ.6.49 లక్షలు
- ఫోర్డ్ ఈకోస్పోర్ట్ 1.5 ఎమ్‌టి టైటానియం - రూ.7.51 లక్షలు
- ఫోర్డ్ ఈకోస్పోర్ట్ 1.5 ఏటి టైటానియం - రూ.8.45 లక్షలు
- ఫోర్డ్ ఈకోస్పోర్ట్ 1.0 ఎమ్‌టి టైటానియం - రూ.7.89 లక్షలు
- ఫోర్డ్ ఈకోస్పోర్ట్ 1.0 ఎమ్‌టి టైటానియం (ఆప్షనల్) - రూ.8.29 లక్షలు
- ఫోర్డ్ ఈకోస్పోర్ట్ 1.5 ఎమ్‌టి ఆంబీంటే - రూ.6.69 లక్షలు
- ఫోర్డ్ ఈకోస్పోర్ట్ 1.5 ఎమ్‌టి ట్రెండ్ - రూ.7.61 లక్షలు
- ఫోర్డ్ ఈకోస్పోర్ట్ 1.5 ఎమ్‌టి టైటానియం - రూ.8.62 లక్షలు
- ఫోర్డ్ ఈకోస్పోర్ట్ 1.5 ఎమ్‌టి టైటానియం (ఆప్షనల్) - రూ.8.99 లక్షలు
(అన్ని ధరలు ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)

ఫోర్డ్ ఈకోస్పోర్ట్ 1.5 లీటర్ పెట్రోల్ వెర్షన్ ధరలు (ఆటోమేటిక్ ట్రాన్సిమిషన్):
(అన్ని ధరలు ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)

ఫోర్డ్ ఈకోస్పోర్ట్ 1.0 లీటర్ పెట్రోల్ వెర్షన్ ధరలు (మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్):
(అన్ని ధరలు ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)

ఫోర్డ్ ఈకోస్పోర్ట్ 1.5 లీటర్ డీజిల్ వెర్షన్ ధరలు (మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్):
(అన్ని ధరలు ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)

హైదరాబాద్:
1.5పె ఆంబీంటే: రూ.568,937
1.5పె ట్రెండ్: రూ.661,545
1.5పె టైటానియం ఎమ్‌టి: రూ.764,340
1.5పె టైటానియం ఏటి: రూ.860,012
1.0లీ ఈకోబూస్ట్ టైటానియం: రూ.804,034
1.0లీ ఈకోబూస్ట్ టైటానియం ప్లస్: రూ.843,728
1.5డీ ఆంబీంటే: రూ.680,893
1.5డీ ట్రెండ్: రూ.774,518
1.5డీ టైటానియం: రూ.877,314
1.5డీ టైటానియం ప్లస్: రూ.815,989
(పె- పెట్రోల్, డీ- డీజిల్, ఎమ్‌టి - మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్, ఏటి - ఆటోమేటిక్ ట్రాన్సిమిషన్)

బెంగుళూరు
1.5పె ఆంబీంటే: రూ.568,937
1.5పె ట్రెండ్: రూ.661,545
1.5పె టైటానియం ఎమ్‌టి: రూ.764,340
1.5పె టైటానియం ఏటి: రూ.860,012
1.0లీ ఈకోబూస్ట్ టైటానియం: రూ.804,034
1.0లీ ఈకోబూస్ట్ టైటానియం ప్లస్: రూ.843,728
1.5డీ ఆంబీంటే: రూ.680,893
1.5డీ ట్రెండ్: రూ.774,518
1.5డీ టైటానియం: రూ.877,314
1.5డీ టైటానియం ప్లస్: రూ.915,989

మైసూర్
1.5పె ఆంబీంటే: రూ.568,937
1.5పె ట్రెండ్: రూ.661,545
1.5పె టైటానియం ఎమ్‌టి: రూ.764,340
1.5పె టైటానియం ఏటి: రూ.860,012
1.0లీ ఈకోబూస్ట్ టైటానియం: రూ.804,034
1.0లీ ఈకోబూస్ట్ టైటానియం ప్లస్: రూ.843,728
1.5డీ ఆంబీంటే: రూ.680,893
1.5డీ ట్రెండ్: రూ.774,518
1.5డీ టైటానియం: రూ.877,314
1.5డీ టైటానియం ప్లస్: రూ.915,989

చెన్నై
1.5పె ఆంబీంటే: రూ.568,937
1.5పె ట్రెండ్: రూ.661,545
1.5పె టైటానియం ఎమ్‌టి: రూ.764,340
1.5పె టైటానియం ఏటి: రూ.860,012
1.0లీ ఈకోబూస్ట్ టైటానియం: రూ.804,034
1.0లీ ఈకోబూస్ట్ టైటానియం ప్లస్: రూ.843,728
1.5డీ ఆంబీంటే: రూ.680,904
1.5డీ ట్రెండ్: రూ.774,562
1.5డీ టైటానియం: రూ.877,335
1.5డీ టైటానియం ప్లస్: రూ.916,024

కలకత్తా
1.5పె ఆంబీంటే: రూ.574,400
1.5పె ట్రెండ్: రూ.667,897
1.5పె టైటానియం ఎమ్‌టి: రూ.771,680
1.5పె టైటానియం ఏటి: రూ.868,269
1.0లీ ఈకోబూస్ట్ టైటానియం: రూ.811,755
1.0లీ ఈకోబూస్ట్ టైటానియం ప్లస్: రూ.851,828
1.5డీ ఆంబీంటే: రూ.687,430
1.5డీ ట్రెండ్: రూ.781,955
1.5డీ టైటానియం: రూ.885,738
1.5డీ టైటానియం ప్లస్: రూ.924,783

