ఫోర్డ్ ఫిగో కాంపాక్ట్ సెడాన్ ఆవిష్కరణ - ఫొటోలు, వివరాలు
ప్రస్తుతం భారత మార్కెట్‌కు కాంపాక్ట్ సెడాన్ (సబ్-ఫోర్ మీటర్ సెడాన్) ఫీవర్ పట్టుకుంది. ఈ సెగ్మెంట్లో మొట్టమొదటిగా మారుతి సుజుకి తమ సరికొత్త స్విఫ్ట్ డిజైర్‌ను ప్రవేశపెట్టింది. ఆ తర్వాత, ఈ విభాగంలోకి ప్రవేశించేందుకు అనేక కంపెనీలు క్యూ కడుతున్నాయి. ఇప్పటికే హోండా తమ అమేజ్‌ను ప్రవేశపెట్టగా, తాజాగా.. అమెరికన్ ఆటో దిగ్గజం ఫోర్డ్ తమ పాపులర్ స్మాల్ కార్ ఫిగో ప్లాట్‌ఫామ్‌పై తయారు చేసిన 'ఫిగో కాంపాక్ట్ సెడాన్' కాన్సెప్ట్‌ను సోమవారం ఢిల్లీలో ఆవిష్కరించింది.
ఇది కూడా చదవండి: టాటా జెస్ట్ కాంపాక్ట్ సెడాన్ - వివరాలు
భారత్‌లో ఫోర్డ్ ఫిగో హ్యాచ్‌బ్యాక్, ఫోర్డ్ ఈకోస్పోర్ట్ కాంపాక్ట్ ఎస్‌యూవీలు విజయవంతం కావడంతో మరో పటిష్టమైన కారును మార్కెట్లోకి తీసుకురావాలనుకున్నామని, ఆ దిశలో భాగంగానే, ఈ ఫోర్డ్ ఫిగో కాంపాక్ట్ సెడాన్ కాన్సెప్ట్‌ను పరిచయయం చేస్తున్నామని ఫోర్డ్ ఇండియాకు కొత్త అధ్యక్షుడిగా నియామకమైన నీగెల్ హ్యారిస్ అన్నారు. అయితే, ఈ కారును వాణిజ్య పరంగా ఎప్పుడు మార్కెట్లోకి అందుబాటులోకి తీసుకువచ్చే విషయాన్ని ఆయన వెల్లడించలేదు.
ఫోర్డ్ ఫిగో కాంపాక్ట్ సెడాన్‌కు సంబంధించిన మరిన్ని వివరాలను క్రింది ఫొటో ఫీచర్‌లో పరిశీలించండి.

గడచిన సంవత్సరం చివర్లో ఫోర్డ్ బ్రెజిల్‌లో ఆవిష్కరించిన 'కా కాన్సెప్ట్' (Ka Concept) హ్యాచ్‌బ్యాక్‌కు కాంపాక్ట్ సెడాన్ రూపమే ఈ ఫోర్డ్ ఫిగో కాన్సెప్ట్. ఈ ఏడాది చివరి నాటికి ఇది ఉత్పత్తి దశకు చేరుకుంటుందని ఫోర్డ్ ఇండియా ప్రెసిడెంట్ నీగెల్ హ్యారిస్ తెలిపారు.

ఈ కొత్త ఫోర్డ్ ఫిగో కాన్సెప్ట్‌ను కంపెనీ యొక్క గ్లోబల్ డిజైన్ ఫిలాసఫీని ఆధారంగా తయారు చేసుకొని డిజైన్ చేశారు. దీని ఫ్రంట్ గ్రిల్ ఆస్టన్ మార్టిన్ మాదిరిగా అనిపిస్తుంది.

రీడిజైన్డ్ హెడ్‌ల్యాంప్స్ (ఈ కాన్సెప్ట్ లోని ఎల్ఈడి ల్యాంప్స్ ప్రొడక్షన్ వెర్షన్‌లో ఉండకపోవచ్చు), కొత్త బంపర్స్, కొత్త టెయిల్ ల్యాంప్ డిజైన్ వంటి మార్పులను ఇందులో ప్రధానంగా చెప్పుకోవచ్చు.

కొత్త ఫోర్డ్ ఫిగో కారులో కంపెనీ నుంచి అత్యంత పాపులర్ అయిన 1.0 లీటర్ ఈకోబూస్ట్ పెట్రోల్ ఇంజన్‌ను అలాగే 1.5 లీటర్ టిడిసిఐ టర్బో డీజిల్ ఇంజన్‌ను ఉపయోగించే ఆస్కారం ఉన్నట్లు సమాచారం.

ఈ కొత్త ఫోర్డ్ ఫిగో కాన్సెప్ట్ మెరుగైన మైలేజీని ఆఫర్ చేయటమే కాకుండా, కారులోని కస్టమర్లకు సౌకర్యవంతమైన ప్రయాణ అనుభూతిని కల్పించనున్నట్లు తెలుస్తోంది.

కొత్త ఫోర్డ్ ఫిగో కాంపాక్ట్ సెడాన్ కాన్సెప్ట్‌ను ఆవిష్కరిస్తున్న ఫోర్డ్ ఇండియా ప్రెసిడెంట్ నీగెల్ హ్యారిస్.

12వ ఎడిషన్ ఢిల్లీ ఆటో ఎక్స్‌పోను మా డ్రైవ్‌స్పార్క్ బృందం ప్రత్యక్షంగా కవర్ చేస్తోంది. ఈ ఆటో ఎక్స్‌పోకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్ కోసం మా వెబ్‌సైట్‌ను సందర్శిస్తూ ఉండండి.


Click it and Unblock the Notifications