ముంబై
1.5పె ఆంబీంటే: రూ.586,181
1.5పె ట్రెండ్: రూ.681,596
1.5పె టైటానియం ఎమ్‌టి: రూ.787,506
1.5పె టైటానియం ఏటి: రూ.886,077
1.0లీ ఈకోబూస్ట్ టైటానియం: రూ.828,403
1.0లీ ఈకోబూస్ట్ టైటానియం ప్లస్: రూ.869,299
1.5డీ ఆంబీంటే: రూ.701,530
1.5డీ ట్రెండ్: రూ.797,992
1.5డీ టైటానియం: రూ.903,903
1.5డీ టైటానియం ప్లస్: రూ.943,750

అగర్తలా
1.5పె ఆంబీంటే: రూ.563,968
1.5పె ట్రెండ్: రూ.655,768
1.5పె టైటానియం ఎమ్‌టి: రూ.757,665
1.5పె టైటానియం ఏటి: రూ.852,501
1.0లీ ఈకోబూస్ట్ టైటానియం: రూ.797,012
1.0లీ ఈకోబూస్ట్ టైటానియం ప్లస్: రూ.836,359
1.5డీ ఆంబీంటే: రూ.674,946
1.5డీ ట్రెండ్: రూ.767,754
1.5డీ టైటానియం: రూ.869,652
1.5డీ టైటానియం ప్లస్: రూ.907,989

అహ్మదాబాద్
1.5పె ఆంబీంటే: రూ.571,421
1.5పె ట్రెండ్: రూ.664,434
1.5పె టైటానియం ఎమ్‌టి: రూ.767,678
1.5పె టైటానియం ఏటి: రూ.863,768
1.0లీ ఈకోబూస్ట్ టైటానియం: రూ.807,545
1.0లీ ఈకోబూస్ట్ టైటానియం ప్లస్: రూ.847,412
1.5డీ ఆంబీంటే: రూ.683,866
1.5డీ ట్రెండ్: రూ.777,900
1.5డీ టైటానియం: రూ.881,145
1.5డీ టైటానియం ప్లస్: రూ.919,989

భువనేశ్వర్
1.5పె ఆంబీంటే: రూ.574,803
1.5పె ట్రెండ్: రూ.668,364
1.5పె టైటానియం ఎమ్‌టి: రూ.772,219
1.5పె టైటానియం ఏటి: రూ.868,877
1.0లీ ఈకోబూస్ట్ టైటానియం: రూ.812,322
1.0లీ ఈకోబూస్ట్ టైటానియం ప్లస్: రూ.852,425
1.5డీ ఆంబీంటే: రూ.687,912
1.5డీ ట్రెండ్: రూ.782,501
1.5డీ టైటానియం: రూ.886,357
1.5డీ టైటానియం ప్లస్: రూ.925,431

ఛండీఘడ్
1.5పె ఆంబీంటే: రూ.565,212
1.5పె ట్రెండ్: రూ.657,213
1.5పె టైటానియం ఎమ్‌టి: రూ.759,335
1.5పె టైటానియం ఏటి: రూ.854,379
1.0లీ ఈకోబూస్ట్ టైటానియం: రూ.798,767
1.0లీ ఈకోబూస్ట్ టైటానియం ప్లస్: రూ.838,201
1.5డీ ఆంబీంటే: రూ.676,433
1.5డీ ట్రెండ్: రూ.769,445
1.5డీ టైటానియం: రూ.871,566
1.5డీ టైటానియం ప్లస్: రూ.909,990

గోవా
1.5పె ఆంబీంటే: రూ.558,999
1.5పె ట్రెండ్: రూ.649,990
1.5పె టైటానియం ఎమ్‌టి: రూ.750,989
1.5పె టైటానియం ఏటి: రూ.844,990
1.0లీ ఈకోబూస్ట్ టైటానియం: రూ.789,990
1.0లీ ఈకోబూస్ట్ టైటానియం ప్లస్: రూ.828,990
1.5డీ ఆంబీంటే: రూ.668,999
1.5డీ ట్రెండ్: రూ.760,989
1.5డీ టైటానియం: రూ.861,990
1.5డీ టైటానియం ప్లస్: రూ.899,989

స్టయిలిషన్ న్యారో హైడ్‌లైట్స్

క్రోమ్ ఫినిష్డ్ ఫాగ్ ల్యాంప్స్

క్లియర్ లెన్స్ రియర్ టెయిల్ ల్యాంప్స్

పెద్ద ఎయిర్ ఇన్‌టేక్ వెంట్స్‌తో కూడిన క్రోమ్ లైన్డ్ ఫ్రంట్ గ్రిల్

బ్లింకర్స్/టర్న్ ఇండికేటర్లతో కూడిన రియర్ వ్యూ మిర్రర్స్

స్టయిలిష్ ఫోర్డ్ ఈకోస్పోర్ట్ బ్యాడ్జ్

డీసెంట్ క్రోమ్ టైటానియం బ్యాడ్జ్

స్టయలిష్ 16 ఇంచ్ అల్లాయ్ వీల్స్

1.0 లీటర్ ఈకోబూస్ట్ ఇంజన్


Click it and Unblock the Notifications








